Wednesday, December 30, 2015

కంఠ దఘ్నంగా
కన్నీటి సంద్రంలో
మునిగిపోయివున్నాను.
కరుణించి లాలించేవారికోసమే
ఆశగా ఎదురుచూస్తున్నాను.
ఎదురుగా ఎక్కడో వెదురువనంలోంచి
లీలగా వినబడుతున్న వంశీమోహనుడి
వేణుగానం ఒడలంతటినీ పులకింపజేస్తుంది.
మనసునంతా మనోహరుడిరూపమే కట్టెదుట
మానుషవిగ్రహరూపం దాల్చి అశీస్సులు అందజేస్తుంది.
=====================================
సాగర తీరమంతా ఆకాశం పులుముకున్న
నీలిరంగు ఛాయతో దర్శనమిస్తున్నది.
ఎలాగైనా దానిరంగును మార్చాలని
పక్షులన్నీ తమ రెక్కలను విప్పార్చుకుని
శతవిధాలా తమ తమ ప్రయత్నాలలో
మునిగి తేలడం మొదలెట్టాయి.

తీరంకు సమీపంలో హరితక్షేత్రంగా విలసిల్లే
కొండా,కోనలపై సుశిక్షితులైన సైకికులులా
నిలబడివున్నతరూ సమూహంపై కిరీటాల్లా
దీసెన పూలూ తంగేడుపూలూ తలమానికమై
వెలుగొందుతూ పరిసరాలకు నూత్నశోభను
అదనపు ఆకర్షణగా అందిస్తు, తృప్తిపడుతున్నాయ్.

గోడకు సున్నంగొట్టే కుంచెల్లా రెక్కలు విప్పుకున్న
పక్షులు కళ్ళకు కనబడుతున్న దృశ్యం మనోహరంగా తోస్తున్నది.

వీటి అమాయకత్వాన్ని చూసిన సాగరం వాటిని భ్రమపెట్టాలన్న తపనతో
నురగలను వెలరుస్తూ నవ్వుకుంటూ మున్ముందుకు సాగుతున్నది.
==========================================================

Tuesday, December 29, 2015

ప్రశాంతమైన ఈసరసు చెంతకు
ఇప్పుడే నడిచి వచ్చాను.
రోజంతా నన్ను పట్టికుదిపేసిన
నిరాశనూ, నిస్పృహనూ
వదిలించుకోవాలనుకుని
 అదేపనిగా తీర్మానించుకుని మరీ వచ్చాను.
విపరీతంగా జబురుతున్న గాలివాలుకు
ఆకులన్నీ నేలకు రాలిపడుతున్న వైనం
హృదయవిదారకంగా నన్ను కలచివేయడం మొదలెట్టింది.

దగ్గరగా ఎగురుతూన్న చేపల నీడలు
చెల్లా చెదరై  దృశ్యాన్ని  భయానకం చేస్తున్నాయ్.
 ఇంత శిశిర ఝంఝలోనూ తామరపూలు తమ తమ రూపాలు
మార్చుకునేలా
మేము విచ్చుకోలేము పొమ్మంటూ మూతులు ముడుచుకు కూర్చున్నాయ్.

నా భావాలు పంచుకునేందుకు సన్నిహితులైన చెలికాండ్రు
లేనందుకు చింతనామృతయైన చిత్తంతో నా అంతరంగ భావాలను
నేనూ ఒక్కడినే ఆవిష్కరించుకుంటూ దీర్ఘ మైన  ఆలోచనలోమునిగిపోయాను.
======================================
సమకాలీన సమాజ జీవిత చిత్రణంటే
జరిగిన ఉత్కంఠావహమైన సంఘటను
చిత్రీకరించడమా? లేదాదాన్ని చిత్రికపట్టి
అనవసరమైన భాగాలను తొలగించడమా?
ఈ సందేహాల్లోమునిగితేలుతున్న యువకవి కిశోరం!!

చదవకుండానే ఫేస్బుక్కు లో చదివిన కవితకు
లైకును కొట్టేస్తే సరిపోలా!! చదివి వ్యాఖ్యను
పెట్టాలా ?అంత మంచి కవితను వెన్వెంటనే
 పంచుకోవాలన్న దుగ్ధనెలా అణచుకోవాలి?
ఈ ఆలోచనా సంద్రంలో అస్తినాస్తి విచికిత్సలో
నిండామునిగి బయటపడలేమోనన్న
 భయంతో  వర్ధమాన కవిమిత్రుడు.

ఈకళనాకెందుకబ్బలేదబ్బా?
ఎమోలే నా హీరో అభిమాన సంఘాలలో  పిచ్చిగా
లైకులుకొడుతూ పదులమదితో పంచుకోవడంలో వున్న తృప్తి
ఈ సమసమాజపు పోకడలను మూల్యాంకనo చేయడంలో
ఎక్కడుందిచెప్మా ? అంటూ లొట్టలేస్తూ చొంగలుకార్చే వీరాభిమాని
సినిమాయాలోకపు మాయాజాలంలోపడి కొట్టుకుపోతున్న
.
కంఠ దగ్ధమైన నీరస స్రవంతులకుఈ   యువతరం ప్రతినిధి.
=================================================



నది ఎంతగా హొయలొలకబోస్తూ
నడుమును అష్టవంకర్లుగా తిప్పుకుంటూ
పంటపొలాలను  తడుపుతూ వాటి సంతోషాన్ని
స్వయంగా పంచుకోవాలని ఆంతురత పడుతూ,
అందానికి నేనే ఉదాహరణమన్నట్లు
వడి వడిగాముందుకు సాగి ప్రవహిస్తున్నది.

నది నీటి లోతుల్లోకి బాతులు/కొంగలు
తమ ముక్కులు రిక్కించి దాహం తీర్చుకుంటున్నవి.

ముసలి బామ్మ మనుమలకు కాగితం పడవలను చేసి
ఎలా వాటిని పిల్లకాలువల్లోకి వదలాలో బుద్ధిగా నేర్పుతున్నది.
చిన్నకొడుకేమో వలకు ఎరదగ్గరగా వదులయిన మేకును
గట్టిగా  కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఆకలయేసమయానికి అంతోఇంతో అన్నం పెట్టడానికి
మనుషుల ఆప్యాయతానురాగాలు తగ్గనంతవరకు
ఋతువులెలా ప్రవర్తిస్తే తప్పేమిటన్న నా  భావం నన్నే
భయపెట్టాలని నిరంతరం శ్రమిస్తున్నది.


ఆకాశమంతటా తెల్లతెల్లని మబ్బులు నదిరంగును
ద్విగుణీకృతంచేసానని చెప్పుకోవాలని హుషారుగా
పరుగెడుతూ అరుపులూ కేకలతో అందరినీ ఉత్సాహపరుస్తున్నది.

నదీతీరంలోని ఆవాసం ఇంత హాయిగా వుంటుందని తెలిసాక
ఇక్కడినుండి వలసవెడలిపోవాలన్న కోరికను
బలవంతంగా అణచుకుంటున్నాను.

[712-770 కు చెందిన   DuFu  కవి   కవిత ప్రేరణతో----]

Monday, December 28, 2015

అటువైపు తలత్రిప్పినప్పుడల్లా
నీతోగడిపిన మధుర స్మృతులన్నీ
గుర్తుకువొస్తుంటాయ్.


విరబూసిన ఆనందంతో మిసమిసలాడుతూ
నవ్వుతున్న పూలచెట్టులానువ్వు
నేనెమో వనాన్ని పోషణజేసే తోటమాలిలా.

