స్వయం చోదితం
----------------- -------------- రావెల
వేదనాభరితాంతరంగంతో
శతాబ్దాలతరబడి సాన్నిహిత్యం పెరిగి
ఆసాంతం దు ఖ:భాజనుడనౌతుంటాను.
పంజరంలో బంధించబడిన విహంగంలా
శృంఖలాబద్ధనై శారీరకమైన బాధలతో
స్రుక్కి సోలిపోతూ వుండటం అలవాటయిపోయింది.
నాలోనే నిరంతరం కదలడుతూ
అనూహ్యంగా అలజడులకు కారణభూతమైన
అంతరంగ కధనాలకు వెరచి భయ భ్రాంతులతో
నిరుత్తరుడనై నిలచి పోతుంటాను.
ఇక్కడనేనంటూ నివాసంలేనని చెప్పాలని
బిగ్గరగా ప్రయత్నించినా డగ్గుత్తికతో
దయాహీనంగా స్థిరపడిపోతాను.
ప్రతిరోజూ ఇలా సమస్యల వలయంలో చిక్కుబడిపోతూ
ఆగ్రహోదగ్రమైన వాతావరణం ఓ కొలిక్కి వచ్చేసరికి
నాలో ఇంతకుముందు పరిచయంకాని దివ్యమైన శక్తులేవో ప్రవేశించి
నన్ను నిరంతరం సముదాయించాలనీ,మంత్రముగ్ధుడినిగావించాలనీ
వివిధరకాలుగా ప్రయత్నాలను కొనసాగిస్తూ వుంటుంది సాయపడగా
ప్రేమామృతం ఒక నదిలా ప్రవహిస్తూ పైకి
ఎగిరెగిరిపడుతూ
హృదయం కట్టలు దాటి పొంగిపోతూ వుంటుంది.
ఎక్కడినుంచోకొందరు బలాఢ్యులు రాబందుల్లా నేలమీదకు దిగబడి
నన్ను నీ కనుసన్నలకు దూరంగా తీసుకుని తరలి వెళ్లాలని
తమ తమ ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తూ వుంటారు.
నా మనసేమో కొన్ని కాంతిసంవత్సరాలకన్న వేగంగా
పయనిస్తున్నాయనడానికి దాఖలాలు కోకొల్లలు.
వీటన్నింటినీ సన్నిహితంగా గమనించిన నా అంతరంగం
నీఅంకిత భావానికి మురిసి తన్మయత్వం చెందుతూ వుంటుంది.
నాగొంతుక సమయనుకూలంగా చేసే శబ్దాలన్నీ
నీకు ప్రత్యక్షంగ వినిపించాలని యత్నించినా
గొంతుక సహకరించక, మౌనరాగాన్నలపిస్తూ వుంటాను.
ఈ క్షణాలలోనే నిరంతరం నీలో ఐక్యమై నిలిచి
మనుగడ సాగించాలన్న
తపనకూడా వృద్ధిచెందుతూ కలవరపెడుతూంటుంది.
ఆరుగాలాలపాటూ నీఅభిమాన చంద్రికలే నన్ను
నిరాశానిస్పృహల చీకట్లలోంచి వెలికి లాగుతూ
వెలుగురేకలు బహుదా విచ్చుకునేలా సాయపడుతూ వుంటాయి .
ఆనందం జీవనదిగా నాలో నిరంతరం ప్రవహిస్తున్నంత కాలం
నా చిత్తంలో తిష్టవేసిన నీ చిత్తరువు నన్ను సందర్భానుసారిగా
హెచ్చరిస్తూ మార్గదర్శిగా మారి మున్ముందుకు సాగుతూ వుంటుంది.
============================================

No comments:
Post a Comment