Saturday, January 2, 2016

హృదయ ఘోష
---------------------రావెల.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్


సామ్రాజ్యమంతా శిధిలమై పోయింది
వసంతం వచ్చివెళ్ళిందని
గొంతు బొంగురుపోయిన కోయిలమ్మ చెప్పింది.

అడవిదారంతా ఇంకా రాలిపడిన
ఎండుటాకులమయమయమై మిగిలింది.

కరువు కాలమే ఎదురొచ్చి స్వాగత వచనాలు
దీన స్వరంతోపలికి తిరిగి వెళ్ళిపోయింది.

పూలచెట్లన్నీ గ్రీష్మంలోకూడా
అశ్రు బిందువులను రాల్చిన ఉదాహరణలే కోకొల్లలు.


ప్రవాసం బాధాకరమేననితెలిసినా
ఇంతగా విషాదసాగరమై రోదిస్తుందని ఊహించలేదు.

అంటుకున్న అడవులను ఆర్పుకోవడంలోనే
గ్రీష్మర్తువంతా గొడవ గొడవగా సాగింది.

ఒక్కోకవితకు వేలసంఖ్యలో ప్రతిఫలముందన్నా
కవితను రాసే మహాకవులు కనపడడంలేదు.

బట్టబుర్రను మునివ్రేళ్ళతో గోక్కోవడమే
నిత్యకృత్యమై మిగిలిపోయింది.

[ఎనిమదవ శతాబ్దపు చైనీస్ కవితకు అనువాదం---]

No comments:

Post a Comment