ఆచిరుమందహాసాలజడులన్నీ
నయాగరాజలపాతం సమీపాన
తలపైన కురిసే వాన తుంపర్లలా
నాకొక ప్రత్యేక ప్రపంచాన్ని కానుకగా
నువ్వు నాకందించిన భావన నన్ను
 సంతుష్టుడినిగావిస్తూ.

ఇప్పుడేమో విపరీతమైన చలిగాలి
శరీరాన్ని గడ్డకట్టించడం ఖాయమన్నట్లు
హేమంతం ఒడిలోకి జారిపోతున్న ధరణీతలం.

ఇప్పుడేమో అటువైపు దృష్టిని సారించాలన్నా
అనూహ్యమైన భయం నన్ను వశంచేసుకుంటుంది.
ఘనీభవించి మంచు కొండలా దర్శనమిచ్చే
ఆ జలపాతం వైపు తలత్రిప్పలేని నా అసమర్ధత
నన్నే అవహేళనచేస్తున్నట్లుంటుంది.

నీ నవ్వుల నావనలా సాగుతున్నట్లు ఊహించుకోవడమే
నా సౌందర్య రిరంసను ద్విగుణీకృతం చేస్తున్నట్లనిపిస్తుంది.

యే ఒక్క జ్ఞాపకాన్నయినా ఘనీభవించడానికిష్టపడని
నేను అలాగని ఒక్కుదుటన  భీష్మించుకొవడానికీ ససేమిరా ఇష్టపడను.
=============================================

Saturday, December 26, 2015

బాధ కవితను పుట్టిస్తుంది
అనుకున్న విధంగానే కంటనీటిని
ధారాపాతంగా వర్షింపజేస్తుంది.
పోయినోళ్ళు ఎంతమంచివారయినా
మనం వెంటబడి అక్కడిదాకా వెళ్ళేదాకా
వేదనాతప్తయైన హృదయం ఘోషిస్తుంది.
ఇది జీవనసత్యమని గుర్తెరిగినా
ఏమీ చేయలేకపోతున్నామన్న  అసమర్ధత
ముల్లయి  పొడుస్తూనే ఆ గతాన్ని
గుర్తుకు తెస్తూవుంటుంది.
=============================

Friday, December 25, 2015

నువ్వున్నంతకాలం అనురాగాన్ని
అపురూపంగా పంచుకున్నావు.
నేనేమో నీతో గడిపిన
అనుభూతి సంద్రాన్ని
సునాయాసంగా ఈదుతూ
కాలాన్ని గడుపుతున్నాను.


ఇప్పుడేమో ఈఅనుకోని ప్రవాసం
దు:ఖనయనాలతోనేమో నా ఆక్రోశం.

అగ్ని సాక్షిగా ఒక్కటయిన మనం
అగ్ని సంస్కారంతోనే ఏకమవుతామేమో
నన్న ఆశనన్ను అమరుడిగాజే జేసి దీవిస్తున్నది.
================================

Wednesday, December 23, 2015

హిమపాతం హేమంతర్తువులో
ధారలుగా కురుస్తుంది
పర్వతాలు,కొండా, కోనలూ
పచ్చిక బయళ్ళూ తడిసిముద్దవుతాయి
ఉన్ని దుప్పటి కప్పుకుని సంసారం
శృంగార సాగరంలో దాంపత్య నౌక
జీవన సారాన్ని ధర్మానుసరిగా
మృదు మధురంగా గ్రోలుతూ నవ నవోన్మేషయై
వర్ధిల్లుతోంది వంశాభివృద్ధి తపనతో.

Tuesday, December 22, 2015

సుప్రభాతసేవకోసం పూలుకోద్దామని
పూలచెట్టు దగ్గరకెళ్ళి పూలను కోసి
వాటినన్నింటినీ పూలబుట్టలోకెత్తుకున్నాను
ఈలోపు కొన్ని దిగువనున్న కొమ్మలు
నామీద మంచుబిందువులను రాల్చాయి.
అవి ఆనంద భాష్పాలా? అశ్రుబిందువులా?
లేదా ఆ భగవానుని ఆశీర్వచనాలా?
=============================

Monday, December 21, 2015

మంచుమలలా నీవు ఘనీభవిస్తుంటే
అగ్ని శిఖలా నేను నిన్ను ద్రవీకరింప
జేయాలని విశేషంగా  శ్రమిస్తూ..నేను

నాకు తెలుసు నీప్రతి ఊర్పులోనూ
నిరాశే శ్వాసిస్తున్నదని
నీ ప్రతికదలికలోనూ
మౌనమే ధ్వనిస్తుందని .
 ఐనా ఎక్కడో మారుమూలలో
చింతనామృతమత్తయైన నా ధ్యాస
నిన్ను అలరించగలనన్న మూఢనమ్మకం.
ఏఇతర వ్యాసంగాలపైన మనసు మరల్చలేనని
నీకూ అనుభవేక వేద్యమేగదా!!
అందుకే వినయ విధేయతలతో నీ  మ్రోల
నా విన్నపాల వరమాల ప్రభూ!!

================================

Sunday, December 20, 2015

ఇవ్వాళనేను నా మనసులో
నిర్మితమైన అందాల బృందావనంలోకి
విహరించాలని నిర్ణయతీసుకున్నాను.
అదేమిటో నా  అంతరాత్మ నీ పేరునే
పదే పదే జపిస్తూ నన్ను
 ఆనందమనే నదిలొకి
ముంచేసి మరీ మురిసిపోతున్నది.


ఆకుల గలగలలనీ నీవు నాతో
సంభాషిస్తున్న తీరునే గుర్తుచేసి
నన్ను ఆనంద వార్ధిలో ఓలలాడిస్తున్నది.
నిశ్శబ్దం ఆ వనంలోకి చొచ్చుకునిపోయి
నీకూ నాకూ మధ్యన అగాధం ఏర్పరచాలని
విరామమెరుగకుండా శ్రమిస్తున్నది.

మౌనందాల్చిన ఋషిపుంగవుల్లా తరువులన్నీ
పొగమంచులోకప్పబడి హిమాలయాల ప్రశాంతతను
జ్ఞప్తికితెచ్చే మహిమాలయాల్లా
 సోదాహరణాలై నిలుస్తున్నవి.

ఆలోయమలుపులో తచ్చట్లాడుతున్నది నువ్వేకదా
రా గబగబా వచ్చేసి నులివెచ్చని నీ కౌగిలిని
చలికోటులా నాకు కప్పేసి నన్ను అలరించు!

నీకోసం వేచి వేచి నిద్రలేమితో మూతలువడుతున్న
నా నేత్రాలు నిన్ను లీలగా గుర్తుపట్టాయిలే!!
నువ్వు దూరమైన క్షణాలన్నీ నన్ను మూగగా
రోదించడం మానమని హితబోధజేసి ఓదారుస్తున్నది.

ఇప్పుడప్పుడే ఈఆహ్లాదకరమైన వాతావరణంలోంచి
చిత్తగించమని నువ్వెంత ప్రాధేయపడినా నా అంతరాత్మ
ససేమిరా ఒప్పుకోవద్దని ఈ ఆనంద నందనవనాన్ని
విడనాడం నావల్లకాదని తేల్చిచెప్పమని ఆఅజ్ఞాపిస్తున్నది.

