ప్రశాంతమైన ఈసరసు చెంతకు
ఇప్పుడే నడిచి వచ్చాను.
రోజంతా నన్ను పట్టికుదిపేసిన
నిరాశనూ, నిస్పృహనూ
వదిలించుకోవాలనుకుని
అదేపనిగా తీర్మానించుకుని మరీ వచ్చాను.
విపరీతంగా జబురుతున్న గాలివాలుకు
ఆకులన్నీ నేలకు రాలిపడుతున్న వైనం
హృదయవిదారకంగా నన్ను కలచివేయడం మొదలెట్టింది.
దగ్గరగా ఎగురుతూన్న చేపల నీడలు
చెల్లా చెదరై దృశ్యాన్ని భయానకం చేస్తున్నాయ్.
ఇంత శిశిర ఝంఝలోనూ తామరపూలు తమ తమ రూపాలు
మార్చుకునేలా
మేము విచ్చుకోలేము పొమ్మంటూ మూతులు ముడుచుకు కూర్చున్నాయ్.
నా భావాలు పంచుకునేందుకు సన్నిహితులైన చెలికాండ్రు
లేనందుకు చింతనామృతయైన చిత్తంతో నా అంతరంగ భావాలను
నేనూ ఒక్కడినే ఆవిష్కరించుకుంటూ దీర్ఘ మైన ఆలోచనలోమునిగిపోయాను.
======================================

No comments:
Post a Comment