Saturday, October 31, 2015

ఎప్పుడూ ఏదో ఒక సమయంలొనో
నిజాయితీగా ఓ సందర్భంలోనో
ఒక్కుదుటున కళ్ళముందు ఛాయా
మాత్రంగా కనబడి  నోరుతెరిచి
ఒక్క పలుకైనా నానుండి వెలువడే లోపు
అదృశ్యమైపోయి అలమటింపజేస్తుంటావ్!!
చల్లగా చలిగాలి వీచినప్పుడల్లా
చెంపలను మృదువుగా తాకి మెల్లగా
నిష్క్రమించి నేను నీరసపడి
 ఆక్రోశపడేలా అనునయంతో అభినయిస్తావు
హేమంత శార్వరివానీవు?


ఆశలన్నీ ఒక్కొక్కొకటిగా రంగును మార్చుకుని
నేలతల్లికి పాదాభివందనం చేయాలని
తహ తహ పడుతున్న సమయంలో
సర్వస్యశరణాగతుడిగా నేను పరిణమించి
దిగాలుగా దిసమొలతోనిలుచున్న తరువులా
ఎండగాని నీడగాని అలా నిలబడిపోయి నేనుంటే
ఒక్క చిరునవ్వును తటిల్లతలా మెరిపించి మురిపించి
 జరూరుగా జాగుసేయకుండా జారుకుంటుంటావు
కొంపదీసి నువ్వు శిశిరానికి
 తోబుట్టువు కాదుగదా ప్రణయినీ !

తొలగిన యవనికవా?
తొణికిన స్వప్నానివా నీవు ?
వాస్తవంగా నువ్వే తగు జవాబివ్వగలవు
ప్రవాసంలో వున్న ప్రణయహితుడను.
ప్రేమకవితలల్లడంలో మాత్రమే   ప్రధితుడను.
==========================

No comments:

Post a Comment