ఇంకా ఈ మనోవల్మీకంలోనే నిరంతర ధ్యానమగ్నుడనై
నా ఆలోచనా పరిధిని దిగంతాల అంచులదాకా
విస్తరించుకోవాలన్న ఆశ నన్ను అనూహ్యంగా లొంగదీసుకుంది.
ఇక్కడపూచేపూలూ వీచేగాలి నన్ను నీలానే ఆప్యాయతానురాగ బంధాలతో
అనుభూతి నదుల్లో ముంచి తేల్చేస్తున్నాయ్.
ఆనందం జీవనది యన్న ననుడిని నాకళ్ళెదుటనే
సాక్షాత్కరింపజేసి సావదానుడిగా మార్చేస్తున్నాయ్.
=======================================
రోజుకు కోటిమంశిశువులుప్రపంచపు
వెలుగురేఖలను చూడకుండానే
మాతృ గర్భంలోనే మృత్యువు కౌగిలింతలలో
దూరి అదృశ్యరూపం దాలుస్తున్న నాదేశంలో
ఆడపిల్లలకు భద్రతకావాలని అరిచే కేకలు
నాకు 'నిమ్మకు నీరెత్తి నారన్న 'సామెతను గుర్తు చేస్తుంది.


చట్టం చట్రాల్లో కుక్కి నిర్భయ నిందితుడికి
గుండెవిప్పుకుని బహిరంగంగా తిరగొచ్చని
న్యాయస్థానం ధర్మాన్ని వల్లిస్తుంటే
ఆరోజు దేశ రాజధాని వీధుల్లో ఊరేగుతూ
నిందితులను క్షమిoచరాదని అమాయకంగా
నినాదాలతో ఆకాశాన్ని హోరెత్తించిన
ఆడసిమ్హాల ఆక్రందనలూ, ఆవేశపూరితమైన ఆవేదనా
  అరణ్య రోదనమే  అయిపోయిందన్న బాధ నన్ను ఆసాంతం కలచివేస్తున్నది.

ఆడదంటే ప్రతినాయకి మాత్రమేనని భ్రమపెట్టేలా
పగళ్ళనన్నింటినీ ప్రతీకారాలతో పగలు రగిలిస్తున్న
ధారావాహికలకు ఆదరణ అమోఘంగా పెరుగుతున్నప్పుడే
అర్ధమయింది ఆడువారికి శత్రువులు ఆడవారేనెమోననన్న
అనుమాన బీజం నాలోపడి అది వటవృఖంలా విస్తరించి పోయింది.

ఇంకా   కాల్మనీ కాలనాగు కాటుకుగురయి
కన్నీళ్ళతోదినపత్రికలను తడుపుతున్నా బాధాసర్ప దష్టుల
దీనగాధలకు ,నిర్భయతల్లి గుండేలవిసేలా విలపించడం వెనుక
వెదుక్కోవలసిన నగ్న సత్యాలె న్నింటినో   రాజకీయ సిం హాసనం
రక్షిస్తున్నదేమోనన్న నీ సందేహం సత్యం కాదంటూ ఎలా చెప్పగలను?
తల్లీ నన్నునిన్ను పూచికపుల్లతోసమానంగా భావిస్తూ
అవమానిస్తున్న ఈ సంకాలీన సమాజాన్ని క్షమిచమనీ మనసారా
మన్నించవలసిందేనని నిన్నెలా అభ్యర్ధించను? చెప్పుతల్లీ!!
ఇవన్నీ ఈ దేశంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్న దయనీయమైన సంఘటనలుమరలా నీ బ్రదుకు తరువు నిత్య హరితలా వికసిస్తుందని ఎలా అభూతకల్పనలను సృష్టించి నమ్మించను.?

నీ కన్నీటి మహాసముద్రాలను ఇంకించగల మరో మహాప్రస్థానానికి నాదీవచనం పలికే నలుసైన హృదయాలుకొన్నయినా కొత్త కోణాల్లో ఆవిష్కరింపబడాలి, అప్పటిదాకా
ఉద్విగ్నయై కునారిల్లుతున్న నా మనసు పడే క్షోభే నీకు అండా దండా!!
======================================================

Saturday, December 19, 2015

సాయంకాలం నీరెండలా నీవు
చిక్కబడుతున్న చీకటిలా నేను
ప్రభాత వేళ సౌందర్య లహరిలా నీవు
అసుర సంధ్యాసమయంలో అగణిత
 సత్య బాషలా అలమటిస్తూ నేను.
ఇద్దరం  సమాంతరరేఖల్లా సాగుతున్నామా?
అంటే ఠక్కున ఒక్కసారే ఇద్దరం పదే
పదే చెప్పే  జవాబు కాదు, కాదని!!
మరి ఈ మౌనరాగాలతో పొసగని
 శృతిలయలసమన్వయంతో సాగదీసే  సాధనలెందుకు?
ఎవరిని మెప్పించడానికి? ఎవరిని నొప్పించడానికి?

======================================


Friday, December 18, 2015

కామోదరానాం-----
===================రావెల
==============================


వాడు ఎవడైతేనేం
ఆడువారు తలకట్టుపై
అపురూపంగా ధరించే
అభిమాన ధనంపై
ఆంక్షలు విధించేవాడు
తాకట్టు పెట్టమని
తరిమికొFఉతున్న వాడు
కరెన్సీ నోట్లకింద
మానాన్ని కప్పెట్టమని
కాంక్షించేవాడు
కలికాలపు యముడు
కాలనాగులా బుసకొట్టే
త్రాచుపాము వీడు
కాలాంతకుడు

కాల్మనీ చోదకుడు
రాజకీయం ముసుగులో
రక్షణకోరుతున్నవాడు
కాలాగ్ని దహించవలసిన
నేటి కలికాలంలో
స్వదస్తూరీ లేని ప్రామిసరీ నోట్లపై
పడగలెత్తిన శ్రీమంతుడు
దస్తావేజులపై ఖాళీ సంతకాల చోరుడు
మానాలను కలిసికట్టుగా
దత్తత తీసుకున్న దౌర్భాగ్య
కామోదరుడు--కాలకూట పన్నగం
పన్నాగాల విషకుంభం.
వాడుఎంతటివాడైనాసరే
కఠినంగా శిక్షార్హుడు.
పార్టీలపరువు గాలికెగిరిపోతుందని
సుడిగాలిని ఆపాలని ససేమిరా చూడకండి
అందరినీ శిక్షించి ఆదర్శంగా నిలవండి
పదికాలపాటు ప్రజల మన్నలను చూరగొనండి.
వారల  ఆగ్రహానికి గురై చరిత్రహీనులుగా మిగలకండి.


.
====================================

Thursday, December 17, 2015

నీవు ప్రపంచాన్నుంచి
నిష్క్రమిస్తున్నావా?
లేదా ప్రపంచమే నిన్ను
శాశ్వతంగా వెలివేస్తున్నదా?

అసహాన్ని అందిపుచ్చుకున్న
దుశ్శీలంతోకాకుండా
సౌహార్దం సౌశీల్యం
పరిమళించిన మనస్సుతో
ఆలోచించడంప్రారంభించు.

