హృదయగతమైన రహస్యాన్ని దేనినీ ప్రియా,
నీ గుండె గుప్పిట్లో దాచుకోవాలని యత్నించకు!!
నాతో ఒక్కనాతోనే ఆ గుట్టును విడమరిచి పంచుకో
ఎంతో మృదువుగా దరహాసచంద్రికలను వెలువరించగల నీవు
ఆ మెత్తదనాన్ని హాయిగాసమకూర్చుకుని
నాదగ్గర గుస గుసలాగా ఆగుట్టును విప్పు!
నా హృదయమే దాన్ని వింటూంది
నాచెవులుమాత్రం కాదుసుమా!!
రాత్రి పూర్తిగా గాఢమై విస్తరించిపోయింది.
గృహమంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది.
పక్షుల గూళ్ళన్నీ నిద్రావస్థలో మునిగిపోయి ఉన్నాయి.
డోలాయమానంగా ఊగిసలాడుతూ వున్న అశ్రుబిందువులతో
తడబడుతూన్న నీ నవ్వులతో మధురాతి మధురమైన బిడియంతో
బాధామయమైన హృదయవేదనతో నీలో దాచుకున్న రహస్యాన్ని
గుట్టుగా నా ఒక్కరితో విపులంగా పంచుకో ప్రియతమా!!
[టాగూరు తోఅమాలిలోని 29 కవితకు నా తెలుగుసేత]

No comments:
Post a Comment