Thursday, January 28, 2016

మౌన భంగం
-------------------రావెల.
===============================


వ్యధార్త భారత యదార్ధ దృశ్యం
ఆవిష్కరింపబడిన సమయాన
చెల్లుబాటుకునోచుకోని చేదు జీవితాలతో
సొల్లువాగుడు వాగుతున్నామని తెలిసీ

బండకేసి బాదినా అంటుకున్న మురికిని
పోగొట్టుకోవడానికిచ్చగింపని
రాజకీయ క్రీడలో ప్రతిసారీ
ఓటమిని సొంతం చేసుకుంటున్న
నా తోటి నా సోదర సోదరీమణులతో
మనసారా సంభాషించాలని వున్నది.

ఇక నామౌనం వీడకతప్పేట్లు లేదు.
సంభాషణలో సౌకుమార్యాన్ని సాంతం
విడనాడి కొంచం కరుకుదనంతో
కటువుగామాట్లాడడం తప్పదని తెలుసుకున్నాను.

పరకాయప్రవేశం చేసిన నాదేశ జనాభాలో
పేరుకుపోయి కరగనుపొమ్మంటున్న కన్నీటి జడులను
జఠరాగ్నిని రగిల్చయినాసరే జ్వలితం చేయక తప్పేట్లులేదు.

కులాలిలా సంకుల సమరానికి సిద్ధమై గిరి
గీసుకుంటున్నప్పుడు
మతాలు మారణహోమాలకు ఆజ్యంపోసే దిశగా
సర్వసన్నద్ధమై యాత్రను సాగిస్తున్నప్పుడు.

శుద్ధజలాలతో ప్రక్షాళనం చేయాల్సినచోట
సుద్ధిజలాలతో మంత్రించి మాయమాటలతో
మనుషులను మనుషులే వంచనా శిల్పులై

ఆరాధించవలసిన ఆలయ విగ్రహాల్లా మార్చి

ప్రతిష్ఠ చేసి పలాయనం చిత్తగిస్తున్న వేళ
నామౌనం చేతగానితనమై నవ్వుతాలుగా
పరిణమిస్తున్న అశుభకాలంలో
ఇక నామాటలను మారణాయుధాలుగా మార్చి
దేశాన్ని దశాబ్దాలుగా అప్రదిష్ట పాలుచేస్తున్న
పుండాకోరులందరికీ నా పుణ్యభూమిచెంతనే
ప్రాయశ్చిత్తంచేయడం అత్యంతావశ్యకమని
నామనసు గుండెదగ్గర తనగోడును ఏకబిగిన
శోకతప్తయైన మానసంతో వివరిస్తుంటే
నామౌనంతో నేనింకా మనజాలనని హెచ్చరిస్తున్నాను.

అందుకే యే దార్శనికులూ  నిర్ణయించకుండానే ఒక ముహూర్తాన్ని యెంచుకుని
సమాజహితంకోరుతూ వెన్నునంటిపెట్టుకుని వెల్వడుతున్న వీరావేశంతో
మౌనాన్ని వీడాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను.
ఆదిశగానే ఈ వినూత్న మైన సమర శంఖాన్నిపూరిస్తూ
మరో ప్రస్థానం వైపు అడుగులు నాజాతిచేత వేయించాలని
ప్రగాఢమైన విశ్వాసంతో ముందుకు దూసుకెల్తున్నాను.
ఇక ఈ మౌన పోరాటానికి స్వస్తిచెప్పాలనీ
నామౌనానికి మానభంగం తప్పదనీ  హెచ్చరికలుచేస్తూ
 దశాబ్దాలు సాగుతూ వస్తున్న నా ఈ మౌన  దీక్షను స్వఛ్చందంగా విరమిస్తున్నాను--
============================================


Tuesday, January 26, 2016

శాంతము ధర్మము ఓరిమి
కాంతలకే జెల్లు  నీవు కాదనగలవా
పంతము మానుము శ్రీ
కాంతా!!  రావేయనె సతి కాంతుని తోడన్ 

Saturday, January 23, 2016

కులం గాయపరుస్తుందని విన్నాను
అది గాయాన్ని రేపుతుందనీ,
దేశమంతటినీ కవ్విస్తుందని
ఇప్పుడే తెలిసిపోయింది.
రాబందుల రెక్కల చప్పుడు మధ్యన
రక్షణకోరుకుంటుందని కూడా అర్ధమయింది.
==============================

Friday, January 22, 2016

నిద్రంటూ రాని కనులతో
నీ నేత్రాంచలాల్లోకి
నేరుగా తొంగిచూస్తున్నాను.
అనుమానపు పొరలేవో
నిన్నంటిపెట్టుకుని
వదిలిపోవడంలేదని గ్రహించాను.

శాంతివచనాలనుమాత్రమే వల్లించే
నా హృదయ కవాటాల్లోంచి
భ్రాంతిగా నీ మనసుపొరల్లోకి
దూరిపోవాలని విశెషంగా శ్రమిస్తున్నాను!


అనుకోకుండా వచ్చిన స్వప్నం
నన్ను నిరాయుధిడినిచేసి
శృంఖలాబద్ధుడిని చేసింది.

ఆ స్వప్నానికీ, నీ
ప్రణయానురాగబంధానికీ
అవినాభావసంబంధమేదో
అల్లుకునిపోయివుంటుందని
 నా అనుమానం!

నీడలాంటి నిజమేదోకూడా
నన్ను వెన్నంటి వేధిస్తుంటుంది!
గాలిలోతేలియాడుతూ నా ఊపిరిని
బిగబట్టి బంధించి వేస్తుంది!!

మనసుకేదో సంకెలలు  చుట్టిపడేసాయా?
వాచాలత్వమేదో వగరు వగరుగా
 మాటలు దొర్లిస్తున్నట్లున్నది.

అంతటా అనూహ్యమైన అయోమయమే
రాజ్యమేలుతున్న భవన.
ఏదీ ఇతమిద్ధంగా
తేలిపోయేలాలేదు!రుజువయేయొగమూ
ఉన్నట్లులేదు!

ఏది సత్యం? ఏది అసత్యం?

ఈవిచికిత్సలోనే జీవితం
నిండా మునిగిపోయేలా వుంది!
ఊపిరినంతా బిగదీసి
ఉఛ్చ్వాస నిశ్వాసలను
కత్తిపడేస్తున్నది.

ఆవిడచూపులోనూ ప్రకటించేతీరులోనూ

వైవిధ్యమేదోకొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

ఏదీనాస్వంతంకాదన్న అద్వైతభావం
నన్ను అనవరతమలరిస్తూపోతున్నది.
దూరంగా విసిరివేయాలని విభిన్నంగా
ప్రయత్నిస్తూ వైఫల్యం చెందుతున్నది!
ఆమేమో నాచూపులకతీతంగా
విహగమై విశాలగగనంలో
విహరిస్తూ అలరిస్తూ అనుభూతిప్రపంచంలో
ముంచేస్తూ మురిసిపోతున్నది.
=============================
ముఖాముఖీ
---------------రావెల
-------------------------

భగవంతుడిని
ప్రశ్నించడం మొదలెట్టాను!
ఎందుకింత అరాచకం
అల్లకల్లోలాలనూ  సృష్టించి
నిమ్మకుంటుంటున్నావు అని?
చిరునవ్వేసమాధానం.

మరోప్రశ్నతో పరమాత్ముడిని
ఒక్కుదుట కుదిపేసాను
ఎందుకు జనమంతా ఇలా
అంతు అడ్డులెరుగని సంపాదనకోసం
వెంపర్లాడేలా చేసావని నిలదీసాను
చివరకు మిగిలేది చితాభస్మమేగదా?
చిరుదరహాసమే సమాధానం.

ఇంకొక్క ప్రశ్నతో నిలదీసాను.

ఎందుకింతమందిని ఆహారం
అందుబాటులోలేకుండా అలమటించేలా చేసావ్?
శ్రమైకజీవన సౌందర్యానికి
ఖరీదు కట్టగలగాలికదా!!
సబ్సిడీల సమారోహణకు దూరంగా
ఉంచడం మేలనే ఊహతో అలాచేసాను
అని చిరుకోపం ప్రదర్శించాడు.!!
================================


Thursday, January 21, 2016

తెగిన గాలిపటంలానీవు
తెల్లవారడంతెలియనిరాత్రిలానేను!

మోహనరాగానికి మోజుపడుతూనేను
విషాద ప్రవాసానికి వసతిని వెదుకుతూనీవు


సమకాలీన సమాజానికి దర్పణంలా కవితనై నేను
ప్రాచీనపు ప్రాభవాలను పాదుకొల్పాలని తపిస్తూ నీవు.

ఇద్దరిమధ్యా ప్రతినిత్యం దర్శనమిచ్చే
 ఈ సమాంతర రేఖలు సమసిపోయే మార్గాలను
కలసికట్టుగా వెదుకుదాం రారాదూ!
సమన్వయంతో సఫలీకృతమౌతామనే విశ్వాసం నాకుంది.
=================================
నాకెప్పుడూ క్రమేపీ అదృశ్యమవాలన్నాలోచనేలేదు.
రాత్రంతా నన్ను మురిపాలలో ముంచితేల్చే
కలల సామ్రాజ్యాన్ని కన్నులెదుటనుంచి
 దూరంగావించుకోలేను .

ఉదయాన్నే ఇంటిముందు తోటలోని చెట్లపై
మావిచిగురులుతిన్న కోయిలమ్మలు
మధురాతిమధురంగా తమ స్వరాలను
శృతిజేసుకుని స్వరాభిషేకంకు సిద్ధమవుతున్నాయి.
నా శ్రవణేంద్రియాలకు విందునివ్వాలని ప్రతినిత్యం
ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటే వద్దని వారించాలనిలేదు.

ఎదురుగా చిరుగాలికి సైతం రెపపలాడుతూ
తలలూపే పూలరెమ్మలను రాత్రంతా పడినజల్లులకు
ప్రసరించదలుచుకున్న సురభిళ పరిమళాలను
ఆస్వాదించకుండా వైముఖ్యాన్ని ప్రదర్శించలేను.

అందుకే నాకిలా ఉన్నపలాన
అదృశ్యమవాలన్న కృతనిశ్చయమేమీలేదు.
====================================
నేను విషాద సాగరంలో
మునుగుతూ మునకలేస్తున్నప్పుడు

నన్ను లాలనగా నీదగ్గరకు
చేర్చుకున్న శుభగడియలలో
రెండుజతల కళ్ళూ ద్రవిస్తాయి
ఆనందనందనంలో విహరిస్తున్న తీరుతో!
నా వేదనాతరంగాన్ని నీవు గ్రహించి
సంబాళించే సమయంలో నీ హృదయాలయానికి
సమీపంలో నన్ను చేర్చుకుంటుంటే ఆరెండుజతల నేత్రాలే
ఆనందవార్ధిలో మునకలేస్తున్న తీరు నన్ను
ఇద్దరం కలిసి కలివిడిగా కదులుతున్నందుకు

సంతోషం సాగరంలో సన్నిహితంగా ఈదుతూ

 కళకళలాడుతూ తళతళా మెరుస్తుంటాయి.
=================================

Wednesday, January 20, 2016

దళితుడినంటాడు
ఒకడు
మహితుడినంటాడు
ఇంకొకడు
మనమంతా మనుషులం గదా
అనలేడేం ? యేఒక్కడూ!!
=============
కులం గొప్పంటాడు
ఒకడు
మతం మహోత్తమం
అంటాడింకొకడు.

చదువుకుందాం రండి రా
అనడేం ఎవ్వడూ?
================
ఆత్మానుగతం
-----------------రావెల.


