Sunday, January 10, 2016

ప్రప్రధమంగా భగవంతుడు
ధరణీతలాన్ని సృజించాడు.
ఆతర్వాత కొందలనూ కొనలనూ
చెట్లూచేమలను పశుసంపదనూ
సృజనచేసి కృతార్ధుడయాడు.

అంతటితోతృప్తిపడలేక స్త్రీపురుషులను
సృజనచేసి ధన్యుడయానని మురిసిపోయాడు.

మొట్టమొదటిసారిగామనం కలుసుకున్న వేళ
ఒకరికొకరం మనసులను ఇచ్చిపుచ్చుకున్నాము.
ఒక్కటవుతున్నామని ఆనందవార్ధిలోమునిగిపోయాము.
కళ్ళల్లోకలలను శృష్టించుకుని మరోలోకంలో
విహంగాల్లా ఎగిరెగిరి ఆకాశమంచులవెంటవిహరించాము.

భావికాలపు సూర్యోదయాలను ముందస్తుగానే పసిగట్టి
హృదయంలో పదిలపరుచుకుని పరమానందం పొందాము.
చందమామా , తారకలను మన హృదయసీమల్లో నిలుపుకుని
శృంగారరస రాయంలో సుందరవదనులమైపొంగిపోయాము.
పల్లెపదాలను పాడుకున్నాం,ప్రణయగీతాలనల్లుకున్నాం.
అనురాగాభిమానాలవెన్నెలలోతదిసిముద్దయ్యాము.

ఇప్పుడెందుకో యిలా ఇద్దరిమధ్యా పొరపొచ్చాలుతలెత్తడంతో
మనదారులు చిన్నాభిన్నం చేసుకుని కాలం గడుపుతున్నాం.
ఒకరిపొడమరొకరికి గిట్టనిస్థాయికి దిగజారిపోయాము.
మమ మన హృదయాలలోవెలిగించుకున్న ఆశాజ్యోతులు 
అఖండంగా వెలుగులు ప్రసరిస్తాయని భావించి
ఆ ఆశలూడియాసలుచేసుకుని వేదనాభరితులమై ఖేదపడుతున్నాం.

ఇప్పుడిక నీరూపం నాకనుచూపుమేరల్లో
కనబడకపోవడమే మేలనుకునే దిశకు దిగజారి ప్రవర్తిస్తున్నాం.
నా అశ్రుసంద్రంలోనిన్ను నిలువునా ముంచేయాలని 
తీర్మానించుకునేలా చేసావ్.
అప్పటి సుప్రభాతాన వినిపించిన సూక్తులన్నిటినీ
మరచి మానవత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాం.
ఆశాఉషసులచెంకు చేరవలసిన మన గమ్యాన్ని
అర్ధాంతరంగా వాయిదావేసుకుని ఆక్రోసపడు తు న్నాం.
నిన్నటిదాకామనమధ్యన వికసించి మురిపించిన సుమసౌoదర్య
మైనలావణ్య సీమను దూరంగా తరిమి శిశిర తరువుల్లా 
ఆశలన్నింటినీ ఉడిగించుకుని ఇలా దిసమొలలతో
ఉద్విగ్న హృదయాలతో  ఉత్కంథావహులమై  మిగిలిపోయాం.

No comments:

Post a Comment