Saturday, January 16, 2016

ఇప్పుడేనీ ప్రేమ పుస్తకాన్ని
చదవడం ప్రారంభించాను
ఉత్సాహం ఉరకలు వేయడం మొదలెట్టుంది.
ఎక్కడా నట్టుబడలేదుగా
ఆలోచనా స్రవంతి ధృతికి అచ్చెరువొందాను.

ప్రేమ గుడ్డిదంటారు సరే కాదనలేం
నీ హృదయగతభావాలనూ అనుసరించడమూ
అంధత్వమేమొననితోస్తున్నది అందుకే సుమా!
ఆఖరు పుటదగ్గర అసంబద్ధమనిపించి ఆగాను
ప్రణయం అగ్ని ప్రవేశం చేసిందెమో మరి.

ఈ రామాయణం కట్టుకధేనని ఇందులోభావాలు
తేనెను ఒంటినిండా పులుముకున్న చురకత్తులేమొ ననిపించింది.

అప్పుడే ఆకమురుకంపుకొడుతున్న పుస్తకాన్ని అవతలకు
గిరవాటువేసి కళ్ళు మూసుకున్నాను
ఇప్పుడుక ప్రేమరాహిత్య భావనలో హాయిగా స్వతహాగా
నాకునేను స్వతంతంత్రభావనల్లో ఊపిరిపీల్చుకుంటూ
కంటినిండా కమ్ముకొస్తున్న కునుకుతో ఆదమరిచి హాయిగా
నిదురపోయాను,యేకల్మషానికీ ప్రతీక కాని చందమామ
నవ్వుతూ నావైపే తన దృష్టిని సారించి హాయిగ నిదురపొమ్మని
శాసించాడు--ఎంత హాయి ఈరేయి ఎంతమధురమీ హాయి
 మత్తుగా గమ్మత్తుగా----మెలకువ వొచ్చేసరికి తెల్లవారింది.
భ్రమల్లోంచి నాకూ తెలివిచ్చి
వెనువెంటనే నా అమయకత్వానికి సరిపోలని
నీ అభిజ్ఞతకు తెరలు తెరలుగా నవ్వొచ్చింది.
ఇతిశివం....


No comments:

Post a Comment