పాటలుపాడే పక్షులన్నీ
ప్రభాతవేళకుముందుగానే
చెట్ల చిటారుకొమ్మలమీదకుచేరి
ఒక సమావేశాన్ని నిర్వహించాయి.

సూర్యకిరణాలు భూమితల్లి
పాదాలను స్పృశించి పరవశించకమునుపే
ప్పొదోటలోని మొక్కలనీ పూల పరిమళాలను
పూర్తిగా వెదజల్లకముందే మనమెందుకు
ముదంస్తుగా లేచి ఈ ప్రబాతగీతాలు ఆలపించాలి?

కోడికూతలు మానేసి దశాబ్దాలుగడివిపోయాయి.
అలారంగడియారాలూ అరచి గీపెట్టడం మానేసాయి.
ఠాణాల్లో గంటలుకొడతారన్న వుషయమే మరచిపోయారు.
ఇక మనమేగదా ఈ బుద్ధిజీవులకు తోడుగానిలిచి
మేల్కొల్పుగీతాలుపాడుతూ వారందరినీ జాగృతంచేయాలి.
అందుకేమనమంతా విరామమెరుగని విహంగాలమై
మనపనిని మనం హృదయపూర్వకంగా నిర్వహించాలి!!

నిద్రాణమైపోతున్న జాతికి
జాగృతగీతాలనాలపించి జాగ్రత్తపరచాలి!!
నింగికీ నేలకూమధ్యనవారధిలా ప్రవర్తించాలి!!
మనపని మనం చేసుకుంటూ పోతుంటేనేగద
పరమాత్ముడి కృపాకటాక్ష వీక్షణాలకు
పాత్రులమై జీవితాలను ధన్యంచేసుకోగలిగేది.
అందుకని ఏతావాతా మొత్తమ్మీద మనకొచ్చిన
 విద్య ఇదేగనుక విచక్షణాజ్ఞానంతో
కర్తవ్యదీక్షతో ఈ కార్యక్రమాన్ని మనం
 క్రమం తప్పక నిర్వహించగలగాలి.
విజయం దిశగా దూసుకెళ్ళామన్న తృప్తితో జీవించాలి.
==========================

Tuesday, January 19, 2016

అంతర్మధనం
-----------------రావెల.
================

అన్ని పనులూ నీ ఆదేశానుసారమే
జరగాలని భీష్మించుకు కూర్చోవడం నీ అవివేకం.
జరగబోయే పనులన్నీ నీకనుసన్నలలోనే
ముందుకు సాగుతూ కదలాలనుకోవడం నీ మూర్ఖత్వం.

ఏదైనా తనంతతానే తన ఇష్టానికనుగుణంగా
కాలానుగుణంగా  కాలుకదుపుతుంది.
మనిషి మనసును మభ్యపెడుతూ
కంటికి కనిపించని కనికట్టుకు ఆపాదించడం
అలానే అది సృష్టించబడివుంటుందని నమ్మబలకడం
అంతా నీ భ్రాంతిమయ ప్రపంచమేనని గ్రహించలేకపోవడం
అడుగునా ఎదుటివారిని కవ్వించి భయభ్రాంతులకు గురిచేయడం
విధాత తలపున మెదిలే ఆలోచనాతరంగతతుల తళుకుబెళుకులేసుమా!

ఇదంతా స్వప్నచోదితమేనని నీవు హృదయపూర్వకంగా నమ్మగలిగితే
నీ ఉనికికొచ్చిన ప్రమాదం మాత్రం శూన్యమేనని గుర్తెరుగు!

అప్పుడు నీ ఉఛ్చ్వాసనిశ్వాసలు క్రియాశీలమైన పంధాలో
ఆనందదాయకమై, ఆరోగ్య ప్రదాయినియై స్థిరమై,వరమై,
ప్రయోజనకారియై పదిమందికీ సహాయకారియై
మనగలుగుతున్నదని అర్ధం తాత్పర్యం!!
======================================
మొసలి కన్నీరు కారుస్తుందనీ,
సిం హం శాకాహారినని నమ్మబలికే
ప్రయత్నం ప్రారంభించిందనీ
ఇప్పటికిప్పుడే అర్ధమయిపోయింది.

మరి జలచరాలన్నీ
భయకంపితమవడమెందుకో?
వనవిహారులంతా
వణికి పోవడమెందుకో?

రాహువూ కేతువూ వచ్చి
మంచినె చేస్తామనిన్నీ
ఏలిననాటి శనినే ఏలికగా
ఎంచుకోండనీ నమ్మబలుకుతున్నారు!

ఎన్నికలొచ్చాయంటే
ఎన్ని కలలు పురుడుపోసుకుంటాయోగదా!!
దానవీర శూరకర్ణ సినిమాను గుర్తుదెచ్చే
దాతలు సాక్షాత్కరిస్తున్నారు!

నయవంచనగావించడం
నగరవీధుల్లో నగరసంకీర్తనలా
నడాచి పోతూనే వుంటున్నది.
మరో సారి మోసపోవడానికి
సభ్యసమాజం సిద్ధమవుతూనే వున్నది.

ఆత్మావలోకనానికి అవకాశమే చిక్కడంలేదు.
బేరీజులు వేసుకునేలోపే బేరాలు కుదిరిపోతున్నాయి.

తక్కెడలోంచి తెలివిగా దూకే కప్పలదే రాజ్యమిది!
నిన్నటి దాకా శతృవులంటూ భయపెట్టినవారు
వారినే మీరే మా మిత్రులంటూ మురిసి మెరిసి
వేదాలు వల్లిస్తూ అక్కునజేర్చుకుంటున్నారు.
కలయో వైష్ణ మాయయో కాలమే ఇక  తీర్మానం చేయాలి.
==================================

Monday, January 18, 2016

ద్వైదీభావం
-----------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్


నిద్రంటూ రాని నా కళ్ళతో
నీ నేత్రద్వయంలోకి
నేరుగా తొంగిచూస్తున్నాను.

శాంతివచనాలుజపించే
నాహృదయకవాటాల్లోంచి
భ్రాంతిగా నీ మనసు పొరల్లోకి

దూరిపోవాలని శ్రమిస్తున్నాను.

అనుకోకుండా ఊడిపడిన స్వప్నం
నన్ను నిరాయుధుణ్ణిచేసి
కట్టిపడేసింది చూడు.

ఆస్వప్నానికీ
అప్రకటితమైన నీ ప్రణయానికీ
అవినాభ సంబంధమేదో
వుండి వుంటుందని నా ప్రగాఢవిస్వాసం.

నీడలాంటి నిజమేదోకూడా
నన్ను వెన్నంటివేధిస్తున్నది.
గాలిలో ఊగిసలాడుతూ నా
ఉప్పిరిని బిగబెట్టేలా చేస్తున్నది.

మానసుకేదో సంకెల
తగులుతున్నట్లనిపిస్తుంది.
వాచాలత్వమేదో వగరు రుచిని
సంతరించుకున్నదేమోనని నా సందేహం!


అంతటా అయోమయమే
రాజ్యమేలుతున్నదని నా భావన.

ఏదీ ఇతమిద్ధమని రుజవయే
యోగమున్నదనుకోను.ఉన్నదన్న
స్పృహకూడా శూన్యం సుమా!
ఏదిసత్యం, ఏదసత్యం?
ఈ విచికిత్సలోనే జీవితం
పరిసమాప్తమయే ప్రమాదం
పొంచివుందేమోకూడా !

ఆవిడచూపులోనూ
ఆమెదయార్ద్రహృదయం
స్పందించేతీరులోనూ

వైవిధ్యమేదో ద్యోతకమౌతున్నది.
ఏదీ నా స్వంతమేమీకాదన్న
అద్వైదీ భావం నన్ను తనకు
దూరంగా విసిరేస్తున్నది.
ఆమె చూపులు నాకందకుండా
విహంగంలా ఎగిరిపోతున్నది.
=============================

అప్పుడప్పుడూ
గుండె లయ తప్పుతూ వుంటుంది
సమీపంలోనువ్వున్నావని దానర్ధం.
ఎప్పుడయినా నాకోపం అదృశ్యమవుతూ
సరదాగా కవ్విస్తూ వుంటుంది.
అంటే పంచడానికి నీ ముసిముసినవ్వులు
సిద్ధంగా ఉన్నాయని దానర్ధం.
అప్పుడప్పుడూ తనువంతా స్వేదసంద్రమై
ఉప్పనై ఉడికిస్తుంది.. అక్కడకు దగ్గరలొ
నీవు ప్రసరింపజేసే అరుణారుణనేత్రం
నేను స్వాల్పైమనదైనా అసరే తప్పుజేస్తున్నట్లు
హెచ్చరిస్తున్నదని దాని తాత్పర్యం.
 పలువిధాలజరిగే ఇన్ని అనర్ధాలమధ్యకూడా
అన్వర్ధమై ఇలానేను ప్రశ్నార్ధకమై
మిగిలివుండడంకూడా ఒక విచిత్ర  వైచిత్రీ భావమనే
కదా దీనర్ధం.వీటన్నింటి అంతరార్ధ సారం...
================================


Sunday, January 17, 2016

ఇకనైనా నవ్వండిరాబాబూ!!
----------------------------------రావెల
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

ఇప్పటిదాకా మీరెత్తుకున్న మొత్తికోళ్ళుచాలు
సముద్రంకనా ఉప్పగా వుండేలా కార్చిన అశ్రు ధారాప్రవాహలు చాలు
నెలకు పదులకొద్దీ విడుదలై యే సీ హాల్లోకూడా చెమటలు పట్టించిన ఫాక్షన్ సినిమాలు చాలు.
నట్టీంట్లో అందరినీ కలివిడిగ కూర్చోబెట్టీ ఇంటిల్లిపాదినీ గ్లిసరిన్ సాయంలేకుండానే ఏడిపించగలిగిన ఇంటిటికీ ఉచితంగా ద్వేషాలను
కక్షలనూ కావేషాలను సరఫరాచేస్తున్న దగుల్బాజీ ధారావాహికల తలపోట్లు చాలు.


నిత్యాగ్ని హోత్రంలో మనసును మండింఛే నేరాలూ ఘోరాల కధనాలు చాలు.
తలలను సునాయాసంగా చిట్లగొట్టగల బ్రేకింగ్ న్యూసులిచ్చే నిరంతర వార్తా స్రవంతులుచాలు!
రోజూ వరస తప్పకుండా వేసుకుంటున్న నెత్తురుపోటు మందులుచాలు
అరచేతిలోఅదృష్టాన్ని చెక్కించగల నేతల తలరాతల ఉపన్యాసాలు ఇక చాలు.