అస్తవ్యస్తమై
 చిన్నాభిన్నమై పోతున్న
అంతరంగంలోకి తొంగిచూడు
అంతర్యుద్ధాలకు హేతువెవరో
నీకే బోధపడుతుంది.
అంతస్సారమంతా
కట్టెదుటసారాంశమై
సాక్షాత్కరిస్తుంది.
================
మనిషిలో
నిజాయతీనీతులు
మృగ్యమయక మిగిలిందెవరూ?
షీ పులాంటి వాడేగదా వీడు 
పరిమళ భరితంగా
వీచేమలయ మారుతం
నాన్న కళ్ళల్లో
మెరిసి మురిసే
 నా బాల్యం.
--------------
హేమంతం గట్టిగా
 వాటేసుకుంది గదా!!
నవ్వుల జాతర
నయాగరాజలపాతం
ఘనీ భవించింది.
--------------
చలికోట్లన్నింటినీ
పెట్టెలోకి దాచేస్తున్నాడు
వేసవిలో దుస్తుల వ్యాపారి.
--------------------
నులివెచ్చని గాలి
పొరిగింటాయన మాఇంటిచెట్టు
రాల్చిన పండును దాచేసుకుంటూ.
------------------------------
నీకూ నాకూమధ్యన
నడయాడుతున్న నిశ్శబ్దాన్ని
ఛేదిస్తూ  గుడిఘంటానాదం.
------------------

ఆంగ్లం-రమేష్ ఆనంద్.

తస్మాత్ జాగ్రత్త!!
======================
స్వార్ధం విసిరేసిన చిల్లపెంకును నేను
చెరువునీటిపైన గిరికీలు కొడుతుంటాను.
ఆడ పిల్లలు ఆడుతుండే అష్టా చెమ్మలో
గిల్లాలబదులు పావులుగా నడిచే చింతఒఇక్కనునేను
రకరకాల మనుషులముందు స్థాన భ్రంశమౌతుంటాను.
అందుకేనేమో నన్ను ఆడపిల్లననన్నపేరుతొ అపురూపంగా చూస్తున్నారు.

అందాల భరిణనని అందరూ అనగా వింటున్నానుగాని
అది నా యుక్తవయసుకు ఆధుమిక సమాజం ఆసక్తిగా
అందించిన అమూల్యాభరణమన్న మాట నేనెరుగనిదికాదు.

పుట్టినింటనైనా మెట్టినింట్లోనయినా స్వంత వ్యక్తిత్వాన్ని
భద్రంగా కాపాడుకోవాలన్న పట్టుదలకే కట్టుబడువుంటున్నాను.
యేచిన్న పొరపాటుజరిగినా అది అమ్మ పెంపకంప్రభావమని
అమ్మను సూటిపోటీ మాటలతో కంటనీరు కుక్కుకునేలా
మీరంతా అవమానిస్తారన్న భయమేనన్ను భద్రంగామసలుకుంటూ
కుదురులో కాలం గడపాలని కాలం హెచ్చరిస్తూనే వుంటుంది.

వివస్త్రనుగా చేసి వేధింపులకు గురిచేసే కాకుల గుంపు నా చుట్టూ మసులుకుంటూ వుంటాయన్న భయం నాకు జాగ్రత్తలు చెప్పింది.

సినిమాలుచూసి నా భద్రత, బాధ్యతలను గాలికొదలి
విహంగయానం స్వేఛ్చగా చేయాలన్న పుండు నాకింకా మెదడులో
అంకురించిందన్న దాఖలా నాలో అస్సలు మీకు కనిపించదు.

మీరు నన్ను పాతచింతకాయపచ్చడంటూ అవహేళనకు గురి చేస్తున్నా
భరించేసహనం నాలోసుష్టుగా తిష్టవేసికూర్చున్నది.
మీ పొగడ్తలకు లొంగిపోయి సాష్టాంగపడతానని ముచ్చటపడకండి
అవసరాన్ని బట్టి చిచ్చు బుడ్డిలా ఎగిరెగిరిపడి చుట్టూ కాంతులు
విరజిమ్మడానికి సదా సర్వదా సర్వధా సిద్ధమై వుంటాను.

సీమటపాకాయలాతుస్సుమనను పదివేల జడలా మ్రోగుతూ
మీ గుండెల్లో లక్ష్మీ బాంబులా  చెలరేగిపోతాను తస్మాత్ జాగ్రత్త!!
===========================================





Wednesday, December 16, 2015

మరుగేల?  మాధవయ్యకు
గురుతుగ యే గాయమాయె? గోపిక తతికిన్
సురుచిరమౌ కన్నయ్యయె
గురుతరముగ గురిచూసియుండ   గొనకొని  మురిసెన్

ఒక్క గుండె చేస్తున్న సవ్వడులకు
ఇన్నిన్ని  హృదయగత స్పందనలా?
మనసు విప్పిమాటలను చెప్పుకోగానే
ఇందరి మిత్రులు ఇష్టపడే సందర్భాలా?
ఒక్క చూపు మరల్చుకొలేని  సుభాషితపు
చిత్రాన్ని పంచుకోగానే ఇందరి
గుండెలు ద్రవిస్తుంటాయా?
ఇంతగా అభిమానాన్ని పంచుతున్న
స్నేహశీలురకు వదన గ్రంధం తరఫున
యేమిచ్చి నా కృతజ్ఞతలను అందించి
అనుభూతులను అనుభవేక వేద్యంగా
మరల్చుకుని మనసును సంబాళించుకొమ్మని
మధురాతి మధురంగా విన్నవించుకుని తృప్తిచెందను.
ఒక్క చూపు మరల్చుకొలేని  సుభాషితపు
చిత్రాన్ని పంచుకోగానే ఇందరి
గుండెలు ద్రవిస్తుంటాయా?
ఇంతగా అభిమానాన్ని పంచుతున్న
స్నేహశీలురకు వదన గ్రంధం తరఫున
యేమిచ్చి నా కృతజ్ఞతలను అందించి
అనుభూతులను అనుభవేక వేద్యంగా
మరల్చుకుని మనసును సంబాళించుకొమ్మని
మధురాతి మధురంగా విన్నవించుకుని తృప్తిచెందను.

కోతకు గురయి క్షతగాత్ర అయిన సంఘటను
తెలుపగానే ఎందరి ఓదార్పులు మనసుకు
సాంత్వనను కలిగిస్తూ ఊరడిస్తూ క్షేమంగా
ఒడ్డుకు చేరుస్తామని హామీలు నెరవేరేదిశగా
గుప్పిస్తూ గులాబీల్లా గుబాళింపులతో అలరిస్తాయో!!!

భాషా పరిధులకతీతంగా దేశ సరిహద్దులుదాటి
రకరకాల సాహితీ ప్రక్రియల్లొ నేచేసిన ప్రయోగాలను
మన్నించి నన్ను మనసారా అక్కునజేర్చుకుని ఆదరిస్తూ
అభిమాన సంద్రంలొ ముంచేస్తున్న అందరికీ పేరుపేరునా
కృతజ్ఞలనందివ్వడం తప్ప యేమిచ్చి ౠణం తీర్చుకోగలను?







Tuesday, December 15, 2015

వసంతం వచ్చి వెళ్ళిపోతుందని తెలుసు
సరిగ్గా ఎప్పుడు వెడలిపోయిందో
తెలుసుకునేసరికి నా తెలివి తెల్లారిపోయుంటుంది.

ఈ సుమ సుగంధాల పరిమళాలు
ఇంకా  నా నాసికా పుటాలదగ్గర
నాట్య భంగిమలను ప్రదర్శిస్తూనే వున్నాయ్.

మనసుపొరల్లో వికసించిన హరితపత్రాలు
ఇంకా రంగులు మార్చుకునేదిశకు చేరుకున్న దాఖలాలేదు.

ఉదయాన్నే సుప్రభాతపు వేళ శుభోదయంపలికే
పారిజాత సుమాలింకా సుందర వదన సౌందర్యాన్ని
వదులుకున్నట్లు నాకేమీ సమాచారం అందినట్లు లేదు.

రాత్రిపూటలమాత్రమే రాసిక్యమొలకబొసే రేరాణి
పూలింకా మొహంవాల్చిన సందర్భమూ కనబడలేదు.

