సుప్రభాత సుందరి
సోగకన్నులతో తనువును
స్పృశించకముందే నువ్వెలా
రాగలిగావు ప్రభూ?
ఇప్పుడే గదా! నగర సంకీర్తన
చేసిన భక్తులంతా ఊరంతా కలయ తిరిగి
ఇంటిముఖం పట్టి వెల్లిన చాయలింకా
కనుమరుగు కూడా కాలేదుగా ప్రభూ!!
పూలన్నీ ఇంతకుముదే గదా,
వొడలు విరుచుకుని కళ్ళను
విప్పార్చుకుని చూస్తూ
పూజాపుష్పాలుగా మారాలని
ఉబలటపడుతూ మావంతుగా
సంకీర్తనా స్రవంతిలో
ఓల లాడాలని ఉబలాట పడుతూ
మేముసిద్ధమయామని చెప్పినట్లు గుర్తు.
ఆ సూర్య కిరణాల కాంతులకు
జాగృతమై సుప్రభాత శ్లోకార్చనకు
సంసిద్ధతను వ్యక్తంచేసి క్షణమైనా
కాలవ్యయం జరిగినట్లుగాలేదుగ ప్రభూ!!
నిమిసమాత్రమైనా జాగుసేయక నేను తయారయి
వడి వడిగ అడుగులేసుకుంటూ నీ పద సన్నిధికి
చేరుకుని సాధువాదాల్నర్పించుకుని
భక్త్యంజలిని సమర్పించుకునే
అనుమతిని ప్రసాదించ వా ప్రభూ!!
---------------------------------
సోగకన్నులతో తనువును
స్పృశించకముందే నువ్వెలా
రాగలిగావు ప్రభూ?
ఇప్పుడే గదా! నగర సంకీర్తన
చేసిన భక్తులంతా ఊరంతా కలయ తిరిగి
ఇంటిముఖం పట్టి వెల్లిన చాయలింకా
కనుమరుగు కూడా కాలేదుగా ప్రభూ!!
పూలన్నీ ఇంతకుముదే గదా,
వొడలు విరుచుకుని కళ్ళను
విప్పార్చుకుని చూస్తూ
పూజాపుష్పాలుగా మారాలని
ఉబలటపడుతూ మావంతుగా
సంకీర్తనా స్రవంతిలో
ఓల లాడాలని ఉబలాట పడుతూ
మేముసిద్ధమయామని చెప్పినట్లు గుర్తు.
ఆ సూర్య కిరణాల కాంతులకు
జాగృతమై సుప్రభాత శ్లోకార్చనకు
సంసిద్ధతను వ్యక్తంచేసి క్షణమైనా
కాలవ్యయం జరిగినట్లుగాలేదుగ ప్రభూ!!
నిమిసమాత్రమైనా జాగుసేయక నేను తయారయి
వడి వడిగ అడుగులేసుకుంటూ నీ పద సన్నిధికి
చేరుకుని సాధువాదాల్నర్పించుకుని
భక్త్యంజలిని సమర్పించుకునే
అనుమతిని ప్రసాదించ వా ప్రభూ!!
---------------------------------
No comments:
Post a Comment