మా న్యాయదేవతకు కళ్ళుతెరిపించు
మా ధర్మమూర్తికి కాళ్లను తెప్పించు
మా దేశానికి మాత్రం బుద్ధిని ప్రసాదించు.
నేరం చేసినవాళ్ళనందరినీ
బేషరతుగా విడుదలచేయించు.
తప్పుజరిగిందని విశ్వసించిన వారినందరినీ
కారాగారాలలో తగు శిక్షలతో బంధించు.
హే భగవాన్!!! నా ఈ చిన్నికోరికను మన్నించు.
-----------------------------------------------------------

వియ్యంకుడు లెజెండ్
అల్లుడుగారు డిక్టేటర్
తనేమో ప్రజలకు లీ 'డర్ '

చెల్లెలు హెరిటేజ్
తనేమో ఓవరేజ్
ఫలితం యావరేజ్

బాoబులున్నవి చూడు
బ్రదుకు బాటన నేడు
నేతలేగద? సరిజోడు
ఓ భారతాంబా!
==================
పూలబాసలు చేసె
పురుగులా దోచేసె
నెమ్మదిగ మది రోసె
ఓ భారతాంబా!!
----------------------------

Saturday, January 16, 2016

ఆవూరుకు బదిలీ అంటేనే ఆఫీసర్లు భయపడుతున్నరోజులు!
కొత్తగా ప్రమోషన్ వచ్చినవారిని ఒక స్థాయి అధికమైన
ఆ శాఖకు బదిలీ జేయడం రివాజయింది.ఇక అలవాటుప్రకారం
ఇలా బదిలీ అయింది ఎప్పుదు వెళ్ళమంటారు అని ఆఫీసర్ల సంఘపు నాయకుడితో ప్రస్తావిస్తే! యేమిటి ఆ శాఖకు వెల్దామనే నిర్ణైంచుకున్నావా? అని ఎదురుప్రశ్నవేసాడు నవ్వుతూ.
ప్రతిమూడునెలలకూ హైద్రాబాదునుంచి సీ జి యం,జీ యం సందర్శించే గొప్ప శాఖ అది.ఆస్థాయివారే ఆ శాఖనాకొద్దని మాచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. నీకెంత ధైర్యం ఒక వేళవెళ్ళినా
నాలుగు నెలల్లో మళ్ళీ మాచుట్టూ తిరుగుతావు.నేను ఒకసారి పై వారితో సంప్రదించి చెప్తానులే అనడంతో కొంత అనుమానం వచ్చింది.
సిబ్బంది సహకరించరు--దీనితో మొదటిసారి నష్టంలోకెళ్ళిన శాఖ అది అన్నారు.సరే యేదయినాసరే విధిలిఖితం తప్పదుగద అని వెళ్ళాను. వెళ్ళిననాలుగైదురోజులకే కాపలాదర్లిద్దరూ ఒకరితోమరొకరు ముష్టియుద్ధం.ఉన్నదాంట్లో సౌకర్యమేమిటంటే నాకు తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉండడంతో కొంత వెసులుబాటు.
ఇక సంక్రాతిరోజులకొచ్చేసరికి సంబరాలు చేయాలన్నపట్తుదల.


ఊరంతా ఒక్క్టిగా కదిలివస్తారాలేదా అని అనుమానం ఎట్తకేలకు
యువతకు కబడేఎ మహిళలకు ముగ్గులపోటీలు.పొట్తేళ్ళ పోటీ సమరం అన్నీ సాయంత్రానికల్లాముగించాము. ఆడవళ్ళెవ్వరూ బహుమతులు తీసుకోవడానికి రారనీ అవి మొగవారికే అందించాలనీ ఉచితసలహా!! అదేంకుదరదు ఎవరు విజేతలయితే వారి చేతికే బహుమతులిస్తాం.ఎవరూ రాకపోతే వాటిని తిరిగి శాఖకు తీసుకెల్తామని ఖరాఖండీగ చెప్పడం జరిగింది.
4 టీముల్లో జరిగినపోటీకి ఇద్దరు మొదటి రెండు స్థానాలకూ ఎంపికకాగా
మిగతారెండుటీములకుకూడా ప్రోత్సాహపరిచే దిశగా  ప్రత్యేకబహుమతులనందివ్వడంజరిగింది.

సాయంత్రం జరిగిన సభకు ఊహించిన అంచనాలకన్నా భిన్నంగా వందమందిపైగా హజరవడం ఎవరి బహుమతులు వారికే ఇవ్వడం జరిగిండి.అసలు అంతకన్నా విశెషమెమిటంటే--అప్పటి విద్యా శాఖమాత్యులయిన వ్యక్తి మాతామహులు హరిశ్చంద్ర నాటకంలో
కొన్ని పద్యాలను రసవత్తరంగా పాడడం ఎనభయ్యోపడిలోగూడా కంచుకంఠం కలిగివుండడం విశేషం.ఆయనను ఒక దుశ్సాలువతో సత్కరించుకున్నాం. ఆతర్వాత సిబ్బంది సహాయ సహకారాలతో మొదటిసంవత్సరానికే లభాల పట్టడంతో ఉన్నతాధికారులు
స్వయాన శాఖను సందర్సించి ప్రశంసలను కురిపించడం మరొ విశేషం.ఆతర్వువాత జరిగిన తనిఖీలో ఉన్నదానికన్నా రెండుస్థానాలు అధికమైన రేటింగ్ ఇవ్వడమొకరకంగా చరిత్రను సృష్టించినట్లయింది.


అలామూడునెలలకు మించి వుండలేమనుకున్న వూరిలో మూడేళ్లు పూర్తి చేసుకోవడం భగవంతుని కృపాకటాక్షములేనంటే  ఎలాకాదనగలం?
అదీ ఈ సంక్రాతి సందర్భంగా విన్నవించుకున్న సదరు రెండోగోడు.ఇతి శివం.
====================================================





ఇప్పుడేనీ ప్రేమ పుస్తకాన్ని
చదవడం ప్రారంభించాను
ఉత్సాహం ఉరకలు వేయడం మొదలెట్టుంది.
ఎక్కడా నట్టుబడలేదుగా
ఆలోచనా స్రవంతి ధృతికి అచ్చెరువొందాను.

ప్రేమ గుడ్డిదంటారు సరే కాదనలేం
నీ హృదయగతభావాలనూ అనుసరించడమూ
అంధత్వమేమొననితోస్తున్నది అందుకే సుమా!
ఆఖరు పుటదగ్గర అసంబద్ధమనిపించి ఆగాను
ప్రణయం అగ్ని ప్రవేశం చేసిందెమో మరి.

ఈ రామాయణం కట్టుకధేనని ఇందులోభావాలు
తేనెను ఒంటినిండా పులుముకున్న చురకత్తులేమొ ననిపించింది.

అప్పుడే ఆకమురుకంపుకొడుతున్న పుస్తకాన్ని అవతలకు
గిరవాటువేసి కళ్ళు మూసుకున్నాను
ఇప్పుడుక ప్రేమరాహిత్య భావనలో హాయిగా స్వతహాగా
నాకునేను స్వతంతంత్రభావనల్లో ఊపిరిపీల్చుకుంటూ
కంటినిండా కమ్ముకొస్తున్న కునుకుతో ఆదమరిచి హాయిగా
నిదురపోయాను,యేకల్మషానికీ ప్రతీక కాని చందమామ
నవ్వుతూ నావైపే తన దృష్టిని సారించి హాయిగ నిదురపొమ్మని
శాసించాడు--ఎంత హాయి ఈరేయి ఎంతమధురమీ హాయి
 మత్తుగా గమ్మత్తుగా----మెలకువ వొచ్చేసరికి తెల్లవారింది.
భ్రమల్లోంచి నాకూ తెలివిచ్చి
వెనువెంటనే నా అమయకత్వానికి సరిపోలని
నీ అభిజ్ఞతకు తెరలు తెరలుగా నవ్వొచ్చింది.
ఇతిశివం....


Friday, January 15, 2016

నా విరితోటను సం రక్షించే బాధ్యతను
నీకే అప్పగిస్తున్నానుసుమా!
ఇది గులాబీల గుబాళింపులతో
సురభిళపరిమళాలనువెదజల్లే
సుందర నందనవనమన్న మాటమరువకు!

నా ఈ తోటను ప్రాణప్రదంగా చూసుకోవడం
క్షణమాత్రమేనా ఏమరువకు సుమా!!
ముఖ్యంగా ఈ గులాబీ మొక్కలను
శ్రద్ధగా పోషణచేయాలిసుమా!
ఈ గులాబీపూల సువాసన
నాకత్యంత ప్రీతిపాత్రమైనది.
ఎప్పుడయినా ఒక గులాబీ పువ్వును నాజడలోతురమగాచూడు
దానిపరిమళం ఎంతటి వారినయినా ఇట్టే ఆకర్షించేలా సిద్ధమవుతుంది.



ఆగులాబీ చెట్లను పుష్టిగా పెరిగేలా చూడు.
దానిచుట్టూ కలుపుమొక్కలు అసలుపెరగకూండా జాగ్రత్తపడు.
అనునిత్యం ఆపూలు దరహాసచంద్రికలను వెదజల్లేలా కాపాడు.

ఎంతో ప్రేమతో నీకు ఈ తోటమాలి ఉద్యోగాన్ని ఇచ్చాను.
ఈతోటపోషణలో నీకు మంచి భాగస్వామ్యాన్ని కల్పించాను.
నీకెదురైన గులాబీ పూలు ఎదురుపడి యదాలాపంగా నవ్వితే
నీ కటాక్ష వీక్షణాలను వాటిపైప్రసరింపజేయడం మరువకు.

నీ ప్రేమపురస్సరమైన హృదయస్పందనలను అనుగుణంగా
ఈతోటలోని పూలు విరబూయాలన్నదే నాఈప్సితార్ధం.
నీవు పెద్దగా అనుభవమున్న తోటమాలివికాదని నేరుగుదును.
నీకున్న అనూహ్యమైన అనురాగం, అనుభూతి చాలు ఈ తోటను
కలకాలం సమ్రక్షిస్తూ  నాకు ఆనందాన్ని పంచిపెట్టడానికి.

ఆపూలమొక్కలెప్పుడయినా వాతావరణానుకూలతలేక
వాడుముఖం పెట్టినేట్లనిపిస్తే వాటిని ఓదార్పుతో లాలించుసుమా!
అవి ఎప్పటికీ కన్నీటి సంద్రాలలో మునిగిపోవడం నాకిష్టంలేదని తెలుసుకోచాలు.
నీ వరదహస్తంతోవాటిని అభయముద్రనొసంగి కాపాడు.
నీ లానా ఆలనా పాలనలలో ఈతోట ఆదర్శవంతమై వర్ధిల్లాలనే  నా ఆకాంక్ష!
ఆవిషయం మాత్రమనవరతం గమనంలోపెట్టుకో  మరువకు!.

=====================================
ప్రేమను నిర్వర్తించగ
ప్రేముడిగా చెలిమిజేయు ప్రేరణగలిగెన్
ప్రేమే శ్వాసనిదలచుచు
ప్రేమనగర్ చూడనాకు ప్రేమేకలిగెన్.
అన్ని పనులూ నీ ఆదెశానుసారం
వినయవిధేయతలతో జగత్తులో
నీ కనుసన్నలలో నడవాలనుకోవడం
నీ అజ్ఞానానికిపరాకాష్టేనని గ్రహించు!

అలాగే జరగవలసిన కార్యక్రమాలన్నీ
నీ ఆజ్ఞాసురామే కదలాలని నువ్వు భ్రమిచడంకూడా
నీ అజ్ఞానానికి సోదాహరణమేనని గుర్తెరిగి ప్రవర్తించు.

ఈ సమస్తప్రపంచంలో యే వస్తువైనా కాలుకదపడం
కాలానుగుణంగానే వుంటుందని
అదిఎవ్వరికనికట్టువల్లాకాదని మనంచేసుకో!
మనిషిని మభ్య పెట్టడంలో నీకళాభిజ్ఞతను ప్రదర్శించకు.


విధాత తలపునమెదిలేఆలోచనాతరంగాల ప్రతిస్పందనె
ఈ ప్రపంచపు పోకడని ఎంతత్వరితంగా తెలుసుకుంటే అంతమంచిది.
అంతా బ్రాంతిమయమని నీవు నిద్రావస్థలోజోగుతుంటే
నీ ఎదుటనిర్వర్తించవలసిన కార్యక్రమాలన్నీ
అలానే జరుగుతూపోతుంటేనే నీ ఉనికి భద్రమై వుంటుంది.



నీ స్వాస సరయినక్రమంలో క్రియాశీలమై
ఆరోగ్యప్రదమై అనూహ్యమైన వరమై పదికాలాపాటు
ప్రయోజనకారియై పరిమళాలను వెదజల్లుతుంది.