ఇంకెట్లా వసంతం వెడలినట్లు పసిగట్టగలను మీరే చెప్పండి.

నా హృదయ గత లయలు  ఇంకా వసంతం వాకిట్లోంచి
కదలి  వెడల లేదనే నా ప్రగాఢ విశ్వాసం
===================================

Monday, December 14, 2015

ఇప్పుడంతా అగమ్య గోచరంగా తోస్తున్నది.
సహనానికీ అసహనానికీ మధ్యన గల
సన్నని విభజనరేఖగూడా
 క్రమేపీ చెరిగిపోతున్నది.

మతం మసిపూసుకున్న మనిషొకడు
సిం హాసనాధీష్టుడయితే జరిగే
దుష్కర్మలన్నీ వరుసగా తమ
నిజరూపాలను మెల్లి మెల్లిగా
బయటపడుతూ భయపెడుతున్నది.

మనిషికీ మనిషికీ మధ్యన అంతరం
అగాధమై అంతరాతరాళాలను తొలిచేస్తున్నది.
రాజకీయం రంగులుమార్చుకునే పనిలో
ముప్పూటలా ముమ్మూర్తులా  మునిగితేలుతున్నది.

మరోప్రస్థానంకోసం మానవత్వం దీక్షగా
ఎదురుచూస్తూ ఊపిరిబిగబట్టుకుని చూస్తున్నది.
సాహితీ గవాక్షం చెంతన సమసమాజభావన
సాగిలబడి సానుకూలతాసాక్షాత్కారంకోసం,
సవినయంగా ఆవిష్కరణ ఘడియలకొసం
ఆశగా ఎదురుతెన్నులు గావిస్తున్నది.
==================================



Sunday, December 13, 2015

లుంగలు చుట్టుకుపోతున్న ఆకాశాన్ని
చూపుడువేలు గురిచూసి వేధిస్తున్నది
పాదచారుల పదఘట్టనలక్రింద
నలుగుతూన్న ధరణీ తలం
నల్దిశలా ఆక్రోశిస్తున్నది.

కాలం మాత్రం కట్టెదుటనే నిలిచి
కుతూహలాన్ని ఆవిష్కరిస్తున్నది
అవి అశ్రు ధారలా? ఆనంద భాష్పాలా?
తేల్చుకోలేని ఆక్రోశం
 అనునిత్యం అలమటిస్తున్నది.

నీకూ నాకూ మధ్యన
ఏమీ తోచుబాటుకాక
నిశ్శబ్దం నిద్రలోకి జారుకోని
ఆలోచనారాహిత్యంలో
నిగ్రహాన్ని కొల్పోతూంటే
ఇదంతా అసహన మాహాత్మ్యమని
మాధ్యమాలన్నీ ఊదరగొడుతూన్నవి.

అధికారాన్ని  అజ్ఞానాంధకారపు విపినాటవిలామార్చిన
అధిష్టానం ఆరోపణలనెదుర్కొంటూ   రాజకీయ కాలుష్యానికి
  ఊపిరాడని దిశలో చట్ట సభలను సైతం  నడువనివ్వమని  రాజ్యంగాన్నికూడా
అపహాస్యం పాల్జేసి ఆనందిస్తున్నది.

================================================
తుమ్మల్లోపొద్దుకుంగినట్లు
ఈ జీవితాల్లో  చిక్కగ
 పరుచుకు పోయిన చీకటి
చిత్రాతి చిత్రంగా  నిష్క్రమించే
రోజు ఎప్పటికయినా
రాకపోతుందా అనుకంటూ,
అనునిత్యం ఎదురుచూసే
అద్దృష్ట హీనులకు
అంకితం చేయగల కవితను
రాయగలిగినప్పుడే కవిజన్మ
సార్ధకమౌతుందనుకుంటూ-
సాలోచనగా---

మాటల పల్లకిలొ
నిన్ను ఊరేగించాలని
మనసులో గిరికీలు కొడుతూన్న
మహత్తరమైన సాహితీ సామాగ్రితో
సమాయత్తమైవచ్చాను.
తీరా నువ్వేమో
దూరదూరతీరాలకు
సాగిపొతున్న నావలో
తలొంచుకుని వెలుతున్నావ్!!
మౌనంగా నా రచనల
 కవిలె కట్టను
వీచే హోరుగాలికి
హృదయ విదారకంగా
అంకితంజేసి
ఉద్విగ్నంగ మరలి వస్తున్నాను
మౌనం తలదాచుకున్న
గుండె గొంతుకతో
వృధా ప్రయాసతో
వ్యధార్త మానసంతో
మన్నించు ప్రణయానుస్ఠాన
ప్రధిత  భాగస్వామీ!
ఏకైక దీపాంకురీ!!
బాధాతప్త హృదయేశ్వరీ!!!



Friday, December 11, 2015

మా న్యాయదేవతకు కళ్ళుతెరిపించు
మా ధర్మమూర్తికి కాళ్లను తెప్పించు
మా దేశానికి మాత్రం బుద్ధిని ప్రసాదించు.
నేరం చేసినవాళ్ళనందరినీ
బేషరతుగా విడుదలచేయించు.
తప్పుజరిగిందని విశ్వసించిన వారినందరినీ
కారాగారాలలో తగు శిక్షలతో బంధించు.
హే భగవాన్!!! నా ఈ చిన్నికోరికను మన్నించు.
---------------------------------------------------------
జగదేక ప్రవీణ
-------------------
రావెల పురుషోత్తమరావు 
                               ఎంత గొప్పది గుండె
అనునిత్యం స్పందిస్తూనే ఉంటుంది
ఎంత పెద్దదో గుండె
విశాల భావ తరంగిణిలా
జీవనదియై నినదిస్తూ ప్రవహిస్తూనే ఉంటుంది.
ఎన్ని బాధల అగాధాలనైనా ఇట్టే దిగమింగి
నవ్వును పులుముకుని నర్తిస్తూ వుంటుంది.
ఎంతటి సంతోషాన్నయిన్నా,చెలియలికట్టనతిక్రమించకుండా
కుదించుకుని మరీ స్వీకరిస్తూంటుంది.
ఎక్కడ వ్యాఘాతం జరిగిందని విన్నా ఇక్క డి క్కడి డే కుమలడం ఆరంభిస్తుంది.
దూరాల్లోని అవరోధాలనధిగమించి
దూసుకు పోవడంలో ముందుంటుoది..
ప్రమాదాలు పరిహసించినప్పుడూ
ప్రమోదాలు తలకెక్కినప్పుడూ కార్య కారణాలతో సంబంధం లేకుండా
కం టిలో తడిని చేరుస్తూ ఉంటుంది.
అన్ని అవయాలతో తన కు
అవినాభవ సంబంధం ఏర్పరుచుకుని
కళ్ళువీ క్షిం చినా వీనులువింటూ
ఉలిక్కిపడినా
ఈ హృదయమే ఉద్వి గ్న యై ద్రవిస్తుంది,
వసంత యామినికి ఆహ్వానం పలకడంలోనూ
శిశిరానికి జే జేలు చెప్పడం
హేమంతానికి శ్రీకారం చుట్టడం లోనూ
వర్షర్తువు వొడి లోకి హర్ష పులకాకితమై చేరడంలోనూ
గ్రీష్మాన్ని గిరి గీసి నిలువరించడంలోనూ
శరదృతువు తో సమాగ మవడం లోనూ
ప్రధమా ర్ధ భాగంలో అధివసించి
చిరునవ్వులు చిందిస్తూ జగదేక ప్రవీణగా భాసిస్తుంది
==========================
ఒంటరి తనాన్ని ఓడించి తీరాలని
కంకణం కట్టుకున్నాను.
పగలంతా సెగల పొగలతో
ఊపిరిబిగబట్టుకుని గడిపాను.

