ఎగసాయం-----------రావెల పురుషోత్తమరావు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఊరు ఊరంతా బందెల దొడ్డిగా మారింది
మృత్యు గహ్వరానికీ దీనికే భలేగా సామ్యం కుదిరింది.
తెల్లబంగారమని పండిస్తేతెల్లటి వస్త్రమై మనిషిని కప్పేసింది.
మిర్చి బాగుందనుకుంటేఆ దిగుబడి తగ్గిపోయిఘాటుగా గుండెకు తగిలింది.
వరిపంట గదాని నారునాటి నీరుపోస్తే
పొ ట్ట కొచ్చిన కంకులను మిడతలుమేతగా నమిలేసాయి.
చెరకు తీపిని తలచుకుని ఎకరాలకు ఎకరాలను సాగుచేస్తే
అదికాస్తా చేదువిషమై కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
భీమా వస్తుందని కిస్తీలునెలనెలా కడితే
సొమ్ములుకాస్తా స్వాహా చేయబడింది.
అ మ్మాయి పెళ్ళి, అబ్బాయి చదువు ఇప్పుడిలా ప్రశ్నార్ధకమై మిగి లాయి .
ఆశించిన పురుగును చంపలేని క్రిమి సం హారక మందు
మనుషులను చంపడంలో మొదటిస్థానానికెదిగింది.
పొలం గట్లమీద పిట్టల్లా రాలిపడుతున్న కృషీవలుర
శవాగారం రాజకీయానికి రాబందులా సహకరించింది.
చేతగాని నేతల వాగ్దానాలకొలిమిలో
రైతాంగం బ్రదుకు మాడి మసై
బూడిదగా చివరకు మిగిలింది.
వ్యవసాయం ఆధునికంగా వ్యధార్త జీవితపు
యదార్ధ దృశ్యమై హృదయమంతటినీ కలచివేసింది.
===================================

No comments:
Post a Comment