ద్వైదీభావం
-----------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
నిద్రంటూ రాని నా కళ్ళతో
నీ నేత్రద్వయంలోకి
నేరుగా తొంగిచూస్తున్నాను.
శాంతివచనాలుజపించే
నాహృదయకవాటాల్లోంచి
భ్రాంతిగా నీ మనసు పొరల్లోకి
దూరిపోవాలని శ్రమిస్తున్నాను.
అనుకోకుండా ఊడిపడిన స్వప్నం
నన్ను నిరాయుధుణ్ణిచేసి
కట్టిపడేసింది చూడు.
ఆస్వప్నానికీ
అప్రకటితమైన నీ ప్రణయానికీ
అవినాభ సంబంధమేదో
వుండి వుంటుందని నా ప్రగాఢవిస్వాసం.
నీడలాంటి నిజమేదోకూడా
నన్ను వెన్నంటివేధిస్తున్నది.
గాలిలో ఊగిసలాడుతూ నా
ఉప్పిరిని బిగబెట్టేలా చేస్తున్నది.
మానసుకేదో సంకెల
తగులుతున్నట్లనిపిస్తుంది.
వాచాలత్వమేదో వగరు రుచిని
సంతరించుకున్నదేమోనని నా సందేహం!
అంతటా అయోమయమే
రాజ్యమేలుతున్నదని నా భావన.
ఏదీ ఇతమిద్ధమని రుజవయే
యోగమున్నదనుకోను.ఉన్నదన్న
స్పృహకూడా శూన్యం సుమా!
ఏదిసత్యం, ఏదసత్యం?
ఈ విచికిత్సలోనే జీవితం
పరిసమాప్తమయే ప్రమాదం
పొంచివుందేమోకూడా !
ఆవిడచూపులోనూ
ఆమెదయార్ద్రహృదయం
స్పందించేతీరులోనూ
వైవిధ్యమేదో ద్యోతకమౌతున్నది.
ఏదీ నా స్వంతమేమీకాదన్న
అద్వైదీ భావం నన్ను తనకు
దూరంగా విసిరేస్తున్నది.
ఆమె చూపులు నాకందకుండా
విహంగంలా ఎగిరిపోతున్నది.
=============================
-----------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్
నిద్రంటూ రాని నా కళ్ళతో
నీ నేత్రద్వయంలోకి
నేరుగా తొంగిచూస్తున్నాను.
శాంతివచనాలుజపించే
నాహృదయకవాటాల్లోంచి
భ్రాంతిగా నీ మనసు పొరల్లోకి
దూరిపోవాలని శ్రమిస్తున్నాను.
అనుకోకుండా ఊడిపడిన స్వప్నం
నన్ను నిరాయుధుణ్ణిచేసి
కట్టిపడేసింది చూడు.
ఆస్వప్నానికీ
అప్రకటితమైన నీ ప్రణయానికీ
అవినాభ సంబంధమేదో
వుండి వుంటుందని నా ప్రగాఢవిస్వాసం.
నీడలాంటి నిజమేదోకూడా
నన్ను వెన్నంటివేధిస్తున్నది.
గాలిలో ఊగిసలాడుతూ నా
ఉప్పిరిని బిగబెట్టేలా చేస్తున్నది.
మానసుకేదో సంకెల
తగులుతున్నట్లనిపిస్తుంది.
వాచాలత్వమేదో వగరు రుచిని
సంతరించుకున్నదేమోనని నా సందేహం!
అంతటా అయోమయమే
రాజ్యమేలుతున్నదని నా భావన.
ఏదీ ఇతమిద్ధమని రుజవయే
యోగమున్నదనుకోను.ఉన్నదన్న
స్పృహకూడా శూన్యం సుమా!
ఏదిసత్యం, ఏదసత్యం?
ఈ విచికిత్సలోనే జీవితం
పరిసమాప్తమయే ప్రమాదం
పొంచివుందేమోకూడా !
ఆవిడచూపులోనూ
ఆమెదయార్ద్రహృదయం
స్పందించేతీరులోనూ
వైవిధ్యమేదో ద్యోతకమౌతున్నది.
ఏదీ నా స్వంతమేమీకాదన్న
అద్వైదీ భావం నన్ను తనకు
దూరంగా విసిరేస్తున్నది.
ఆమె చూపులు నాకందకుండా
విహంగంలా ఎగిరిపోతున్నది.
=============================
No comments:
Post a Comment