నా విరితోటను సం రక్షించే బాధ్యతను
నీకే అప్పగిస్తున్నానుసుమా!
ఇది గులాబీల గుబాళింపులతో
సురభిళపరిమళాలనువెదజల్లే
సుందర నందనవనమన్న మాటమరువకు!
నా ఈ తోటను ప్రాణప్రదంగా చూసుకోవడం
క్షణమాత్రమేనా ఏమరువకు సుమా!!
ముఖ్యంగా ఈ గులాబీ మొక్కలను
శ్రద్ధగా పోషణచేయాలిసుమా!
ఈ గులాబీపూల సువాసన
నాకత్యంత ప్రీతిపాత్రమైనది.
ఎప్పుడయినా ఒక గులాబీ పువ్వును నాజడలోతురమగాచూడు
దానిపరిమళం ఎంతటి వారినయినా ఇట్టే ఆకర్షించేలా సిద్ధమవుతుంది.
ఆగులాబీ చెట్లను పుష్టిగా పెరిగేలా చూడు.
దానిచుట్టూ కలుపుమొక్కలు అసలుపెరగకూండా జాగ్రత్తపడు.
అనునిత్యం ఆపూలు దరహాసచంద్రికలను వెదజల్లేలా కాపాడు.
ఎంతో ప్రేమతో నీకు ఈ తోటమాలి ఉద్యోగాన్ని ఇచ్చాను.
ఈతోటపోషణలో నీకు మంచి భాగస్వామ్యాన్ని కల్పించాను.
నీకెదురైన గులాబీ పూలు ఎదురుపడి యదాలాపంగా నవ్వితే
నీ కటాక్ష వీక్షణాలను వాటిపైప్రసరింపజేయడం మరువకు.
నీ ప్రేమపురస్సరమైన హృదయస్పందనలను అనుగుణంగా
ఈతోటలోని పూలు విరబూయాలన్నదే నాఈప్సితార్ధం.
నీవు పెద్దగా అనుభవమున్న తోటమాలివికాదని నేరుగుదును.
నీకున్న అనూహ్యమైన అనురాగం, అనుభూతి చాలు ఈ తోటను
కలకాలం సమ్రక్షిస్తూ నాకు ఆనందాన్ని పంచిపెట్టడానికి.
ఆపూలమొక్కలెప్పుడయినా వాతావరణానుకూలతలేక
వాడుముఖం పెట్టినేట్లనిపిస్తే వాటిని ఓదార్పుతో లాలించుసుమా!
అవి ఎప్పటికీ కన్నీటి సంద్రాలలో మునిగిపోవడం నాకిష్టంలేదని తెలుసుకోచాలు.
నీ వరదహస్తంతోవాటిని అభయముద్రనొసంగి కాపాడు.
నీ లానా ఆలనా పాలనలలో ఈతోట ఆదర్శవంతమై వర్ధిల్లాలనే నా ఆకాంక్ష!
ఆవిషయం మాత్రమనవరతం గమనంలోపెట్టుకో మరువకు!.
=====================================

No comments:
Post a Comment