పూజాపుష్పం
-----------------రావెల
****************
ఒక్కదానివే అలానువ్వు ఒంటరిగా
కనరానిలోకాలకు కనిపించకుండా
నిష్క్రమించాక దిగులుగా,దిగాలుగా
ఆకాశంవైపు తలెత్తిచూసాను,
అంతటా కారుమబ్బులే బహుధా విస్తరించి
నీ గుండె గొంతుకలో పెరుగుతున్న చీకటిని చెరిపివేయగల శక్తి
మాదగ్గరగల ఏ కాంతి చ్ఛటకూడా డతొలగించలేదని
చెప్పి నడచుకుంటూ గబ గబా వెడలిపోయింది.
ఎదురుగా ప్రవహిస్తున్న సెలయేటిదగ్గరకు వెళ్ళి
ప్రశ్నార్ధకంగా నిరుత్తరుడనై నిలుచున్నాను.
ప్రవాహగతినంతటా నిర్లిప్తతా, నిస్పృహా,
కంఠదఘ్నంగా వరదలై పారుతూండడమే
నాకు కన్నులెదుట నిజరూపంగా సాక్షాత్కరించింది.
దు: ఖాన్ని ఉసురుస్సురంటూ ఉరుకులుబెడుతూ కదలిపోయింది.
నువ్వు ప్రేమాస్పదంగా మనిoటిప్రాగణంలో పెంచి
పోషించిన పూలమొక్కల చెంతకు చేరి నిశ్శబ్దంగా
నిలుచుండిపోయాను.
ఆ మొక్కలపై గాలితో సయ్యాటలాడే పూలన్నీ
ఏకకంఠంతో రకరకాల రంగులను వెలారుస్తూ
ఆనంద నర్తనం చేయడం నేత్రపర్వంగా గమనించాను.
ఆక్షణంలోనే ఆకాశవాణి నా చెవుల్లో నాకు మాత్రమే
వినిపించేట్లుగా గుసగుసలాడడం వినబడింది.
నువ్వొక పూజాపుష్పంగా ఆ పరమాత్ముని
పాదసన్నిధిలో ప్రశాంతగా నిదురిస్తున్నావని
ఆపూలనవ్వుల కృతజ్ఞతాభావo లోని అర్ధమదేనని
వివరణాత్మకంగా విశ్లేషించడంతో నాలో ఒక
చిరునవ్వు జనించి ఆనవ్వు మాత్రం 'నేనుండగా
దిగులెందుకు నీ కని ' అదృ శ్య మైపోవడం
ఆశ్చర్య హేతువై నన్ను అలరించింది.
-----------------------------------

No comments:
Post a Comment