ఒంటరి తనాన్ని ఓడించి తీరాలని
కంకణం కట్టుకున్నాను.
పగలంతా సెగల పొగలతో
ఊపిరిబిగబట్టుకుని గడిపాను.
రాత్రయేసరికి ఊగిసలాడే మనసుకు
ఊరటకలిగించాలని తలచాను.
సంసారసాగరంలో సమృద్ధిగా పొందిన
అనుభూతులను కళ్ళలోకి రంగరించుకుని
ప్రాచీన సాహిత్యపు పరిచయాలతో
మమేకం ఐపోయి ఆనంద వార్ధిలో తేలియాడాను.
పోతనామాత్యుని భక్తిరసామృత ధారలను
మనసుకెక్కించుకుని మైమరచిపోయాను.
కరుణశ్రీ అంతరంగాన్ని ఆ విష్కరించుకుంటూ
అమందానంద కందళిత హృదయారవిందుడనై మురిసిపోయాను.
అన్నమయ్య కీర్తనలను వింటూ ఆధ్యాత్మిక సౌందర్యపు
అంచులను తాకి ఆశావహుడిగామిగిలాను.
మనసున మనసై మమతానురాగాల మహా సంద్రంలో
ముంచి మునకలేయించిన భాగస్వామికి చిరుకానుకగా
ప్రవాస జీవనంలోనయినా పరమోత్కృష్టంగా
రాణించడం మేలని నిర్ణయానికొచ్చి
పాతకాలంలో చదివిన శతకాలలో నన్నాకర్షించిన
పద్యాలను వల్లె వేస్తూ పరమానందంగా కాలం వెళ్ళదీస్తున్నాను.
ఓటమినెరుగనని విర్రవీగుతున్న ఒంటరితనానికి
గోడ గడియారపు ట్రింగు ట్రింగు ప్రకంపనలతోనూ
సందేశాలనన్నింటినీ సెకన్లలో అందించాలని
తహతహ పడుతున్న కరతలామలకమైన సెల్ఫోనులను
వివిధ లాంఛ నాలతో అందించి సత్కరించాలని చూస్తున్నాను.
========================================

No comments:
Post a Comment