మౌన భంగం
-------------------రావెల.
===============================
వ్యధార్త భారత యదార్ధ దృశ్యం
ఆవిష్కరింపబడిన సమయాన
చెల్లుబాటుకునోచుకోని చేదు జీవితాలతో
సొల్లువాగుడు వాగుతున్నామని తెలిసీ
బండకేసి బాదినా అంటుకున్న మురికిని
పోగొట్టుకోవడానికిచ్చగింపని
రాజకీయ క్రీడలో ప్రతిసారీ
ఓటమిని సొంతం చేసుకుంటున్న
నా తోటి నా సోదర సోదరీమణులతో
మనసారా సంభాషించాలని వున్నది.
ఇక నామౌనం వీడకతప్పేట్లు లేదు.
సంభాషణలో సౌకుమార్యాన్ని సాంతం
విడనాడి కొంచం కరుకుదనంతో
కటువుగామాట్లాడడం తప్పదని తెలుసుకున్నాను.
పరకాయప్రవేశం చేసిన నాదేశ జనాభాలో
పేరుకుపోయి కరగనుపొమ్మంటున్న కన్నీటి జడులను
జఠరాగ్నిని రగిల్చయినాసరే జ్వలితం చేయక తప్పేట్లులేదు.
కులాలిలా సంకుల సమరానికి సిద్ధమై గిరి
గీసుకుంటున్నప్పుడు
మతాలు మారణహోమాలకు ఆజ్యంపోసే దిశగా
సర్వసన్నద్ధమై యాత్రను సాగిస్తున్నప్పుడు.
శుద్ధజలాలతో ప్రక్షాళనం చేయాల్సినచోట
సుద్ధిజలాలతో మంత్రించి మాయమాటలతో
మనుషులను మనుషులే వంచనా శిల్పులై
ఆరాధించవలసిన ఆలయ విగ్రహాల్లా మార్చి
ప్రతిష్ఠ చేసి పలాయనం చిత్తగిస్తున్న వేళ
నామౌనం చేతగానితనమై నవ్వుతాలుగా
పరిణమిస్తున్న అశుభకాలంలో
ఇక నామాటలను మారణాయుధాలుగా మార్చి
దేశాన్ని దశాబ్దాలుగా అప్రదిష్ట పాలుచేస్తున్న
పుండాకోరులందరికీ నా పుణ్యభూమిచెంతనే
ప్రాయశ్చిత్తంచేయడం అత్యంతావశ్యకమని
నామనసు గుండెదగ్గర తనగోడును ఏకబిగిన
శోకతప్తయైన మానసంతో వివరిస్తుంటే
నామౌనంతో నేనింకా మనజాలనని హెచ్చరిస్తున్నాను.
అందుకే యే దార్శనికులూ నిర్ణయించకుండానే ఒక ముహూర్తాన్ని యెంచుకుని
సమాజహితంకోరుతూ వెన్నునంటిపెట్టుకుని వెల్వడుతున్న వీరావేశంతో
మౌనాన్ని వీడాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను.
ఆదిశగానే ఈ వినూత్న మైన సమర శంఖాన్నిపూరిస్తూ
మరో ప్రస్థానం వైపు అడుగులు నాజాతిచేత వేయించాలని
ప్రగాఢమైన విశ్వాసంతో ముందుకు దూసుకెల్తున్నాను.
ఇక ఈ మౌన పోరాటానికి స్వస్తిచెప్పాలనీ
నామౌనానికి మానభంగం తప్పదనీ హెచ్చరికలుచేస్తూ
దశాబ్దాలు సాగుతూ వస్తున్న నా ఈ మౌన దీక్షను స్వఛ్చందంగా విరమిస్తున్నాను--
============================================