Friday, January 22, 2016

నిద్రంటూ రాని కనులతో
నీ నేత్రాంచలాల్లోకి
నేరుగా తొంగిచూస్తున్నాను.
అనుమానపు పొరలేవో
నిన్నంటిపెట్టుకుని
వదిలిపోవడంలేదని గ్రహించాను.

శాంతివచనాలనుమాత్రమే వల్లించే
నా హృదయ కవాటాల్లోంచి
భ్రాంతిగా నీ మనసుపొరల్లోకి
దూరిపోవాలని విశెషంగా శ్రమిస్తున్నాను!


అనుకోకుండా వచ్చిన స్వప్నం
నన్ను నిరాయుధిడినిచేసి
శృంఖలాబద్ధుడిని చేసింది.

ఆ స్వప్నానికీ, నీ
ప్రణయానురాగబంధానికీ
అవినాభావసంబంధమేదో
అల్లుకునిపోయివుంటుందని
 నా అనుమానం!

నీడలాంటి నిజమేదోకూడా
నన్ను వెన్నంటి వేధిస్తుంటుంది!
గాలిలోతేలియాడుతూ నా ఊపిరిని
బిగబట్టి బంధించి వేస్తుంది!!

మనసుకేదో సంకెలలు  చుట్టిపడేసాయా?
వాచాలత్వమేదో వగరు వగరుగా
 మాటలు దొర్లిస్తున్నట్లున్నది.

అంతటా అనూహ్యమైన అయోమయమే
రాజ్యమేలుతున్న భవన.
ఏదీ ఇతమిద్ధంగా
తేలిపోయేలాలేదు!రుజువయేయొగమూ
ఉన్నట్లులేదు!

ఏది సత్యం? ఏది అసత్యం?

ఈవిచికిత్సలోనే జీవితం
నిండా మునిగిపోయేలా వుంది!
ఊపిరినంతా బిగదీసి
ఉఛ్చ్వాస నిశ్వాసలను
కత్తిపడేస్తున్నది.

ఆవిడచూపులోనూ ప్రకటించేతీరులోనూ

వైవిధ్యమేదోకొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఏదీనాస్వంతంకాదన్న అద్వైతభావం
నన్ను అనవరతమలరిస్తూపోతున్నది.
దూరంగా విసిరివేయాలని విభిన్నంగా
ప్రయత్నిస్తూ వైఫల్యం చెందుతున్నది!
ఆమేమో నాచూపులకతీతంగా
విహగమై విశాలగగనంలో
విహరిస్తూ అలరిస్తూ అనుభూతిప్రపంచంలో
ముంచేస్తూ మురిసిపోతున్నది.
=============================

No comments:

Post a Comment