Wednesday, January 13, 2016

పాడిపంటలభాగ్యాలు ప్రణతులిడగ
పూలబంతులు పొదరింట కొలువుదీర
పల్లె తల్లికి పన్నీటి జల్లులిడగ
ఏగుదెంచెను సంక్రాతి ఏలుబడిగ!!
--------------
మెట్టు కెక్కిన బస్తాలె పెట్టుపోత
కళ్ళమందున మిరపలు కందళింప
పత్తి బోరేలు తొక్కెను సత్తిగాడు
పాలుపిండగనేగెను ప్రమదలంత.
======================
మనసున్న మనిషి ఎదురుగా నిలబడి
యేవయినా కొన్ని మంచి మాటలు చెప్పమన్నప్పుడు
సరయిన మాటలను వెదుక్కోవడం అందరికీ
సామాన్యంగా కలిసివచ్చే సందర్భమేననుకుంటాను.

కలివిడిగా మాటలు కలుపుకోవాలనుకోవడం
అవతలివారి దృక్పధమైనప్పుడు  మాటలను
మనసుకు హత్తుకునేలా మంత్రించి చెప్పగలగడం
ఒక వరమని ఎవరయినా నొక్కి వక్కాణిస్తే కాదనలేం.

మాటలు సహజంగా సుతిమెత్తగా సుమలాస్యంతో
పోటీ పడినప్పుడే సంభాషణ సారళ్యాన్ని సంతరించుకుంటుంది.
ఎదుటి వారి హృదయాల్లో సౌమనస్యాన్ని చొప్పిస్తూ
కరుణను చిప్పిల్లజేయడానికి దోహదపడుతుంది.

మాటలను మూటలుగా కట్టి ముందుపడేసే దృక్పధంకొందరిది.
తనకు తెలిసినదంతా ఒక్కుదుటున కక్కేయాలన్న దుగ్ధ మరికొందరిది.


మాటలన్నీ ప్రతిసందర్భంలోనూ ఝoఝామారుతాల్లా వీవడమూ
శ్రేయస్కరమనిపించుకోదు,ససేమిరా శత్రుగణాన్ని
 పెంచుతుందని మనమంతా గుర్తెరిగి మసలుకోవాలి.
అందుకే మాటలు మలయమారుతంలావీచి
అవతలివారి కి శ్రవణపేయమై శోభించే విధంగా వెలువరించహలగాలి.

మాటలు తూటాల్లా పేలుతూ,  అవతలివారి హృదయగత మార్దవాన్ని
తునాతునకలుగా  చేసే విధంగా వెలువడ  కుండా జాగ్రత్తపడడం కూడా అభిలషణీయమే.
శోభాయమానంగా  లేకున్నా పర్వాలేదుగాని క్షోభకు అక్షరాలా  కారణం కాకూడదు.

మాటలకూ ఓ శక్తి వుంటుందనీ వాటికీ ఓ అవధివుందనీ దానికి శరసంధానపు
 బిగువుంటుందనీ గ్రహించి  మనం గుర్తుచేసుకుంటూ
 సంభాషణను సాగించేనేర్పు అత్యంతావశ్యకం.

మాటలు మంత్రించిన రీతిగా అవతలి హృదయాలను దోచుకునేలా వుండాలి.
ముల్లులా గుచ్చుకుoటూ వారిని జీవితాo తం కల కుపెట్టేలా రూపొందకూడదు.
ప్రముఖ సాహితీప్రియుడూ,కవితామయ ప్రపంచానికి స్నేహ శీలి
ప్రతి నూతనత్వాన్నీ ప్రేమించి, గౌరవించి,దానిలోని బాగోగులకనుగుణంగా
 తన భుజాలకెత్తుకుని దానికి
రావల్సినంత ఖ్యాతిని సంతరించి పెట్టేందుకు అనునిత్యం
కృషి చేస్తూ వచ్చిన సౌహార్ద హృదయుడ శ్రీ అద్దేపల్లి.

డెబ్భయవ దశకంలో శ్రీ కవితాప్రస్తానాన్ని సునిశితంగా
వి శ్లేషిస్తూ వెలువరించిన చిన్ని పుస్తకం చాలాకాలంపాటు
సాహితీ ప్రపంచంలో కొత్త గాలిని వీచేలా చేసి యువకవులకు
దిశానిర్దేశం చేసే దిశగా సూచనలిచ్చేందుకు ఉపయోగకారియై
నిలిచింది--- జ్వాలనుంచి మెరుపుదాకా--అన్న  కవితా సంపుటి
ఆయనకు అర్ధ గౌరవాన్ని సంతరించి పెట్టింది.
2012 సంవత్సరంలో నా "వెలుగురేకలు"
కవితాసంపుటి ఆవిష్కరణ సభకు
అధ్యక్షత వహించి ఆకవితాప్రక్రియను
ఆహుతుల మనసుకు హత్తుకునేలా వివరించి
ఆత్మీయతాభిమానాలతో అభినందించిన
ఆప్యాయత ఆయనది. గుంటూర్లో ఓ సాహిత్య
కార్యక్రమానికి విచ్చేసి అడిగినదే తడవుగా
మైత్రీ భావంతొ మా ఇంటికి వచ్చి ఓ బంధువులా
గడిపిన మధుర క్షణాలు ఇంకా మనసుపొరల్లో
ఇంకా గుర్తుకొస్తున్నాయి.ఆయన చిరుసమీక్షా గ్రంధం
 శ్రీ శ్రీ కవితాప్రస్థానాన్ని
మరలా పునర్ముద్రించవలసిన ఆవశ్యకతను వివరించగా
అదేపనీలో వున్నాననీ చాలామంది అడుగుతున్నారని
ఎప్పుడు ఫోన్లో పలకరించినా ఇంటిపేరుతో సహా పూర్తి పేరుతో
నవ్వుల జలపాతంలా సంభాషించే తీరు హృదయంగమం.
చెప్పడంజరిగింది.ఒక సౌహార్ద హృదయుడైన స్నేహపాత్రుడునికోల్పోవడం --
బాధాతప్త హృదయంతోఅశ్రు నివాళినర్పించవలసి రావడం-- -----------------------------
ఇతిశివం



Monday, January 11, 2016

అంతర్జాలం అనునిత్యంజేసే
ఆఖండ శివతాండవంలో
లాస్యభావం ప్రదర్శించే
భాగ్యానికినోచుకోలేని
పార్వతమ్మగానేను
 ప్రయాసపడుతూండడం
హాస్యాస్పదంకాకమరేమిటి?
=============================
గలగలలసెలయేరు
======================రావెల
------------------------------
మాఇంటిదగ్గరగా దశాబ్దాలకాలం నుండి
పారుతూ వస్తున్న యేరుఎప్పుడూ ప్రశాంతపు ఝరిగానే
ప్రవహిస్తున్నట్లనిపిస్తూ వుంటుంది నాకు.
అప్పుడప్పుడూ అప్సరోభామినిలా హొయలొలకబోస్తూ
వయ్యారిలా హంసనడకలు నడుస్తూండడం గమనించాను.

వసంతకాలం ఒడిలోకొచ్చిచేరగానే ఒడ్డుననిలిచిన
పూలచెట్ల సోయగన్నంతా తన ముకురంలో చూపుతున్నరీతిలో
కళకళలాడుతూ కనులవిందుగా ద్యోతకమౌతుంది.

గ్రీష్మం సమీపించేసరికి తన గీరను కొంత తగ్గించుకుని
దుందుడుకు తనానికి నేను ఉదాహరణనుకాదన్నరీతిలో
నడకను సాగిస్తూ నయగారాలనుపోతూ నడకలను సాగిస్తుంది.


హేమంతంలో చలినెగళ్ళతో సతమతమౌతూ, పొగమంచు దుప్పటిలోంచి
బద్ధకంగా లేస్తూ సూర్యోదయానికి ఆలస్యంగా ఆహ్వానాలు పలుకుతుంది.

వర్షాకాలంవచ్చిచేరగానే తన ప్రవాహపు వేగాన్ని
అనుగుణంగా పెంచుకుంటూపోతూ, ఉరుకులుపరుగులతో ఉత్సాహపు
ఊపిరులూదుతూ, ఉత్తేజానికి నిర్వచనంగా సాగుతుంది.

శరత్కాలంలో పండువెన్నెలనంతా తన సొంతం చేసుకుని
తారాచంద్రులను తనవొడిలోకి ప్రతిబింబాల్లా చేర్చుకుని
మురిసిముక్కలయిపోతూ ముందుకు సాగుతూ పోతుంది.

శిశిరంలో తన వక్ష స్థలంపై రాలిపడిన పండిన
ఎండుటాకులనుమోసుకుంటూ ఉద్విగ్న మానసయై
 అడుగులనుభారంగా కదిలించుకుంటూ శోకతప్తయై నెమ్మదిగా సాగుతుంది.

------------------------------

మిత్రద్వయం
==========
అవును,  ఇప్పుడు చీకటి చిక్కబడే సమయానికి
సరిగ్గా ఇద్దరుమిత్రులు నన్ను వెన్నంటి నా
పడకగదిలోకి మెలమెల్లగా నక్కి చేరుతూ వుంటారు.
వారి స్వరాభిషేకంతో తమగానఫణితిని అనుక్షణం
ప్రదర్శిస్తూ,నాచెంతకు చేరి నా ఒంటరి తనానికిపలాయనం
 చిత్తగించమని సలహాలిస్తూ సాగిపోతూ వుంటారు.

ఒకటేమో వదన గ్రంధపు మిత్రుల సంక్షిప్తపు
సందేశాల సంబరాలనిమోసుకొస్తూ
 మోజుగా శబ్దం చేస్తుండే  పిడికిలిలో
బందీయైపోయి ప్రపంచపు మనోగతాన్ని ఆ విష్కరించే సెల్ఫోను.

మరొకటి గోడకు చిలక్కొయ్యకు కట్టిపడేసిన వస్తువులా నిలుచుని
కాలఘడియలను నియంత్రించనిచ్చగింపని గోడ గడియారపు
క్షణభంగురమైనా ఖంగు ఖంగున గంటలు మోగించే ఘంటానాదం.
======================================================

Sunday, January 10, 2016

ప్రప్రధమంగా భగవంతుడు
ధరణీతలాన్ని సృజించాడు.
ఆతర్వాత కొందలనూ కొనలనూ
చెట్లూచేమలను పశుసంపదనూ
సృజనచేసి కృతార్ధుడయాడు.

అంతటితోతృప్తిపడలేక స్త్రీపురుషులను
సృజనచేసి ధన్యుడయానని మురిసిపోయాడు.

మొట్టమొదటిసారిగామనం కలుసుకున్న వేళ
ఒకరికొకరం మనసులను ఇచ్చిపుచ్చుకున్నాము.
ఒక్కటవుతున్నామని ఆనందవార్ధిలోమునిగిపోయాము.
కళ్ళల్లోకలలను శృష్టించుకుని మరోలోకంలో
విహంగాల్లా ఎగిరెగిరి ఆకాశమంచులవెంటవిహరించాము.

భావికాలపు సూర్యోదయాలను ముందస్తుగానే పసిగట్టి
హృదయంలో పదిలపరుచుకుని పరమానందం పొందాము.
చందమామా , తారకలను మన హృదయసీమల్లో నిలుపుకుని
శృంగారరస రాయంలో సుందరవదనులమైపొంగిపోయాము.
పల్లెపదాలను పాడుకున్నాం,ప్రణయగీతాలనల్లుకున్నాం.
అనురాగాభిమానాలవెన్నెలలోతదిసిముద్దయ్యాము.