రాత్రయేసరికి ఊగిసలాడే మనసుకు
ఊరటకలిగించాలని తలచాను.

సంసారసాగరంలో సమృద్ధిగా పొందిన
అనుభూతులను కళ్ళలోకి రంగరించుకుని
ప్రాచీన సాహిత్యపు పరిచయాలతో
మమేకం ఐపోయి ఆనంద వార్ధిలో తేలియాడాను.


పోతనామాత్యుని భక్తిరసామృత ధారలను
మనసుకెక్కించుకుని మైమరచిపోయాను.

కరుణశ్రీ అంతరంగాన్ని ఆ విష్కరించుకుంటూ
అమందానంద కందళిత హృదయారవిందుడనై మురిసిపోయాను.

అన్నమయ్య కీర్తనలను వింటూ ఆధ్యాత్మిక సౌందర్యపు
అంచులను తాకి ఆశావహుడిగామిగిలాను.

మనసున మనసై మమతానురాగాల మహా సంద్రంలో
ముంచి మునకలేయించిన భాగస్వామికి చిరుకానుకగా
ప్రవాస జీవనంలోనయినా పరమోత్కృష్టంగా
రాణించడం మేలని నిర్ణయానికొచ్చి
పాతకాలంలో చదివిన శతకాలలో నన్నాకర్షించిన
పద్యాలను వల్లె వేస్తూ పరమానందంగా కాలం వెళ్ళదీస్తున్నాను.

ఓటమినెరుగనని విర్రవీగుతున్న ఒంటరితనానికి
గోడ గడియారపు ట్రింగు ట్రింగు ప్రకంపనలతోనూ
సందేశాలనన్నింటినీ సెకన్లలో అందించాలని
తహతహ పడుతున్న కరతలామలకమైన సెల్ఫోనులను
వివిధ లాంఛ నాలతో అందించి సత్కరించాలని చూస్తున్నాను.
========================================

Thursday, December 10, 2015

మూగవోయిన మురళిని
మ్రోయింపవా కృష్ణా!!
చేదుబ్రదుకున తీపి
గురుతులను చేర్చగా

మనసుమాటవినదాయెను
గుండెగోసమరుగాయెను
నీ వేణుగాన మేమాయెను
గొపికమ్మ గొడవాయెను 
నిన్నటికీ నేటికీ మధ్యన
ఎంత వ్యత్యాసం
వ్యవధానం తక్కువేకావచ్చు
కాని జరిగిందంతా
కాలయాపనకాని అవధానం.

మనిషికీ మనసుకూ నడిమయాన
వంతెనలా కలుపుతూ సాగి  పోతున్న ప్రయాణం.
కష్టశుఖాలమధ్యన కన్నీటిజాలేగదా
మానవమాత్రుడి జీవన యానం.
ఒంటరితనం ఒక్కసారిగా
ఆలింగనంచేసుకుంటే
ఒదిగి ఒదిగి పోవాలనిచెప్పేదేగదా
వేద విహితమై విలసిల్లే శాస్త్రసమ్మతమౌ సత్యం.

-------------------------------
ఊగే వంతెనపై
నీళ్ళకడవతో మగువ
పిరుదలపై నీటిజాలు
-----------------------
రత్నాల అంగడిలో
ఆమె నాభిమీదనే
దృష్టిని నిలిపిన
యువ కిశోరం
---------------------
నెలాఖరు రోజులు
వచ్చినంతా బేరమాడకుండా
దారికాచి  దండుకుంటున్న
రక్షక భటుడు
-----------------
ప్రతివాన చినుకులొ
పూర్ణచంద్రుని
సంపూర్ణ సాక్షాత్కారం
---------------------
వీచేగాలిద్వారా
వినిపిస్తున్న
విహంగ గానం
ఎంత శ్రద్ధగానో
శ్రవణయంత్రాలసాయంతో
ఆలకిస్తూ చిన్ని శిశువు
--------------------

నోరుతెరవగానే
నా ఫీజు చెల్లింపులపై
ఆరాతీస్తూ
దంత వైద్యుడు.
===============

ఇంటిదగ్గరనుండే
ఇవ్వాళ కార్యాలయం పని
నేనూ ఇంటిదగ్గరనుండే
చదువుతానని
మొండికేస్తున్న
సుపుత్రుడు
--------------
ఆంగ్లమూలం రమేష్ ఆనంద్.




Monday, December 7, 2015

నిన్ననే నేడుగా తలచుకుని
శక్తిమంతంగా మలుచుకోగలిగితే
రేపటిని గురించిన భయమసలే స్పృశించదని.

భయమనేదే కలిగే అవకాశం శూన్యమని.

నేటినే నిన్నగా తలచుకుని
విలపించే వారికేగదా
'బావి ప్రతినిత్యం
భావిలోకప్పలా సాక్షాత్కరించి
భయపెడుతూ వుంటుందని.



అప్పుడప్పుడూ అనుకుంటూనే వుంటాను
ఎప్పటికయినా సమీప భవిష్యత్తులో
నిన్నుకలుసుకోవడం సాధ్యమైన పనేనా అని.
ఇప్పుడర్ధమయింది,నిగినైనా నేలపైనా, అది కుదరదని.
ఈ బొందిలో ప్రాణముండగా ఆపని అక్షరాలా నెరవేరదని.
ఇంక తర్వాత జరగబోయేది నాచేతుల్లోలేని విధిలిఖితమని.
========================================

Sunday, December 6, 2015

పడిలేచే కడలి  కెరటాల ధాటికి
ఉలిక్కి పడి ఊపిరిబిగబడుతున్న
విహంగాలను చూస్తుంటే
అబ్బ !! నిజంగా ఎంతజాలేస్తుందో
మళ్ళీ చెన్నై దిశగా వెళ్ళొద్దని నీకు మరీ మరీ
చెబుతామని గొత్తెత్తిపిలిచాను అంతే , అదంతే!!
===============================
ఉగ్రవాదం ఎక్కడ ద్వంసరచనచేసినా
నీప్రకటనే వినిపిస్తూ వుంటుంది
అసహనం పెరుగుతుంది నీలోనా నాలోనా?
ఈ ప్రశ్నకు సరయినజావాబుకోసం
దశాబ్దాలుగుగా నిరంతరం స్వేదం వెలారుస్తూ
వెదుకుతూనే వున్నాను, అన్వేషణకు అంతమెప్పుడో
అగమ్యగోచరమని వివరంగా అర్ధమవుతున్నది.
=====================================

Saturday, December 5, 2015

కాకి కోకిలయన్న కనిపించదా?తీరు
పాటపాడువేళ బయటపడును
కేకి నాట్యమాడకెవ్వుకేకేగదా!!
కాకి కాకి కాక కేకియగునె?
ఏమిటో అంతటా శూన్యమే
ఆవరించివుందనిపిస్తుంది.
నీవులేకుండా గడుపుతున్న
బ్రదుకే భారంగా తోస్తున్నది.

విసుగూ, విరామాలు హాయిగా
విశ్రాంతి తీసుకుంటున్నాయి.
గుసగుసలూ ముసిముసినవ్వులు
మనకు దూరంగా జరిగి
మూగగా రోదిస్తున్నాయి.

తారల్లేని ఆకాశంలా
తనువంతా తడబడురున్నట్లుంది.
భానుడూ చంద్రుడూ యేమయినారని
బాధపడుతూ మనసు ప్రశ్నలవర్షం
ధారగా కురిపిస్తున్నది.

