కట్టుబడిన కారుణ్యం
------------------రావెల
^^^^^^^^^^^^^^^^^^^
బానిసలకు భయంకరమైన విసుగొచ్చింది.నిరంతరం వెన్నంటి వేధిస్తున్న
శృంఖలాలపట్లఏహ్యభావమూ తలెత్తింది.
వారినలా బంధించిన క్రూరునిపట్ల
అసహ్యాన్నీ అసహనాన్నీ ప్రకటిస్తూ తలలెత్తి
అతన్ని అతి హీనంగా చూడడం మొదలెట్టారు.
ఇదంతా శ్రద్ధగా గమనించిన యజమాని
వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చిఏకబిగిన సు దీర్ఘంగా
ప్రసంగించడం ప్రారంభించాడు.
ఆకాశంలోఓ అద్భుతమై ప్రకాశించే వ్యక్తి
పరమాత్ముడనిమీరెరిగినదే.
అతడే మిమ్మల్నీ నన్నూ ఏకకాలంలో సృజించాడు.
మనందరినీ ఒక పరీక్షించాలనుకునిఒక ఆలోచన కొచ్చాడు.
శ్రద్ధగా పనిచేసే అందరికీ తన స్వ ర్గ ధామంలో
అంత:పురవాసం కల్పిస్తాననీ హమీ ఇచ్చాడు.
నన్ను ఆతడు అధికారం, ఐశ్వర్యం,ధీయుక్తి తో
పరీక్షించాడు.నేను ఆపరీక్ష లో
నెగ్గుతు న్నా ననేభావిస్తున్నాను.
ఇదంతా ఆయన కనుసన్నలలో
జరుగుతున్న ప్రక్రియ మాత్రమేనని
మనం గుర్తెరిగి ప్రవర్తించాలి.
కొందరు అతని ప్రసంగానికి
ముగ్ధులైనట్లు తలలూచారు.
మీరంతా శ్రమైక జీవన సౌందర్యాన్ని
సంపూర్ణంగానుభవించాలని నా కోర్కె.
ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పక కరుణిస్తాడు.
నాకుమల్లేనే ఇంద్రభవనాల్లో ఆనందిచే
అదృష్టాన్ని మీకు సమకూరుస్తాడు.
అని చెప్తూ బానిసల పెదాలకు నవ్వులనతికించే
ప్రయత్నం చేసి సఫలమయ్యాననే ఊహించాడు.
ప్రశ్నలను సంధించకుండా మౌనంగా
పనిచేసుకుపోయే వారినే ఆయన అక్కున
చేర్చుకుని అనురాగాన్నందిస్తాడు.
బానిసలందరూ ఊహాలకందుబాటులోకొచ్చిన
స్వర్గం తమచేరువలోకొచ్చిందని భ్రమ పడ్దారు.
ఒకేఒక్క బానిసమాత్రం ముఖం చిట్లించి
ఏవగింపుగా యజమాని వైపు దృష్టిని సారించాడు.
యజమాని ఓరకంటితో ఈ ఒక్కడితీరునూ గమనించాడు.
ఆఒక్క బానిసీడు తప్ప
ఆయజమానీ,తక్కిన బానిసలూ , ఆ పరమాత్ముడూ
ఆరాత్రి హాయిగా , ప్రశాంతంగా , ఒళ్లుమరచి నిదురించారు.
బానిసత్వం యదావిధిగా కొనసాగుతూనే వున్నది.
విద్యుక్త ధర్మంలా యజమాని తన క్రూరత్వం క్రమం
తప్పకుండా కొనసాగిస్తూనేవున్నా డు.
పరమాత్ముడూ ఇవేమీ పట్టించుకోకుండా ప్రక్కదారిన
వడి వడిగా నడుచుకుంటూ వెళుతూనే వున్నాడు.
ఒక్కక్షణంలో అ ఒక బా నీసీడుతప్ప మిగతా అందరూ
తమసంకెళ్లనుదీనంగా చూ సుకుంటూ తమ దైనందిన
క్రీడాభిరామాన్ని ఇతమిద్ధంగా సాగిస్తూ కన్నీటి
భాష్పాలను ఏకధారగా శృంఖళాలపై
రాలుస్తూనే జీవనం సాగిస్తూన్నారు,ఈ బాధామయజగత్తులో.
ఆ ఒక్క బానిసా ఈ ప్రపంచమనే పంజరంలోనుంచి
ఎక్కడికి వెళ్ళాడో యజమానీ చెప్పలేదు, బానిసీండ్రూ అడిగిన
పాపానపోయిన దాఖాలా కనరాలేదు.
[ఓ ఆంగ్లకవిత చదివిన నేపధ్యంలో]
===========================================
No comments:
Post a Comment