ఇప్పుడెందుకో యిలా ఇద్దరిమధ్యా పొరపొచ్చాలుతలెత్తడంతో
మనదారులు చిన్నాభిన్నం చేసుకుని కాలం గడుపుతున్నాం.
ఒకరిపొడమరొకరికి గిట్టనిస్థాయికి దిగజారిపోయాము.
మమ మన హృదయాలలోవెలిగించుకున్న ఆశాజ్యోతులు 
అఖండంగా వెలుగులు ప్రసరిస్తాయని భావించి
ఆ ఆశలూడియాసలుచేసుకుని వేదనాభరితులమై ఖేదపడుతున్నాం.

ఇప్పుడిక నీరూపం నాకనుచూపుమేరల్లో
కనబడకపోవడమే మేలనుకునే దిశకు దిగజారి ప్రవర్తిస్తున్నాం.
నా అశ్రుసంద్రంలోనిన్ను నిలువునా ముంచేయాలని 
తీర్మానించుకునేలా చేసావ్.
అప్పటి సుప్రభాతాన వినిపించిన సూక్తులన్నిటినీ
మరచి మానవత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాం.
ఆశాఉషసులచెంకు చేరవలసిన మన గమ్యాన్ని
అర్ధాంతరంగా వాయిదావేసుకుని ఆక్రోసపడు తు న్నాం.
నిన్నటిదాకామనమధ్యన వికసించి మురిపించిన సుమసౌoదర్య
మైనలావణ్య సీమను దూరంగా తరిమి శిశిర తరువుల్లా 
ఆశలన్నింటినీ ఉడిగించుకుని ఇలా దిసమొలలతో
ఉద్విగ్న హృదయాలతో  ఉత్కంథావహులమై  మిగిలిపోయాం.


ప్రణయాంజలి
-----------------రావెల.
------------------------------------

కవితలను ప్రేమించడం
ప్రారంభమయిన దగ్గరనుంచీ
ఆకవితామతల్లి సేవలో
బ్రదుకుబాటలో వెన్నెలను
పూయించుకోవడమ్నాకు సంప్రాప్తించిన
సౌభాగ్యంగా భావిస్తుంటాను.

ఈమధ్య ఓ వవలాకారుడు
తన ఇతివృత్తమంతటినీ
 కవితామయంగా తీర్చిదిద్ది
మానవ సంబంధాలను

మహోత్తమంగా తీర్చిదిద్దేలా రచనలు
గావించినందుకు  బహుదా ప్రశంసలనందుకోవడం
కళ్ళారాగమనించి తృప్తిగా శ్వాసించాను.

నాలో అలామొదలైన కవితాదాహం
 నేను కాగితాలన్నింటినీ ఖరాబుచేసేదాకా
ఖాళీగా కూర్చోలేకపోయాను.
నన్ను నిద్రపోనీక,తను నిద్రలేమితో
అవస్థలు పడుతూ నన్ను ఆందోళనకు
గురిచేసి గుట్టుగా గురకపెట్టడం మొదలెట్టింది.

కానీ అక్షరాల అల్లికలో,  పదాలపోహళింపులో
సతమతమయి  పలు దశాబ్దల కాలం ఇట్టే గడిచిపోయింది.
కానీ చివరంటానేనొక కవిత్వ ప్రేమికుడిగా
నిలిచిపోవడం గర్వ కారణంగా అనుకుంటుంటాను.

ప్రారంభ దిశలో నాకవితలను చదివి
లబ్ధ ప్రతిష్టులు తగు సూచనలు చేసి నన్ను
మెప్పించి మురిసిమెరిసే దిశలో కృతార్ధుడిని చేసారు.

ఇప్పటికి నా శైలి నాదయి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
వారి వారి సూచనలు అప్పిసెం ఆచరణయోగ్యమేనని ఇప్పటికీ
మనసా,వాచా,కర్మణా భావిస్తూ వుంటాను.
ఆయాకవితా జిజ్ఞాసులకు అనవరతం కృతజ్ఞతలు
తెలియజేస్తూ నాహృదంతరాళాల్లో వారిని
గౌరవంతో గుర్తుంచుకుంటూ వుంటాను.
ఈ నాకవితాప్రయాణం సమాజహితం దిశగా ముందుకడుగులు
 వేయాలని ఆశిస్తూ అందరిదగ్గరా సెలవుతీసుకుంటున్నాను.

[5 దశాబ్దాల నా కవితాయానాన్ని మూల్యాంకనం గావిస్తూ]
శిశిరతోరణం===
                                 
=================

శిశిరం రాల్చిన
పండుటాకులను
ఎండుటాకులనూ
ఏరుకుని బుట్టకెత్తుకుంటూ నేను
బరువులేని ఆకుల వైపు
భారంగా దృష్టిని సారిస్తూంటాను.
గతకాలoలో గడిపిన మధురమైన
క్షణాలు సైతం బరువును దించుకున్న
స్మృతులేనన్న జ్ఞాపకాలను మెల్లి మెల్లిగా
నెమరువేసుకుంటూ, ముదిమితనాన్ని
చూసుకుంటూ , ముచ్చటపడడంలోని
హాయినినెమరువేసుకుంటూ , గతుకుల బాటలోనయినా
గాంభీర్యంతో అడుగులను ముందుకు వేసుకుంటూ.
గమ్యం చేరుకోవాలన్న గాఢమైన సంకల్ప బద్ధుడనై
జీవనయానాన్ని క్రమబద్ధీకరించుకుంటూ
శిశిరతోరణాన్నికూడా అలంకారమేనని విశ్వసిస్తున్నాను.
ఆనందంగానూ దాన్ని భగవద్ప్రసాదంగా భావించి
 వినయ విధేయతలతో యధాతధంగా స్వీకరిస్తున్నాను.
======================================
---------------------------------------------------------------------------

Saturday, January 9, 2016

నేనొక అసూర్యంపశ్యనైనా బాగుండేది
నీ చూపుల సూర్య తాపాన్నుంచి తప్పించుకునే వీలుండేది.
నేనొక అనాకారిగా జన్మించినా ధన్యతచెందివుండే దానిని
ఈ మృగాళ్ళ విషపు కోరల దం ష్ట్రాకురాల్లోంచి
స్వేఛ్ఛగా తప్పించుకునే అవకాశం
చేజిక్కుంచుకుని బయటపడేదానిని.
=====================================
పూలమ్మాయి వెళ్ళిపోయింది
కానీ ఆమె బుట్టనుంచి
వెలువడిన సురభిళ
పరిమళాల సువాసన
ఇంకా నాసికాపుటాలచెంతన
నాట్యమాడుతూనే వున్నది.
----------------------------------
అంతర్యానం
------------- -----           రావెల
====================

ఆలసించిన ఆశాభంగమయేలావుంది
మన్నించండి నన్ను నేను ప్రశ్నించుకోవాల్సిన
సమయం చడీ,చప్పుడులేకుందా వస్తుందన్న భయం
నన్ను నిలునా వణికేలా చేస్తున్నది,క్షమించండి.

ఎప్పటికప్పుడు అనుకుంటూనే 
అనవసరంగా కాలయాపన చేస్తునట్లున్నాను.
మూల్యాంకనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించడం
ఇప్పటికయినామేలని మనసు 
చెవి దగ్గర రొదపెడుతూనే వుంది.
పట్టించుకునే వ్యవధానం లేదని
పునశ్చరణచేసుకునే యోగాన్ని
వాయిదావేస్తూ వస్తున్నాను.
 ఇప్పుడిక ఆతరుణం ఆసన్నమయింది
తప్పించుకోజూడడం మహాపరాధమై నిలుస్తుంది.

ఇకపై లాభ నష్టాలను బేరీజువేసుకునే విధానం
దినచర్యగా చేసుకోవాలని గట్టిగా తీర్మానించుకున్నాను.
అంతరంగాన్ని అత్యవసరంగా శుద్ధిచేసుకునే ప్రక్రియా
ఈరోజే ప్రారంభించాలని పరమాత్ముని సాక్షిగా 
ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. మనసారా మన్నించండి.

యేరోజు కారోజు సాగరం తనలో పేరుకుపోయిన కల్మషాన్ని
నురగలుగక్కుతూ బయటకు కక్కేయడం గమనిస్తూనే వు న్నాం గదా!!
ఎవరు ఈ కాలుష్యానికి  కారణమని?
అంచనాలువేస్తూ,ప్రణాళికలురచిస్తూ
కాలయాపనచేసిన దాఖలాలెప్పుడయినా
మీ కంటబడిన జ్ఞాపకముంటే చెప్పండి.

తరూ సమూహాన్ని గమనించారుగా!!
వసంతంలో వెల్లివిరిసిన హరితపత్రాలను
రంగూ, రుచీ , వాసనలో వైవిధ్యం వచ్చిచేరిందని
శిశిరం వచ్చేసరికిఅతిజరూరుగా   బరువును దించుకోవాలన్న 
తలంపుతో. శీఘ్రంగా వదిలించుకోవడంలో
నిమగ్నమయిన సంఘటనలెన్ని చూడలేదు మనం.
మళ్ళీ ఆ తరుసమూహమే నవనవోన్మేషంగా 
మన కనులకు విందు గావించడం మనకు కొత్తయితే, కాదుగా !!

ఆలస్యంచేస్తే  ఇక అమృతం కూడా విషమయమవుతుందని   తెలుసుకున్నాను
 అంతరంగలోకి తొంగిచూసుకునే ప్రక్రియ   ప్రా రంభించాలి!
నన్ను నేను వేసుకున్న  ప్ర  శ్నలకు సరయిన జవాబులు రాబట్టే  దాక
సత్య శో ధకుడినై సహకరిస్తూ,    మున్ముందుకు  సాగిపోవాలి.
=================================
ఫేసుబుక్కునందు ఫేసునీదే కాదు
లైకు కొట్టుటందు లౌక్యమబ్బె
రాజకీయమందు రంగులు మార్చగా
వదన గ్రంధమేల వదలవయ్య!!

పైన కండుగప్పి పేలుట మానుము
మేధ తోడ నీకు మైత్రి గలిగె
బ్రదుకు రీతిలోన బంగరమై చూపు
నలుగురందున నీవు నాపగాకు!

Friday, January 8, 2016

నీ నేత్రద్వయం వైపు నేను నా చూపు సారించినపుడల్లా
కాంతి వంతమై విరాజిల్లే ఆ కటకాలమీదనే
 నాదృష్టి స్థిరోభవమన్నట్లు  నిలబడిపోతుంది.
ఎంతోగాఢంగా పరిశీలించాను.కంఠదఘ్నమైన
ఆలోచనలతో పరికించి మరీ అప్రతిభుడనై నిలిచాను.

కనకం కన్నా అమూల్యమైన లోహం దేనితోనో తయారుచేసివుంటారు
అందుకే అవి అంత ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ వుంటాయి.

మన ప్రధమ సందర్శనమప్పుడే అవి నన్ను
 బందీనిచేసిన బంధుత్వం వాటిది.
కనికట్టుచేసిమరీ నన్ను కట్టిపడేసిన
కట్టుబాటు వాటిది.


కొన్ని సమయాల్లో అవి నా అమాయకత్వాన్ని
బహుదా  ప్రశంసిస్తున్నట్లనిపిస్తుంది.
మరికొన్నిసార్లేమో అవి నా అజ్ఞానాన్ని నిలదీసి
 జవాబుకోసం ఎదురుచూస్తున్నట్లుగా తోస్తుంది.

ఒక్కోసారి అవి వజ్రాళ్ళామారిపోయి నా గుండెను కోతకుగురిచేస్తుంది.
నామనసు మందిరంలోకిజొరబడి నన్ను మ్రాను పడేలా చేస్తుంటాయి.

అవి కొన్ని అయస్కాంత క్షేత్రాలచెoతన వినిర్మితమై వుంటాయి
అందుకే అవి ఆకర్షించి నన్ను అధీనుడిగా చేసి ఆదిస్తుంటాయి.