నొప్పిని తట్టుకోలేక నిశ్శబ్దంగా
నాలోనేనే మధనపడుతున్నప్పుడు
గుబులును పోగొట్టే నీ సుందరవదనం
గూడువిడిచి వెళ్ళిన పక్షిలా
 గుబులుపడుతున్నది.
ఎక్కడికెళ్ళావో కనుక్కోమని గుండె
ప్రశ్నలతో ఊపిరాడకుండా చేస్తున్నది.

నాట్య భంగిమలను మరవినెమలి
నా మానసిక స్థితికి దు: ఖపడుతున్నది.

ఆ సందర్భం గుర్తుకొచ్చినప్పుడల్లా
రక్తం ఘనీభవించి భయపెడుతున్నది.
మనసు రూపు మార్చుకుని ఒక శిలాజంలా
స్థాణువై నిలబడిపోతున్నది.

అశృ ధారలతో అలమటిస్తున్న జీవితం
వరదల్లో కొట్టుకుపోతున్న పొరుగురాష్ట్రపు
శోభలా స్రుక్కి సోలి క్షీణిస్తున్నది.
ఈ వేదనలతో వేడేక్కిన హృదయం
వెక్కి వెక్కి ఏడిచేందుకు సిద్ధమౌతున్నది.
=============================
శిశిరతోరణం===రావెల.
=================

శిశిరం రాల్చిన
పండుటాకులను
ఎండుటాకులనూ
ఏరుకుని బుట్టకెత్తుకుంటూ నేను
బరువులేని ఆకుల వైపు
భారంగా దృష్టిని సారిస్తూంటా ను.
గతకాలలో గడిపిన మధురమైన
క్షణాలు సైతం బరువును దించుకున్న
స్మృతులేనన్న జ్ఞాపకాలను మెల్లి మెల్లిగా
నెమరువేసుకుంటూముదిమితనాన్ని ముచ్చటపడడంలోని
హాయినినెమరువేసుకుంటూ గతుకుల బాటలోనయినా
గాంభీర్యంతో అడుగులను ముందుకు వేసుకుంటూ.
గమ్యం చేరుకోవాలన్న గాఢమైన సంకల్ప బద్ధుడనై
జీవనయానాన్ని క్రమబద్ధీకరించుకుంటూ
శిశిరతోరణాన్నికూడా అలంకారమేనని విశ్వసిస్తున్నాను.
ఆనందంగానూ యధాతధంగా స్వీకరిస్తున్నాను.
======================================

Friday, December 4, 2015

ఇవ్వాళ కలలనన్నింటినీ
భద్రంగా జేబులో తురుముకుని
పాటలపల్లవులనన్నింటినీ
పెదాలపై పదిలంగా పరుచుకుని
నిన్ను తక్షణం కలుసుకునేందుకు
సిద్ధమయి బయలుదేరుతున్నాను.


అర్ధరాత్రయిందని దూరంగావెల్తున్న
రైలుకూత గుర్తుచేస్తున్నది.
ఒంటరిగా ఇలా ఒక్కడినే నీకోసం
వేచిచూడకతపాదని తెలుసుకున్నాను.


నిన్నుకలుసుకోకుండా ఉట్టి మనసుతో
ఇంటికి తిరిగిరవద్దంటున హెచ్చరికలను
ఒక్కొక్కతినె నెమరు వేసుకుంటున్నాను.


నీకుతెలుసు నిన్నుకలుసుకుంటున్నానన్న
ఆనందం నన్ను అవధుల్లేని
తీరాలకు తీసుకెల్తుందని.
ఆకాశంలోమెరిసే తారలన్నికూడా
చందమామతో ఎకసక్కేలాడుతుంటే చూసి
ఓర్వలేక్పోతున్న తనువు మాత్రం
 తహతహ లాడుతున్నది.

ఏదో తెలిసీ తెలియని పులకింత
మనసునంతటినీ ఊయలలాడిస్తున్న వైనం.
ఎక్కడో దూరంగ పచ్చిక బయలుపై హొయలొలకబోస్తూ
వివిధ భంగిమల్లో విన్యాసాలు చేస్తున్న
సీతాకోక చిలుకలు చేసే నాట్యం
ఎవరి మనసులను రంజింపజేయదు చెప్పండి.

నీదగ్గరకు గబ గబా రమ్మంటున్నట్లనిపిస్తున్నది.
ఆఊహే నాపెదాలపైన తడినంతటినీ లాగేసుకుంటున్నది.
నీ సాన్నిహిత్యపు గుబాళింపులను నేనే స్వంతం చేసుకోవాలన్న
స్వార్ధం నన్ను అచేతనం చేసి ఆడిస్తున్నది ఇటు చూడు.
చీకటంటూ పడకముందే చిత్తజుడిలా చిరాకుపెడుతుంటే ఎలా/ నువ్వేచెప్పు!!

నాకలలను దాచుకున్న జేబులనన్నింటినీ
ఒకసారి  తడిమి మరీ చూసుకున్నాను.
పాటలు పరుచుకుపోయినపెదవులను భద్రంగా
నీ చెంతకు చేర్చడానికి ఉవ్విళ్ళూరుతున్నాను.
==================================




Thursday, December 3, 2015

నై నై ఇది చెన్నై---
------------------------

నువ్వు సుమానివా?
మరి నీ పరీమళమంతాఏమయినట్టు?
నువ్వు సాగరానివా?
మరినగరవీధుల్లో ఎందుకు ఊరేగుతున్నట్టు?
నువ్వు నిజంగా నింగివేనా?
నేలపైకిదిగొచ్చి  ఇంత ప్రళయమెందుకు సృజించినట్టు?
నీవు మేముపూజించే పరమాత్ముడివా?
ఇంత ఘోరంగా జలనిధులతో మమ్మల్ని ఎందుకిలా అభిషేకించినట్లు?
ప్రసన్నవదనుడవని ధ్యానిస్తే ఇలానీ అనుగ్రహ భాషణమా?
ఆగ్రహోదగ్రమైన కసాయి కన్నయిన ఓ కన్నా!!! ఇది చెన్నై--
============================================

