గండు కోయిలల గుంపు నవ గీతార్ణవంతో
గుండె గొంతుకలో గుస గుస లాడుతూన్న వేళ.
హేమంతం విసురుగా వీ చే చలిగాలుల చిత్తడికి
మనసు తడియారిన పెదవులతో
పాహి పాహి యంటున్న దేలనో ప్రభూ?
శిశిర ఝంఝలో చిందర వందరగా ఆకులు
క్రిందకు రాలుతున్నంత వేగంగా
ఆశలు నేలకు రాలి నిశ్శబ్దాన్ని నిలువునా
దహింపజేయవెందుకని?
శారదరాత్రులసన్నిధానంకోసమేనా
ఈ చిత్త చాంచల్యం చైతన్యాన్ని నిర్వీర్యం
చేసే దిశలో కృతకృత్యంకావాలనేందుకేనా
ఇలా తహ తహ లాడడం?
అంతటా వాతావరణం ఎందుకో మరి
పరి పరి విధముల వింతగాతోచనోపు?
నాకు ఈ ప్రకృతినర్తనమంతా
అస్తవ్యస్తంగా తోస్తున్నది
అందువలననే ప్రభూ నీ మ్రోల ఈ విన్నపాల సుమ మాల!
గుండె గొంతుకలో గుస గుస లాడుతూన్న వేళ.
హేమంతం విసురుగా వీ చే చలిగాలుల చిత్తడికి
మనసు తడియారిన పెదవులతో
పాహి పాహి యంటున్న దేలనో ప్రభూ?
శిశిర ఝంఝలో చిందర వందరగా ఆకులు
క్రిందకు రాలుతున్నంత వేగంగా
ఆశలు నేలకు రాలి నిశ్శబ్దాన్ని నిలువునా
దహింపజేయవెందుకని?
శారదరాత్రులసన్నిధానంకోసమేనా
ఈ చిత్త చాంచల్యం చైతన్యాన్ని నిర్వీర్యం
చేసే దిశలో కృతకృత్యంకావాలనేందుకేనా
ఇలా తహ తహ లాడడం?
అంతటా వాతావరణం ఎందుకో మరి
పరి పరి విధముల వింతగాతోచనోపు?
నాకు ఈ ప్రకృతినర్తనమంతా
అస్తవ్యస్తంగా తోస్తున్నది
అందువలననే ప్రభూ నీ మ్రోల ఈ విన్నపాల సుమ మాల!
No comments:
Post a Comment