Monday, December 28, 2015

అటువైపు తలత్రిప్పినప్పుడల్లా
నీతోగడిపిన మధుర స్మృతులన్నీ
గుర్తుకువొస్తుంటాయ్.


విరబూసిన ఆనందంతో మిసమిసలాడుతూ
నవ్వుతున్న పూలచెట్టులానువ్వు
నేనెమో వనాన్ని పోషణజేసే తోటమాలిలా.

ఆచిరుమందహాసాలజడులన్నీ
నయాగరాజలపాతం సమీపాన
తలపైన కురిసే వాన తుంపర్లలా
నాకొక ప్రత్యేక ప్రపంచాన్ని కానుకగా
నువ్వు నాకందించిన భావన నన్ను
 సంతుష్టుడినిగావిస్తూ.

ఇప్పుడేమో విపరీతమైన చలిగాలి
శరీరాన్ని గడ్డకట్టించడం ఖాయమన్నట్లు
హేమంతం ఒడిలోకి జారిపోతున్న ధరణీతలం.

ఇప్పుడేమో అటువైపు దృష్టిని సారించాలన్నా
అనూహ్యమైన భయం నన్ను వశంచేసుకుంటుంది.
ఘనీభవించి మంచు కొండలా దర్శనమిచ్చే
ఆ జలపాతం వైపు తలత్రిప్పలేని నా అసమర్ధత
నన్నే అవహేళనచేస్తున్నట్లుంటుంది.

నీ నవ్వుల నావనలా సాగుతున్నట్లు ఊహించుకోవడమే
నా సౌందర్య రిరంసను ద్విగుణీకృతం చేస్తున్నట్లనిపిస్తుంది.

యే ఒక్క జ్ఞాపకాన్నయినా ఘనీభవించడానికిష్టపడని
నేను అలాగని ఒక్కుదుటన  భీష్మించుకొవడానికీ ససేమిరా ఇష్టపడను.
=============================================

No comments:

Post a Comment