Thursday, January 7, 2016

ఒకప్పుడిక్కడ
పచ్చని పంటపొలాల రెపరెపలు
పైరుజొంపాలు తలలూపేసవ్వడులూ వినబడుతుండేవి.
పొలాలమధ్యన కుంటల ఒడ్డునకూర్చుని
ఇంటిల్లిపాదీ చద్దిమూటలు విప్పుకుని
కొత్త ఆవకాయ బద్దలు నంజుకుతినే
రైతాంగపు పల్లెదనం ప్రభవిస్తూ వుండేది.
నదీమతల్లి సొగసులొలకబోస్తూ వయ్యారంగా
నడుముత్రిప్పుతూ ప్రవహించే కృష్ణమ్మ పరవళ్ళు
పరవశింపజేస్తూ మనసును ఆహ్లాదపరిచెది.
ఒడ్డుకవతలగా లంకగ్రామాల సం రంభం
కనుల్కింపుగా దర్శనమిస్తూ దరహాస చంద్రికలను
వెదజల్లుతూ ఎగిరెగిరిపడే పల్లె పాటల పండుగలుండేవి.


ఇప్పుడిక్కడ చిత్రపటమంతా మారిపోతున్నదట,
పంటలుపండించే పొలాలన్నీ రాజధానికోసం
ధరబోయడం మొదలయిందట, ఆకాశహర్మ్యాలే
కనులకు పంటగా మిగిలిపోవడం ఖాయమని తేలిపోయిందట.
లంక గ్రామాలన్నీ మంత్రివర్యుల దాహార్తికోసం
వారి వారి ఆస్తులచిట్టాల్లొకి ఎగబ్రాకిప్రజలను
పరిహాసం పాలుజేసి పొట్తచెక్కలయ్యేలా నవ్వుకోవడమే
చివరకు మిగిలే సంబరమని అందరికీ టముకు వెసి చెబుతున్నారట.
===========================================

No comments:

Post a Comment