నీ నేత్రద్వయం వైపు నేను నా చూపు సారించినపుడల్లా
కాంతి వంతమై విరాజిల్లే ఆ కటకాలమీదనే
నాదృష్టి స్థిరోభవమన్నట్లు నిలబడిపోతుంది.
ఎంతోగాఢంగా పరిశీలించాను.కంఠదఘ్నమైన
ఆలోచనలతో పరికించి మరీ అప్రతిభుడనై నిలిచాను.
కనకం కన్నా అమూల్యమైన లోహం దేనితోనో తయారుచేసివుంటారు
అందుకే అవి అంత ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ వుంటాయి.
మన ప్రధమ సందర్శనమప్పుడే అవి నన్ను
బందీనిచేసిన బంధుత్వం వాటిది.
కనికట్టుచేసిమరీ నన్ను కట్టిపడేసిన
కట్టుబాటు వాటిది.
కొన్ని సమయాల్లో అవి నా అమాయకత్వాన్ని
బహుదా ప్రశంసిస్తున్నట్లనిపిస్తుంది.
మరికొన్నిసార్లేమో అవి నా అజ్ఞానాన్ని నిలదీసి
జవాబుకోసం ఎదురుచూస్తున్నట్లుగా తోస్తుంది.
ఒక్కోసారి అవి వజ్రాళ్ళామారిపోయి నా గుండెను కోతకుగురిచేస్తుంది.
నామనసు మందిరంలోకిజొరబడి నన్ను మ్రాను పడేలా చేస్తుంటాయి.
అవి కొన్ని అయస్కాంత క్షేత్రాలచెoతన వినిర్మితమై వుంటాయి
అందుకే అవి ఆకర్షించి నన్ను అధీనుడిగా చేసి ఆదిస్తుంటాయి.
అవి గాలిపటాల్లా నన్ను ఎత్తులకు ఆకాశం దాకా ఎగరేసి
యే దారం ఆధారంలెకుండా నన్ను ఎగరమని ఆదేశీ స్తుంటాయ్
అవి యేవో మాయనగరిలో మంత్రాలమధ్యన తయారయివుంటాయి
మౌనంగానే మనసును వశీకరించుకునే మహత్తునుకలిగి ప్రవర్తిస్తుంటాయ్.
కనులెదుటనువ్వు సాక్షాత్కరించినప్పుదల్లా నా కనుకలిని
కోల్పోతూ వినుకలికీ దూరమవడానికిమూలకారణం అదేగదా!
నన్ను నిరంతరం ఆనంద వార్ధిలో తేలియాడిస్తూ
సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆనేత్రాలు కొన్ని
కాంతిపుజాల్లా మారిపోయి ఆకాంతిఛ్చటలమధ్య
నన్ను నా కనీనికలను కట్టిపడేసి కళాత్మకంగా శోభిల్లుతుంటాయి.

==========================================
No comments:
Post a Comment