నది ఎంతగా హొయలొలకబోస్తూ
నడుమును అష్టవంకర్లుగా తిప్పుకుంటూ
పంటపొలాలను తడుపుతూ వాటి సంతోషాన్ని
స్వయంగా పంచుకోవాలని ఆంతురత పడుతూ,
అందానికి నేనే ఉదాహరణమన్నట్లు
వడి వడిగాముందుకు సాగి ప్రవహిస్తున్నది.
నది నీటి లోతుల్లోకి బాతులు/కొంగలు
తమ ముక్కులు రిక్కించి దాహం తీర్చుకుంటున్నవి.
ముసలి బామ్మ మనుమలకు కాగితం పడవలను చేసి
ఎలా వాటిని పిల్లకాలువల్లోకి వదలాలో బుద్ధిగా నేర్పుతున్నది.
చిన్నకొడుకేమో వలకు ఎరదగ్గరగా వదులయిన మేకును
గట్టిగా కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆకలయేసమయానికి అంతోఇంతో అన్నం పెట్టడానికి
మనుషుల ఆప్యాయతానురాగాలు తగ్గనంతవరకు
ఋతువులెలా ప్రవర్తిస్తే తప్పేమిటన్న నా భావం నన్నే
భయపెట్టాలని నిరంతరం శ్రమిస్తున్నది.
ఆకాశమంతటా తెల్లతెల్లని మబ్బులు నదిరంగును
ద్విగుణీకృతంచేసానని చెప్పుకోవాలని హుషారుగా
పరుగెడుతూ అరుపులూ కేకలతో అందరినీ ఉత్సాహపరుస్తున్నది.
నదీతీరంలోని ఆవాసం ఇంత హాయిగా వుంటుందని తెలిసాక
ఇక్కడినుండి వలసవెడలిపోవాలన్న కోరికను
బలవంతంగా అణచుకుంటున్నాను.
[712-770 కు చెందిన DuFu కవి కవిత ప్రేరణతో----]

No comments:
Post a Comment