అవి గాలిపటాల్లా నన్ను ఎత్తులకు ఆకాశం దాకా ఎగరేసి
యే  దారం ఆధారంలెకుండా నన్ను ఎగరమని ఆదేశీ స్తుంటాయ్

అవి యేవో మాయనగరిలో మంత్రాలమధ్యన తయారయివుంటాయి
మౌనంగానే మనసును వశీకరించుకునే మహత్తునుకలిగి ప్రవర్తిస్తుంటాయ్.

కనులెదుటనువ్వు సాక్షాత్కరించినప్పుదల్లా నా కనుకలిని
కోల్పోతూ వినుకలికీ దూరమవడానికిమూలకారణం అదేగదా!

నన్ను నిరంతరం ఆనంద వార్ధిలో తేలియాడిస్తూ
సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆనేత్రాలు కొన్ని
కాంతిపుజాల్లా మారిపోయి ఆకాంతిఛ్చటలమధ్య
నన్ను  నా కనీనికలను కట్టిపడేసి కళాత్మకంగా శోభిల్లుతుంటాయి.
==========================================
హరిదాసు కీర్తనల్ అలరింపవీ చెవుల
          భ్రష్టగీతాలతో పాడుబడెను.
గంగిరెద్దు వాని ఘన డోలు సన్నాయి
          శ్రవణపేయముగావు శ్రమయె వలదు.
             
గొబ్బియమ్మల గొప్ప గుర్తుకేరాదులే
        గూగులు సైటులో మూగియుండు
కోడిపందేలలో కొండంత ఘనకీర్తి
      నెత్తురు యేరులై నెగడుకతన
పల్లె తల్లికి ఇప్పుడే ప్రణతులిడుడు
పాడిపంటల భాగ్యాలు వోడి పోవు
సంబరమ్ముల సంక్రాంతి సద్దుగనము
రాదు పాతదౌ రోజుల రంజు నేడు
==================================
కనుముక్కు తీరులు కరకైన నేమిలే
          వెండితెర వేలుపై వెలుగవచ్చు
అక్షరమ్ములు నాల్గు అంటిముట్టినచాలు
          పాటల కవులుగా బ్రదుకనోపు
వస్త్ర సన్యాసమే వరముగా ధరియించ
           నిద్రలో యువతకు ముద్ర పడును.
భాషణ బాగున్న భావి కాలమ్మున
          గొంతుక ఎరువిచ్చు గొప్ప వచ్చు
ఏమి మాయర ఇట్లు చిత్రజగత్తునందు
వెలుగురీతులనెన్నియో వెదుక వచ్చు
పండితుల వోలె శాలువా పైన గప్పి
నాల్గు ముక్కలమంత్రాలు నమ్మ బలికి
అతిధి సేవలనందించు ప్రతిభ హెచ్చు.
=================================

Thursday, January 7, 2016

ఎప్పటికయినా అలాగే తప్పకుండా జరిగి తీరుతుంది
కనబడిన ప్రతిదానినీ కరతలామనుకుని
కళ్ళకద్దుకోవడం మొదలెడితే పాపం శపిస్తుంది.
క్షమించరాని తప్పుచేసినందుకు లెంపలేసుకొవలసి వస్తుంది.
చీకటిని వెంటబడితరుముతూ పొతే చైతన్యం చిగురిస్తుంది.
అదే వెన్నెలను వేటాడాలని తలపొస్తూపోతే అది చీకటి గుయ్యారంలొకి
శీఘ్రమే నిన్ను నెట్టేసి శిఖననుభవించకతప్పదని శాసిస్తుంది.

ప్రప్రధమంగా భగవంతుడు
ధరణీతలాన్ని సృష్టించాడు.
అది అతన్ని తృప్తిపరచలేకపోయింది.
కొండా,కోనలను, చెట్తూ చేమలనూ
పశువుల సంతతినీ
సృఏష్టించి ధన్యుడయానని భావించాడు.
ఐనా ఇంకా తృప్తిచెందక, స్త్రీపురుషులను
రామణీయకంగా సృష్టించి తృప్తిపడిపోయాడు.

మొట్టమొదటిసారిగా మనం ఒకరికొకరం ఎదురయినప్పుడు
కనులు కనులూ కలిసిపోయి హృదయాలు యేకమై నిలిచాక
మనసులను ఇచ్చిపుచ్చుకుని మనోజ్ఞంగా జీవనం సాగించాలని
తీర్మానించుకుని స్థిరపడిపోయాము.
ఇక ఆ క్షణం నుంచి మధురాతిమధురమైన కలలను
కంటూ జీవితాన్ని ఆనంద నదనవనంగా తీర్చిదిద్దుకుని
ఆదర్శజీవితం గడపాలని గట్టిగా తీర్మానాలనుచేసుకున్నాం.

భావికాలపు ఆశలౌషోదయపు కాంతులను భద్రంగా
మనగుండెగొంతుకలలోకి కుదురుగా నిలుపుకున్నాం.
ఆకాశపరిధిలో అందంగా మెరిసే పున్నమిచంద్రుడినీ
తళతళమెరిసేతారకలనూ వీక్షిస్తూ కనులకు విందుగా స్వీకరించాం. ఆనంద వార్ధిలో తేలియాడడం మొదలెట్టాం.
ప్రణయగీతాలను పాడుకుంటూ,జానపదగీతాలను
వల్లెవేసుకుంటూ ఉల్లములను రంజింపజేసుకుంటూ కాలం గడిపాం.
వెన్నెల వానలో తడిసిముద్దయి మురిసిముక్కలయిపోయాం.

ఇప్పుడెందుకో మరి యిలా ఇద్దరిమధ్యా అపార్ధాలు చోటుచేసుకుంటున్నయ్.
పొద్దునలేచింది పొరపొచ్చాలనే ఫలహారాలుగా స్వీకరిస్తున్నాం.
ఒకరంటే ఒకరికి గిట్టనిస్థాయికి దారుణంగా దిగజారిపోయాం!
మనిద్దరిమధ్యనా వెలిగుతూ ప్రకాశవంతంగా ఉన్న ప్రణయ  జ్యోతులన్నీ
అఖండంగా వెలగడం మానేసి మలిగేదిశగా ప్రయాణం మార్చుకుంటున్నాయ్.
ఆశగా మన శ్వాసలను మలుచుకున్నమనం ఇవ్వాళ నియంత్రణ దిశగా
వాటినిమరలించుకుని ఖేదపడుతూ జీవిస్తున్నాం.
ఆశలిక అడియాసలవడం మొదలయింది. నాకనుచూపుమేరల్లో
నీవు కనబడకుంటే చాలనుకుంటూ క్షణమొగ యుగంగా గడుపుతున్నాం.
అప్పుడునీవు వల్లించిన సుప్రభాత సూక్తులేమయాయి?
సూర్యోదయపు సౌందర్యాన్ని ఆస్వాదించిన
ఈ గ్రహణమెలా దాపురించింది?
ఆశాఉషస్సులన్నీ యెలా అంతర్ధానమ్యిపోయాయి?
అనుభూతులూ అనుభూతులన్నీ ఇలా చేదుజ్ఞాపకాలుగా మిగలడమెందుకు?
నా అశ్రు సంద్రంలో నిన్నునిలువునా ముంచేయాలన్న కోర్కెలా నాకుపుట్టింది?
నిన్నటిదాకా మన మధ్యన ప్రభవించి, పరిమళించిన సురభిళపరిమళాలేమయిపోతున్నాయి?
ఈ లావణ్యసీమలోంచి లాంచన ప్రాయంగా మనం నిష్క్రమించక తప్పదా?
====================================================
ఒకప్పుడిక్కడ
పచ్చని పంటపొలాల రెపరెపలు
పైరుజొంపాలు తలలూపేసవ్వడులూ వినబడుతుండేవి.
పొలాలమధ్యన కుంటల ఒడ్డునకూర్చుని
ఇంటిల్లిపాదీ చద్దిమూటలు విప్పుకుని
కొత్త ఆవకాయ బద్దలు నంజుకుతినే
రైతాంగపు పల్లెదనం ప్రభవిస్తూ వుండేది.
నదీమతల్లి సొగసులొలకబోస్తూ వయ్యారంగా
నడుముత్రిప్పుతూ ప్రవహించే కృష్ణమ్మ పరవళ్ళు
పరవశింపజేస్తూ మనసును ఆహ్లాదపరిచెది.
ఒడ్డుకవతలగా లంకగ్రామాల సం రంభం
కనుల్కింపుగా దర్శనమిస్తూ దరహాస చంద్రికలను
వెదజల్లుతూ ఎగిరెగిరిపడే పల్లె పాటల పండుగలుండేవి.


ఇప్పుడిక్కడ చిత్రపటమంతా మారిపోతున్నదట,
పంటలుపండించే పొలాలన్నీ రాజధానికోసం
ధరబోయడం మొదలయిందట, ఆకాశహర్మ్యాలే
కనులకు పంటగా మిగిలిపోవడం ఖాయమని తేలిపోయిందట.
లంక గ్రామాలన్నీ మంత్రివర్యుల దాహార్తికోసం
వారి వారి ఆస్తులచిట్టాల్లొకి ఎగబ్రాకిప్రజలను
పరిహాసం పాలుజేసి పొట్తచెక్కలయ్యేలా నవ్వుకోవడమే
చివరకు మిగిలే సంబరమని అందరికీ టముకు వెసి చెబుతున్నారట.
===========================================
గవాక్షాల గమన దృశ్యం
---------------------------రావెల.

నాలుగ్గోడల మధ్యన నలుగుతూ
నగ్నంగా బ్రదుకును వెడలదీసుకోని
వ్యధార్త హృదయాలు మనవి.
మన మందరం ఎప్పుడూ కలసి కట్టుగానూ,
అప్పుడప్పుడూ విడి విడిగానూ
అంతరంగాల్లో మధనపడుతూ
అక్కదికక్కడే ఆవేశ  కావేషాలను
అణచిపెట్టుకుంటూ కాలాన్ని వెచ్చిస్తూ పోతున్నాం.

పగలు వెలుగులు ప్రకాశిస్తున్నంత కాలం
వేదనాభరిత హృదయాలతో వేగుతూ వుండడం
రాత్రయేసరికి చీకటిగుయ్యారంలో మ్రగ్గవలసి రావడం
ఒకరి మా నసిక స్థితి మరొకరికి కనబడకుండా
జాగ్రత్తలు తీసుకుంటూ జరిగిపోతూ వుంటాం.

రుతువులేవయినాగానీ
  కృద్ధ  గాత్రాలతో సర్దుకు పోవాల్సింది మనమేగదా!!
ఎండలకు గుండెలు వ్రయ్యలయేలా చిట్లుతూ
వానలొచ్చేసరికి తడిసి ముద్దగా మారుతూ
తలతుడుచుకునే వీలుకూడా   దొరకబుచ్చుకోలేని దైన్యం మనది.

వాతావరణాల వైవిధ్యాలతో వ్యధార్త హృదయాలతో
ధూర్త జీవుల్లా బ్రదుకునీడుస్తున్న ధూ ళీ  ,  దూసరాలమేగదా   మనం.

