దీపావళిని మనసులోతలుచుకోగానే
తళుక్కున స్మృతిపధంలో మెరిసేవి
నా బాల్య స్మృతులు.
ఒ నెలరోజులు ముందునుంచే
రోలూ రోకలితో తయారయేవాళ్ళం.
అందులో మందుకూరి రోకలితో మూసి
బండకేసి రోకలివైపు బాదితే
పేలుడు శబ్దం వీధంతటికీ వినిపించేది.
ఆతర్వాత సొంతంగా కాగితంగొట్టాలను చేసి
బొగ్గులు బాగాపిందిచేసిన మసి నoదులోకూరి
సూరేకారం[!] తో కలిపి మసిపూవొత్తులు
చేసి ఎప్పుడు రాత్రవుతుందా అని ఎదురుచూసి
కొన్ని కొన్నిగా బయటకు తీసి కాలుస్తుండే వాళ్ళం.
ఆతరువాత దం టుపుల్లలతో కాగడాలను తయారుచేసి
వాటిని వెలిగించి పరుగెడుతూ ఉంటే మంటలొస్తూ వుండేవి.
ఆతర్వాత చిన్నగా చిచ్చుబుడ్లను[ఖాళీవి కొని] అందులో మందును[సూరేకారం గంధకం కాలిపి కూరి పైన చిన్న తళుకుముక్క అంటించి జాగ్రత్తగా ఎండబెట్తి కాలుస్తూండే వాళ్ళం.
ఆతర్వాత దృష్టి పల్లెలనుంచి పట్నానికి ఎగబాకాక
పట్నం నుంచి నాన్న తెచ్చిన దీపావళి మందులు కాల్చేవాళ్ళం
ఆతర్వాత ఏకంగా బస్తీకే పెద్దచదువులకెళ్ళినా
ఇంటికెళ్ళే దీపావళి పండగ జరుపుకునే వాళ్ళం.
ఉద్యోగమొచ్చాక తీరుమారింది. అ న్నీ కొన్న సరుకులేగాని
తయారుచేయడం అన్న మాటే మరుగున పడిపోయింది.
ఇప్పుడువిదేశాంలోకడుగుపెట్టాక నియమనిబంధను అధికంగాన
యే గుడికొ వెళ్ళి అక్కడ జరిగే సంబరాలను చూస్తూ సంతసించడం
అలవాటయిపోయింది.అందుకేగదా నన్నయ్యగారు గతకాలము మేలని వక్కాణించడం.

No comments:
Post a Comment