Sunday, December 13, 2015

లుంగలు చుట్టుకుపోతున్న ఆకాశాన్ని
చూపుడువేలు గురిచూసి వేధిస్తున్నది
పాదచారుల పదఘట్టనలక్రింద
నలుగుతూన్న ధరణీ తలం
నల్దిశలా ఆక్రోశిస్తున్నది.

కాలం మాత్రం కట్టెదుటనే నిలిచి
కుతూహలాన్ని ఆవిష్కరిస్తున్నది
అవి అశ్రు ధారలా? ఆనంద భాష్పాలా?
తేల్చుకోలేని ఆక్రోశం
 అనునిత్యం అలమటిస్తున్నది.

నీకూ నాకూ మధ్యన
ఏమీ తోచుబాటుకాక
నిశ్శబ్దం నిద్రలోకి జారుకోని
ఆలోచనారాహిత్యంలో
నిగ్రహాన్ని కొల్పోతూంటే
ఇదంతా అసహన మాహాత్మ్యమని
మాధ్యమాలన్నీ ఊదరగొడుతూన్నవి.

అధికారాన్ని  అజ్ఞానాంధకారపు విపినాటవిలామార్చిన
అధిష్టానం ఆరోపణలనెదుర్కొంటూ   రాజకీయ కాలుష్యానికి
  ఊపిరాడని దిశలో చట్ట సభలను సైతం  నడువనివ్వమని  రాజ్యంగాన్నికూడా
అపహాస్యం పాల్జేసి ఆనందిస్తున్నది.

================================================

No comments:

Post a Comment