ఒక్కో ఋతువులో ఒక్కొకరకంగా  ప్రకృతి హింసా ప్రవృత్తికి
గురవుతూ మనసును ముక్కలు చేసుకుంటూ బ్రదుకును వెడలదీస్తున్నాం.
వయసు భారంగామారుతున్నా అలాగే స్థిరచిత్తులుగా
కాలం వెళ్ళదీసుకుంటూ
అమరజీవులుగా మిగిలిపోతున్న అల్పులం మనమేగదా!!
===============================================

Wednesday, January 6, 2016

తీన్మార్లా తిక్కరేగి ఎగురు తున్నాడు
జపమాల ధరించి జపాన్ సింగపూర్
నామావళిని శ్రద్ధగా వల్లె వేస్తూ
కాలాన్ని వృధాగాఖర్చు పెట్టేస్తున్నాడు.
నారాయణ! నారా  యణ!! నమ్మబలికిన మాటలను తనంతటతానే

నడిసముద్రంలో నిమజ్జనం చేసి నిండుమనస్సుతో కులుకుతున్నాడు
బాబు అంటెనే యంత్రాంగమంతా బాOబులంటూ భయపడి
ఉపన్యాసశిబిరాల్లో ఉలిక్కి పడి బ్రదుకుతున్నారు.
అన్నీ తానేనననీ అంతట తానొక్కడీనే వుండాలని
చెప్పుడుమాటలనువిని రాష్ట్రానికి చేటును కొని తెస్తున్నాడు.
ఒక్కొక్కరేకునూ రాల్చుకుంటూ పోతున్న పూవులా
శిశిర తరువై మిగిలిపోడానికి సంసిద్ధమవుతున్నాడు.

మరోసారి ఎన్నికవకుండా అన్ని చర్యలూ చేపడుతూ
అపజయం దిశగా ముందుకు దూసుకు పోతూ
మురిసి ముక్కలవుతున్నాడు.
==========================================
సిగ్గేల సిన్మ తారకు
రగ్గేల గ్రీష్మమందున రాజకుమారా?
పెగ్గులతొ చలినిత్రోలకు
ముగ్గులకై ఫ్లాటుముందు మూర్ఛిల్లకుమీ!!

Tuesday, January 5, 2016

బుడబుడక్కలవాడి బులపాటమేగనము
గొబ్బియమ్మలపేర్చెడు  గొప్ప లేదు.
లంగ వోణిలు గట్టెడు లావణ్యలే లేరు
పంచెకట్టున మురిసెడు ప్రతిభ గనము.
సంప్రదాయమున్న సౌమనస్యమెలేదు
శూన్యపరిధిలోనె స్రుక్కె జగతి

సంబరమ్ముల సంక్రాంతి 'సత్తు ' రూపు
కోడిపందేల కాంతులే కొత్తక్రాంతి.
మింటనంటుచు  మెరిసెడు పంటపొలము
గిట్టుబాటవని ధరలతో గిడసబారె
రైతు సోదరునింటిలో రయము భయము.
===================================
అందంగా అలవోకగా నడిచివచ్చే ప్రపంచమే నాకు స్ఫూర్తిమంతమై
నేరుగా గుండె గొంతుకలోకి స్వేఛ్చగా ప్రవహిస్తుంది.
సాహితీ ప్రపంచమలుంఘనీయమని గుర్తెరుగుదును
అయిన మా ఇంటి పెద్దలనుంచి వారసత్వంగా
సంక్రమించిన అద్భుతమైన కళను కాదనే ధైర్యం లేదునాకు.
బహుమతులనందుకొనని రోజుల్లోకూడా బాసటగానిలిచింది
కానుకలొచ్చిన సమయాన కళకళలాడుతూ కౌగలించుకున్నది.
ప్రతి ప్రభాతన పలువరసను దాటి వెల్వడే నవ్వును ప్రకటించి
నన్ను ఇట్టే ఆకట్టుకోగలిగిన కనికట్టు విద్యనేదో కనిపెట్టిన ఘనత తనది.
ఊరించి ముగ్గులోకి లాగడంలో మూర్తీభవించిన సౌశీల్యం తనది.
కళ్ళకు శ్రమనిపించినా కట్టిపడేసి గంటలతరబడి
తనవెంటబెట్టుకుని త్రిప్పగల సౌమనస్యానికి ప్రతీక తను.
ప్రాచీనమా? అర్వాచీనమా ?అన్న అస్తి నాస్తి విచికిత్సలోకి నెట్టేసి
పరువును కాపాడుకుంటూ నడిపించగల సౌహార్దం ఆ ప్రపంచానిది.
కవితామయప్రపంచంలో కట్టుబాట్లకులొంగిపోకుండా కదనరంగంలో
క్రమ శిక్షణకుపేరొందిన సుశిక్షితుడైన సైనికుడిలా అడుగులు ముందుకు వేయిస్తూ
మురిసిపోయే ముచ్చటైన సంప్రదాయం తనది.
కధలుగానో ,  నవలలుగానో, విడిపోయి పాయలు పాయలుగా ప్రవహించే
ఒదిదుడుకులకు జడుసుకోని  ఒద్దికైన ప్రపంచం తనది.
'మంచి పుస్తకం చెంతన మనసంతా చల్లనానే  మనోహరమై,
సువిశాలమై విలసిల్లే సుందర బృందావనన  సుమ సౌరభం తన స్వంతం.

ఆ సన్నిహితమై సాంత్వన కలిగించే పుస్తకప్రపoచానికి
దాసోహమై , నేను ధన్యతను సంపాదించుకోనివ్వగల శక్తినందివ్వమని ప్రణతులిడుతూ -
సెలవు   సెలవు.....మన్నించమని ఆ సాహితీమతల్లిని మనసారా వేడుకుంటూ---------------
=============================================================
స్వయం చోదితం
-----------------  --------------   రావెల

వేదనాభరితాంతరంగంతో
శతాబ్దాలతరబడి సాన్నిహిత్యం పెరిగి
ఆసాంతం దు ఖ:భాజనుడనౌతుంటాను.
 పంజరంలో బంధించబడిన విహంగంలా
శృంఖలాబద్ధనై శారీరకమైన బాధలతో
స్రుక్కి సోలిపోతూ వుండటం అలవాటయిపోయింది.

నాలోనే నిరంతరం కదలడుతూ
అనూహ్యంగా అలజడులకు కారణభూతమైన
అంతరంగ కధనాలకు వెరచి  భయ భ్రాంతులతో
నిరుత్తరుడనై నిలచి పోతుంటాను.

ఇక్కడనేనంటూ నివాసంలేనని  చెప్పాలని
బిగ్గరగా ప్రయత్నించినా డగ్గుత్తికతో
దయాహీనంగా స్థిరపడిపోతాను.

ప్రతిరోజూ ఇలా సమస్యల వలయంలో చిక్కుబడిపోతూ
ఆగ్రహోదగ్రమైన వాతావరణం ఓ కొలిక్కి వచ్చేసరికి
నాలో ఇంతకుముందు పరిచయంకాని దివ్యమైన శక్తులేవో  ప్రవేశించి
నన్ను నిరంతరం సముదాయించాలనీ,మంత్రముగ్ధుడినిగావించాలనీ
వివిధరకాలుగా ప్రయత్నాలను కొనసాగిస్తూ వుంటుంది సాయపడగా
ప్రేమామృతం ఒక నదిలా ప్రవహిస్తూ పైకి
ఎగిరెగిరిపడుతూ
హృదయం కట్టలు దాటి పొంగిపోతూ వుంటుంది.

ఎక్కడినుంచోకొందరు బలాఢ్యులు రాబందుల్లా నేలమీదకు దిగబడి
నన్ను నీ కనుసన్నలకు దూరంగా తీసుకుని తరలి వెళ్లాలని
తమ తమ ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తూ వుంటారు.

నా  మనసేమో కొన్ని కాంతిసంవత్సరాలకన్న వేగంగా
పయనిస్తున్నాయనడానికి దాఖలాలు కోకొల్లలు.
వీటన్నింటినీ సన్నిహితంగా గమనించిన నా అంతరంగం
నీఅంకిత భావానికి మురిసి తన్మయత్వం చెందుతూ వుంటుంది.

నాగొంతుక సమయనుకూలంగా చేసే శబ్దాలన్నీ
నీకు ప్రత్యక్షంగ వినిపించాలని యత్నించినా
గొంతుక సహకరించక,  మౌనరాగాన్నలపిస్తూ వుంటాను.

ఈ క్షణాలలోనే నిరంతరం నీలో ఐక్యమై నిలిచి
 మనుగడ సాగించాలన్న
 తపనకూడా వృద్ధిచెందుతూ కలవరపెడుతూంటుంది.
ఆరుగాలాలపాటూ నీఅభిమాన చంద్రికలే నన్ను
నిరాశానిస్పృహల చీకట్లలోంచి వెలికి లాగుతూ
వెలుగురేకలు బహుదా విచ్చుకునేలా సాయపడుతూ వుంటాయి .

ఆనందం జీవనదిగా నాలో నిరంతరం ప్రవహిస్తున్నంత కాలం
నా చిత్తంలో తిష్టవేసిన  నీ చిత్తరువు నన్ను సందర్భానుసారిగా
 హెచ్చరిస్తూ మార్గదర్శిగా మారి  మున్ముందుకు సాగుతూ వుంటుంది.
============================================





అరక్షణీయం--------
----------------రావెల
***************************

రక్షణ కవచం రాలి పడుతూ
నేలమీదకొరిగింది.
ప్రభాతసమయంలోనో పట్టపగటిపూటనో
ఇతమిద్ధంగా తేలలేదు.
అర్ధరాత్రో అపరాత్రో అలాజరిగి
వుండేందుకూ ఆస్కారం లేకపోలేదు.

ఘనీభవింపజేసే మంచుముక్కలమీదన
నడుస్తూన్న దేహమది.
సరిగ్గా ఊపిరి తీసుకునే వ్యవధానమివ్వని
వాతావరణానుకూలతలేని ప్రాంతమది.
రాత్రనకా పగలనకా పంటపొలాలను
అనుక్షణం తనకనుసన్నలలో నిలుపుకుని
తగు జాగ్రత్తలు తీసుకుంటూ నడయాడే
దిష్టిబొమ్మలాంటి
మంచి మనిషికప్పుకున్న కవచమది.

మనమంతా హాయి హాయిగా  గుండెమీదన చెయ్యివేసుకుని నిద్రపోవాలని
తను నిద్రకన్నెరుగకుండా తిరుగాడె తనువుకు
కప్పుకున్నసమ్రక్షణకవచమే అది.

నాలుగుగోడలమధ్యన మన సుఖ సంతోషాలను
చెరపకుండా హాయైన జీవితం కోట్లాదిమందిమి
తన సాటి సోదరగణంలా భావించి అహోరాత్రాలూ శ్రమించే
శరీరానికి కప్పుకున్న కవచ కుండలాల్లాంటి
రక్షణ కవచమది. సాహసోపేతమైన సాయుధుడైన
సైనికుడు క్రమశిక్షణకు భాష్యం చెప్పగల తొడుగుకదా అది.

అతని వయస్సు మాత్రం అత్త్యంత ఎక్కువైనదేమీకాదుగూడా!!
అయినా తన కర్తవ్య నిర్వహణసమయంలో శతృమూకలను
తుదమొట్టించే ప్రక్రియలో భాగంగా తన కుటుంబాన్ని
కొత్తగా తమ గృహప్రాంగణాలను పావనం చేయాలన్న తలంపుతో
మురిసి ముక్కలవుతూ వచ్చిన ముద్దు ముద్దుపాపాయిలను
ప్రతిక్షణం  గుర్తుంచుకోవాలనీ వారిపైచూపే శ్రద్ధనే
అశేషమైన తనను నమ్ముకున్న జన వాహినిపైనే ప్రసరింపజేయాలని
తపనపడుతూ ధరించిన బరువైన రక్షణకవచమది.
అదిప్పుడు శతృమూకలదాడిలో జారిపడి నేలకొరిగిపోయింది.
రెండు కన్నీటి బొట్లనయినా ఇప్పుడిప్పుడే రాల్చి మన కృతజ్ఞతా భావాన్ని వినయ విధేయలతో ప్రకటించుకుందాం.
అతను మిగిల్చిన జ్ఞాపకాలతోకాలం వెళ్ళదీయాల్సిన అతని కుటుంబానికి రక్షణగా
 మనం ఈ ధరిత్రిపై రక్షణ కవచాల్లా నిలుద్దాం. విపత్కర సమయంలో వారికి మరోమంచికుటుంబమనే భావనతో అతని ఆత్మ శాంతించేలా మన ప్రవర్తను మార్చుకుందాం.

