అందంగా అలవోకగా నడిచివచ్చే ప్రపంచమే నాకు స్ఫూర్తిమంతమై
నేరుగా గుండె గొంతుకలోకి స్వేఛ్చగా ప్రవహిస్తుంది.
సాహితీ ప్రపంచమలుంఘనీయమని గుర్తెరుగుదును
అయిన మా ఇంటి పెద్దలనుంచి వారసత్వంగా
సంక్రమించిన అద్భుతమైన కళను కాదనే ధైర్యం లేదునాకు.
బహుమతులనందుకొనని రోజుల్లోకూడా బాసటగానిలిచింది
కానుకలొచ్చిన సమయాన కళకళలాడుతూ కౌగలించుకున్నది.
ప్రతి ప్రభాతన పలువరసను దాటి వెల్వడే నవ్వును ప్రకటించి
నన్ను ఇట్టే ఆకట్టుకోగలిగిన కనికట్టు విద్యనేదో కనిపెట్టిన ఘనత తనది.
ఊరించి ముగ్గులోకి లాగడంలో మూర్తీభవించిన సౌశీల్యం తనది.
కళ్ళకు శ్రమనిపించినా కట్టిపడేసి గంటలతరబడి
తనవెంటబెట్టుకుని త్రిప్పగల సౌమనస్యానికి ప్రతీక తను.
ప్రాచీనమా? అర్వాచీనమా ?అన్న అస్తి నాస్తి విచికిత్సలోకి నెట్టేసి
పరువును కాపాడుకుంటూ నడిపించగల సౌహార్దం ఆ ప్రపంచానిది.
కవితామయప్రపంచంలో కట్టుబాట్లకులొంగిపోకుండా కదనరంగంలో
క్రమ శిక్షణకుపేరొందిన సుశిక్షితుడైన సైనికుడిలా అడుగులు ముందుకు వేయిస్తూ
మురిసిపోయే ముచ్చటైన సంప్రదాయం తనది.
కధలుగానో , నవలలుగానో, విడిపోయి పాయలు పాయలుగా ప్రవహించే
ఒదిదుడుకులకు జడుసుకోని ఒద్దికైన ప్రపంచం తనది.
'మంచి పుస్తకం చెంతన మనసంతా చల్లనానే మనోహరమై,
సువిశాలమై విలసిల్లే సుందర బృందావనన సుమ సౌరభం తన స్వంతం.
ఆ సన్నిహితమై సాంత్వన కలిగించే పుస్తకప్రపoచానికి
దాసోహమై , నేను ధన్యతను సంపాదించుకోనివ్వగల శక్తినందివ్వమని ప్రణతులిడుతూ -
సెలవు సెలవు.....మన్నించమని ఆ సాహితీమతల్లిని మనసారా వేడుకుంటూ---------------
=============================================================

No comments:
Post a Comment