Wednesday, December 2, 2015

ఎగసిపడుతూ అచ్చిన ఆకాశం
ఇలా విరుచుకుపడిపోయిందేం?
నగరమంతా జలధారలతో
ఇలా నడిసంద్రమై ప్రవహిస్తున్నదేం?
బయటకెళ్ళిన వాళ్ళంతా బ్రదుకుజీవుడా అంటూ
పరమాత్ముడిని పదే పదే తలుచుకునే దురవస్థ
ఇలా సంప్రాప్తించడమెందుకని?
ఇల్లూ ఒడలూ తడవని నగర వాసులుంటే వచ్చి
నన్ను మనసారా ప్రార్ధించమని
నువ్వలా భీష్మించుకుంటే ఎలా?
కులాలుమతాలకతీతంగా అందరం ఒక్కటిగా
ఘూర్ణిల్లుతున్నాంకనబడడంలేదా! ప్రభూ!!
అతివృష్టినికాదుసుమా!! నీ దయాదృష్టిని
మాపై నిరంతరం ప్రసరించే సమయం ఆసన్నమైంది
ఆపన్నులను అనాధలుగా మార్చకుండా
నీ వు అక్కునజేర్చుకునే సమయం ఆసన్నమైంది.
అన్నలూ తమ్ముళ్ళూ అందరం అస్రుధారలను
వర్షించడం మానేద్దాం!! ఆజలకణాలూ
ఈ వరద వుధృతినిపెంచుతాయేమొనని నా భయం.
అందుకే ఏడవకండేడవకండి,మీగుండెల్లొ గూడుకట్తుకున్న
భయాందోళలను పారద్రొలేప్రక్రియలో పూర్తి సమయాన్ని
వెచ్చించండి...మీకన్నా అధోజగత్తులో వుంటూ
చేసేదేమీలేక గుండెను చిక్కబట్టుకుని ఈ దుర్భర పరిస్థితులు
చక్కబడాలని విశ్వంతోగొంతుకలిపిమరో మంచి మహా ప్రథానంకోసం, తెరిపినిచ్చే ఆకాశంలోని తెలిమబ్బులుకమ్ముకుని
విచ్చుకున్న పూలలా మనుషులంతా ఈ భువన భవనాన్ని
మెచ్చుకునేలా ,నొచ్చుకోవడం మానేలా ఉండాలని
ఆ విశాలహృదయుడైన మానవాతీత శక్తిని అందరూ
ఏకకంఠంతో ప్రార్ధిస్తూ మూర్ఛనలు పోదాం అందరం చేయీ చేయీ
కలిపి ఈ విపత్తును ధైర్యంగా గుండెనిబ్బరంతో ఎదుర్కొందాం!!
గుడిగోపురపుటెత్తునుంచి
వినబడుతున్న భక్తిగీతాలు
అంతరాంతరాల్లోని కలుషితమైన
శబ్దతరంగాలను అచేతనంగావిస్తూ.

------------------------
కలుషి తమైన మెదళ్ళ కుదుళ్ళలో
నిరంతరం ప్రవహించే వ్యర్ధజలాలనేనా
అసహనమని అంటూ   అంతా నేడు కళవళ పడుతున్నారు?

-----------------------------
ధరణీమతల్లి హృదయకుహరాల్లో
పడుతున్న గాయలవేనా
ఉగ్రవాద ధోరణులననుసరించే
ఉన్మత్త పిశాచాల కార్యకలాపాల
క్షతగాత్రాలై క్షోభిస్తున్నవి?

===================================
రాత్రిని నిద్రబుచ్చుదామని
ఎన్నెన్నో కలలుగన్నాను
అదేమో నన్ను నిద్రబుచ్చి
చల్లగా జారుకుంది.

పగలంతా కలలు కనకూడదని
దీక్షగా మేలుకున్నాను.
రాత్రంతా నిద్రలేమిగదా
ఒళ్ళుతెలియకుండా పడి  నిద్రపోయాను.

కలకూ వాస్తవానికీ ఇంత అంతరముందా
అని ఆశ్చర్యపోతూ మరుక్షణం నేలకొరిగాను.
==============================

Tuesday, December 1, 2015

దినం తెలవారుతూండగా
దినకరుని మయూఖాలు
అడ్దుపడుతూన్నా  పొగ మంచు దుప్పటిలోంచి
తొంగిచూస్తున్న పల్లె తల్లి.
ఎదురుగా నిలువెత్తున నిలబడిన
తాళ వృంతాలను గుర్తుగా మనసులో ముద్రించుకుంటూ
చిరువాహనాన్ని ఆరోగ్యప్రదాయినిగా
భావించి అడుగులను ముందుకు పడేలా
 నడిపిస్తూన్న తీరు అసమానం, అద్వితీయం.
ప్రభాతాన పల్లెతల్లికి అరుణారుణ తిలకాన్ని
దిద్దాలన్న తలంపుతో సిద్ధమవుతున్న సూర్య భగవానుడు.

దూరంగా గుడి గోపురంలోంచి శ్రవణపేయంగా వినబడుతున్న
సుప్రభాత శ్లోక పరంపరలు. ఇంకా భక్తి ప్రపత్తులకు మేమే
సోదాహరణమనుకుంటూ మురిసి ముక్కలయిపోతున్న ప్రభాతసుందరి.

====================================
మృత్యువుతోనాకు సుదీర్ఘమైన
 పరిచయముందన్న మాట మాత్రం వాస్తవం.
మొదటిసారిపరిచమయ మయినప్పుడే
మొండితనాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళింది.
ఆతర్వాత అదే సన్నిహితంగా దరిజేరి
అసహనానికిక తిలోదకాలివ్వడం మేలని
ఒక ఉచిత సలహా పారేసి వెళ్ళింది.
అరవయ్యేళ్లక్రిందట ప్రసవసమయంలో
వైద్యసౌకర్యంలేని మారుమూల పల్లెలో
నెత్తినెట్టుకుని ఊరేగుతూ ఊరంతా ఆవిడ
మహా ఇల్లాలని బ్రతిమాలిన, బామాలిన
పెడచెవినబెట్టి కన్నతల్లిని
దూర దూర తీరాలకు
 ఘోరంగా వెంటబెట్టుని వెళ్ళి
మరీ పలాయనం చిత్తగించింది.
నాలుగు పదులుమాత్రమేనిండిన
అమ్మను  వెంటబెట్టుకెళ్ళి మమ్మల్ను
 అనాధలనుజేసి వదిలేసింది.

పెళ్లయిన కొత్తల్లో ఇంటి గ్గర
విశ్వాసంగా తోకూపుకుంటూ ఇంటిలో
ఒక్కదానిగా మెలగుతూ ఉండిపోయిన రాజును
నిర్దాక్షిణ్యంగా వెంటేసుకుని వెళ్ళిపోయింది.
అల్లారుముద్దుగా పెరుగుతూ
పరమాత్ముడు మాకందించిన
ప్రేమఫలాన్ని ఆరున్నరేళ్లకే
వైద్యుల నిర్లక్ష్యాన్ని వంకగా బెట్టుకుని
ఏకసంథాగ్రాహియని అందరూ భావిస్తున్న
మాధవిని చంకనె ట్టుకుని   చ ల్లగా  జారుకుంది.


ఆరేళ్లక్రిందట శ్రీరామ న్వమిహడావుడిలో
వుండి ఇంటి ఇల్లాలికివంటింట్లో సాయపడుతున్న
నాను క్షణాల్లో ఇంటిగుమ్మం దాకా వచ్చి
వెంటబె ట్టుకుని   వెళ్ళి గంటలు గడవకుండానే
తిరిగి ఆసుపత్రి   ద్వారా ఇంటికొచ్చి దిగబెట్టి
లెంపలేసుకుంటూ నిష్క్రమించింది.

మూడేళ్ళ క్రిందట ముసిముసినవ్వులునవ్వుతూ
మాటాడుతున్న మాఇంటి మహలక్ష్మిని
గుట్తుచప్పుడుకాకుండా గుండెనొప్పని చెప్పి  మాయ తివాసీపై
కెక్కించి మాయచేసి మరీ మమ్మల్ను మోసంచేసి
దు : ఖ సముద్రంలో ముంచేసి నిర్దాక్షిణ్యంగా వెడలిపోయింది.


ఈ పంచతంత్రపు కధలమధ్య చందమామ
పుస్తకంలోచదివిన భేతాళుడిరూపంలో
ఎప్పుడయినా దిగబడి ఇంటితలుపుతడుతుందో తెలియని
విచికిత్సలో మామధ్య నెలకొ న్నది మిత్రలాభమా ,మిత్ర భేదమా, సంధియా,  విగ్రహమా
తెలుసుకోలేని  తేల్చుకోలేని  సందిగ్ధంలో మృత్యువుతో సహవాసం
ఎంత విషాదాన్ని పంచుతున్నదో అవగ తమయిపోయింది.
---------------------------------------------------