Monday, January 4, 2016

తాత్పర్యసహితంగా---
--------------------------రావెల.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
అందాలనందనవనంలా
వికసించవలసిన జీవితం
విపరీతార్ధం సంతరించుకుని
విషణ్ణవదనయై నిలుచుంటుందని
తహతహ పడుతూ,  తపన పడుతుంటాను.

పక్షిగణంసంగతీ,పశుసమూహం సంగతీ
నేనంత సవిరంగా చెప్పలేనుగానీండి
మనసెరిగి మసలుకునే మనుష్య సంతతిగురించి
అంతో ఇంతో చెప్పగలనన్న ఆత్మ విశ్వాసంతో
 సుంతయినా గంటలతరబడి చెప్పగలను.

మీరు వీటిని సుభాషితాలనుకున్నా,
సూక్తిముక్తావళిగా స్వీకరించినా పర్లేదు.

ప్రభాతసమయాన నేలతల్లికి
పాదాభివందన మాచరించే
పారిజాతసుమాలు.
చెట్టెక్కి మధురస్వరంతో
గానామృతాన్ని పంచే కోయిలమ్మలు.


ఉదయారుణకాంతులనుమించి
అందాలను పంచే హడావుడిలో
అసురసంధ్య ఆకాశాన్ని ఆబగా
కౌగిలించుకుని ఆనంద  పరిచే వర్ణ సమ్మేళనాలు.

రాత్రయేసరికి మెల్లగా మనసును దోచుకోవడానికి
పడకగదిని ప్రభావితంచేసే మల్లెపూల విరిదండలు.
అన్నీ ఈ అవనీతలాన్ని సౌందర్య శోభితంచేస్తుంటే
అపోహలమధ్యన అగ్ని గోళాలను రగిలించుకోవడమెందుకు ?
==========================================
అప్పుడప్పుడూ అనిపిస్తుంది
ఈ బ్రతుకంతా వ్యర్ధమనే
అపార్ధాలవెల్లువ  మన మనసును
ఎందుకిలా ,   ఆందోళనపెడుతుంది?

 అర్ధవంతమైన

తాత్పర్యసహితంగా---
--------------------------రావెల.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
అందాలనందనవనంలా
వికసించవలసిన జీవితం
విపరీతార్ధం సంతరించుకుని
విషణ్ణవదనయై నిలుచుంటుందని
తహతహ పడుతూ,  తపన పడుతుంటాను.

పక్షిగణంసంగతీ,పశుసమూహం సంగతీ
నేనంత సవిరంగా చెప్పలేనుగానీండి
మనసెరిగి మసలుకునే మనుష్య సంతతిగురించి
అంతో ఇంతో చెప్పగలనన్న ఆత్మ విశ్వాసంతో
 సుంతయినా గంటలతరబడి చెప్పగలను.

మీరు వీటిని సుభాషితాలనుకున్నా,
సూక్తిముక్తావళిగా స్వీకరించినా పర్లేదు.

ప్రభాతసమయాన నేలతల్లికి
పాదాభివందన మాచరించే
పారిజాతసుమాలు.
చెట్టెక్కి మధురస్వరంతో
గానామృతాన్ని పంచే కోయిలమ్మలు.


ఉదయారుణకాంతులనుమించి
అందాలను పంచే హడావుడిలో
అసురసంధ్య ఆకాశాన్ని ఆబగా
కౌగిలించుకుని ఆనంద  పరిచే వర్ణ సమ్మేళనాలు.

రాత్రయేసరికి మెల్లగా మనసును దోచుకోవడానికి
పడకగదిని ప్రభావితంచేసే మల్లెపూల విరిదండలు.
అన్నీ ఈ అవనీతలాన్ని సౌందర్య శోభితంచేస్తుంటే
అపోహలమధ్యన అగ్ని గోళాలను రగిలించుకోవడమెందుకు ?

అమావాస్య పున్నములమధ్యన
అందిపుచ్చుకున్నప్రతిరోజునూ
అoదంగా మలచుకోగలిగితే
అంత కన్నా దివ్యధామం
ఈధరిత్రిలోఇంకేముంటుంది?
మీరే  ఆలోచించి చెప్పండి.
===========================
ఉబుసుపోకలాట
-------------------
వంటబాగాలేదని చీటికీ మాటికీ విమర్శించడమే పనిగా పెట్టుకుని కాలం వెళ్ళదీస్తున్నవారికి ఇంటి కూర రుచించదు
పొరుగింటిపుల్లకూరకోసమే తపనపడుతుంటూంది చెడుజిహ్వ.
పోనీ ఈ సహృదయునికి ఆ కూర ఎలా వుండొచ్చో స్వయంగా వండి వడ్దించగల ప్రతిభాపాటవాలూ వుండవనేది అందరెరిగిన సత్యం.
మనకర్మమిలా కాలుతూ వుండవలసిందే!! సమకాలీన సమాజస్పృహ ప్రాచీనకవులకులేదని మరో అశనిపాతంలాంటి విమర్శ.
వీరు మన ప్రాచీన సాహిత్యాన్ని కాచివడబోసారా అంటే శూన్యమనే సమాధానం ప్రస్ఫుటంగా ద్యోతకమౌతుంది.మనవాడుపైకొస్తున్నాడంటే నిలువునా పాతేయండి అనే
సహృదయసమాజంలో, కలికాలం అనే కాలసర్పం పడగనీడన బ్రదుకునీడుస్తున్నంతకాలం ఈవేదన, ఆక్రోశం అనివార్యమనిపిస్తుంది.
==============================
హనన సదృశం
--------------------రావెల.
*****************************


అన్ని అక్షరాలూ స్పష్టంగా
పలికించాలంటూ శ్రమకోర్చి
స్వేదంవెలార్చే మాతృమూర్తి.

తప్పటడుగులువేసినా పర్వాలేదు
తప్పుటడుగులు వేయకూడదని
చిన్నతనం నుంచే జాగ్రత్తలు చెపుతూ
తృప్తిపడుతున్నట్లు సంతసించే నాన్న.

నువ్వు బాగా చదివి అందరిలోకీ
అద్వితీయుడిగా వెలుగుతూ ప్రకాశించాలని
ఉత్సుకతతో ఎదురుచూసే
ఆత్మీయతానురాగాలను
అనూహ్యంగా పంచిపెట్టే
బంధు,మిత్ర సపరివారం.


నీ కరగ్రహణంతో సంతోష,సంతాపసంద్రాలను
ఎంతటిలోతులవైనా సునాయాసంగా ఈదగలనని
భరోసాతో బ్రతికి కాలం వెళ్ళదీసుకున్న అనుంగు
సఖి,చెలీ, సన్నిహితంగా సామరస్యంగా
జీవనయానంలో చేదోడు వాదోడుగా కలిసి
నీకు స్పూర్తినిచ్చిన సహధర్మవారిణి
బ్రదికివున్నంతకాలం నీతో సంభాషించిన
సుభాషితాలను శూన్యాకాశంలోకి విసిరేసి

అందరినీ చెట్టుకొకరిని పుట్టకు కొందరినీ
నిర్దాక్షిణ్యంగా నిష్క్రమించాలని
ఎలా భావించావు మిత్రమా?
అక్షరమంటే అమృతస్వరూపిణి అనిమాత్రమే
అర్ధమయిన మాకు ఆత్మ హననానికి ఓరిమితో
అంతరాంతరాళాల్లోంచి తొంగిచూస్తూ
అంత తేలిగ్గా నిన్ను సాగనంపగలదని
ఊహించలేకపోయిన మా అజ్ఞానాన్నీ, అమాయకత్వాన్నీ
మనసారా మన్నించమని ఎవరినడగాలి? అదికూడానువ్వే
ఓకవితలో వివరించి వుంటే మాకు ఈవెతుకులాట తప్పివుండేదిగా
సమకాలీన జీవనంలో కలసినడచిన కవిమిత్రమా!!
-----------------------------------------------------------
అక్షరమే అంతమై పోవాలని
ఆలోచనలు చేసే దుర్దశ
ఇంత శరవేగంగా సంప్రాప్తిస్తుందని
ఊహకుకూడా ఉబుసుపోని క్షణాన
ఆశలన్నీకూడబలుక్కుని అతన్ని
నిలువునా నిలదీసి ప్రశ్నించడం మొదలెడితే
అవాక్కవడం అతని వంతయింది!!

మన్మధుడే తిష్టవేసిన ఈ కాలంలో
శిశిరానికి చోటేక్కడుందో చెప్పమని
సూటిగా గుచ్చి గుచ్చి ప్రశ్నించాయ్!!
తడుముకోవడం అతని వంతయింది.

నలుగురికీ జ్ఞానాన్ని పంచమని
తన ప్రతినిధిగా సరస్వతమ్మ
సంతోషంగా నిన్ను భువికి పంపితే
అందరిలోనూ ఇలా విషబీజాలను
నాటుతూ దుశ్చర్యలకుపాల్పడే
హక్కు నీకెవరిచ్చారని ? పుట్టించిన బ్రహ్మే
దీక్షగా ప్రశ్నించడం ప్రారంభిస్తే
తడబడడం తడవ తడవకూ  తడుముకుని
సరయిన జవాబులకోసమని  అన్ని దిక్కులకూ
దృష్టిసారించి  వెదకడం అతని వంతయి కూర్చుంది.

--

Saturday, January 2, 2016

హృదయ ఘోష
---------------------రావెల.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్


సామ్రాజ్యమంతా శిధిలమై పోయింది
వసంతం వచ్చివెళ్ళిందని
గొంతు బొంగురుపోయిన కోయిలమ్మ చెప్పింది.

అడవిదారంతా ఇంకా రాలిపడిన
ఎండుటాకులమయమయమై మిగిలింది.

కరువు కాలమే ఎదురొచ్చి స్వాగత వచనాలు
దీన స్వరంతోపలికి తిరిగి వెళ్ళిపోయింది.

పూలచెట్లన్నీ గ్రీష్మంలోకూడా
అశ్రు బిందువులను రాల్చిన ఉదాహరణలే కోకొల్లలు.


ప్రవాసం బాధాకరమేననితెలిసినా
ఇంతగా విషాదసాగరమై రోదిస్తుందని ఊహించలేదు.

అంటుకున్న అడవులను ఆర్పుకోవడంలోనే
గ్రీష్మర్తువంతా గొడవ గొడవగా సాగింది.

ఒక్కోకవితకు వేలసంఖ్యలో ప్రతిఫలముందన్నా
కవితను రాసే మహాకవులు కనపడడంలేదు.

బట్టబుర్రను మునివ్రేళ్ళతో గోక్కోవడమే
నిత్యకృత్యమై మిగిలిపోయింది.

[ఎనిమదవ శతాబ్దపు చైనీస్ కవితకు అనువాదం---]

Friday, January 1, 2016

చిత్తుగా కిందకొరిగిన
గతకాలపు  శిశిర తుల్యమౌ
వాగ్దానాల పరంపరలు
కొత్తగా రెక్కలు తొడుగుకున్న
నవనవోన్మేషమైన కోర్కెల వసంతాలు
ఆరుకాలాలపాటు
 పట్టువదలము పొమ్మంటున్న
ష డ్రుచుల సమ్మేళనాలు.