వసంతం వచ్చి వెళ్ళిపోతుందని తెలుసు
సరిగ్గా ఎప్పుడు వెడలిపోయిందో
తెలుసుకునేసరికి నా తెలివి తెల్లారిపోయుంటుంది.
ఈ సుమ సుగంధాల పరిమళాలు
ఇంకా నా నాసికా పుటాలదగ్గర
నాట్య భంగిమలను ప్రదర్శిస్తూనే వున్నాయ్.
మనసుపొరల్లో వికసించిన హరితపత్రాలు
ఇంకా రంగులు మార్చుకునేదిశకు చేరుకున్న దాఖలాలేదు.
ఉదయాన్నే సుప్రభాతపు వేళ శుభోదయంపలికే
పారిజాత సుమాలింకా సుందర వదన సౌందర్యాన్ని
వదులుకున్నట్లు నాకేమీ సమాచారం అందినట్లు లేదు.
రాత్రిపూటలమాత్రమే రాసిక్యమొలకబొసే రేరాణి
పూలింకా మొహంవాల్చిన సందర్భమూ కనబడలేదు.
ఇంకెట్లా వసంతం వెడలినట్లు పసిగట్టగలను మీరే చెప్పండి.
నా హృదయ గత లయలు ఇంకా వసంతం వాకిట్లోంచి
కదలి వెడల లేదనే నా ప్రగాఢ విశ్వాసం

===================================
No comments:
Post a Comment