ప్రణయాంజలి
-----------------రావెల.
------------------------------------
కవితలను ప్రేమించడం
ప్రారంభమయిన దగ్గరనుంచీ
ఆకవితామతల్లి సేవలో
బ్రదుకుబాటలో వెన్నెలను
పూయించుకోవడమ్నాకు సంప్రాప్తించిన
సౌభాగ్యంగా భావిస్తుంటాను.
ఈమధ్య ఓ వవలాకారుడు
తన ఇతివృత్తమంతటినీ
కవితామయంగా తీర్చిదిద్ది
మానవ సంబంధాలను
మహోత్తమంగా తీర్చిదిద్దేలా రచనలు
గావించినందుకు బహుదా ప్రశంసలనందుకోవడం
కళ్ళారాగమనించి తృప్తిగా శ్వాసించాను.
నాలో అలామొదలైన కవితాదాహం
నేను కాగితాలన్నింటినీ ఖరాబుచేసేదాకా
ఖాళీగా కూర్చోలేకపోయాను.
నన్ను నిద్రపోనీక,తను నిద్రలేమితో
అవస్థలు పడుతూ నన్ను ఆందోళనకు
గురిచేసి గుట్టుగా గురకపెట్టడం మొదలెట్టింది.
కానీ అక్షరాల అల్లికలో, పదాలపోహళింపులో
సతమతమయి పలు దశాబ్దల కాలం ఇట్టే గడిచిపోయింది.
కానీ చివరంటానేనొక కవిత్వ ప్రేమికుడిగా
నిలిచిపోవడం గర్వ కారణంగా అనుకుంటుంటాను.
ప్రారంభ దిశలో నాకవితలను చదివి
లబ్ధ ప్రతిష్టులు తగు సూచనలు చేసి నన్ను
మెప్పించి మురిసిమెరిసే దిశలో కృతార్ధుడిని చేసారు.
ఇప్పటికి నా శైలి నాదయి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
వారి వారి సూచనలు అప్పిసెం ఆచరణయోగ్యమేనని ఇప్పటికీ
మనసా,వాచా,కర్మణా భావిస్తూ వుంటాను.
ఆయాకవితా జిజ్ఞాసులకు అనవరతం కృతజ్ఞతలు
తెలియజేస్తూ నాహృదంతరాళాల్లో వారిని
గౌరవంతో గుర్తుంచుకుంటూ వుంటాను.
ఈ నాకవితాప్రయాణం సమాజహితం దిశగా ముందుకడుగులు
వేయాలని ఆశిస్తూ అందరిదగ్గరా సెలవుతీసుకుంటున్నాను.
[5 దశాబ్దాల నా కవితాయానాన్ని మూల్యాంకనం గావిస్తూ]
No comments:
Post a Comment