Wednesday, October 28, 2015

కొద్ది కొద్దిగా చలి
నింగినుంచి నేరుగా
నెత్తిమీదకు జారిపడే
చిన్నపాటి చిరుజల్లులు
చీకటిపడే లోపుగానే
ఈ పూలను కోసి
బుట్టలోకెత్తుకుని
గబగబా ఇంటికి పరుగెత్తాలి.
 ఇవి  శరద్రాత్రులుకద!
ఇంతపాటి ఉత్సాహం గుండెనిండుగా
పొదవి పట్టుకుంటూంటే యేదో తెలియని
గాఢానుభూతి కౌగలించుకున్నట్లు.

చందమామా నాకోసమే వెన్నెల వెలుగును
విస్తారంగా పిండారబోసినట్లుగా
పదిల 'పరచి ' నట్లుగా ఒక పులకరింత
యేమేమో తెలుపనలవిగాని  జలదరింపు.


ఎందుకని నాబుగ్గలింతగా ఎరుపెక్కిపోయాయి
నా ప్రభువు నన్ను స్పృశించిన దాఖాలాకూడా
కనరావడంలేదుకదా! ఎందుకింతగా మనసు
కవ్వింతలకు లోనయి కళవళ పడుతూ
నన్నిలా కలవరింతల పాల్జేసి
కిమ్మిన్నాస్తిగా కూర్చుండిపోతున్నది?
=================================

No comments:

Post a Comment