Friday, October 23, 2015

నేను నిన్ను బాగాగుర్తెరిగి
నిమ్మళించేదాకా నాతో
ఆటలాడుదువుగాని తరలిరా!

ఎందుకలా నన్ను ఇలా ఒక అంధుడిగాజేసి
నీ కన్నీళ్ళను మందస్మిత
దరహాసాల వెనుక దాచుకోవాలని
విశ్వప్రయత్నం చేస్తూ వుంటావు?

నీ కళాత్మకమైన
 పనితనం నేరుగుదునుకదా!!
నువ్వుచెప్పదలుచుకున్నదేదీ స్పష్టంగా
పెదవి విప్పి ఎప్పుడయినా వివరంగా చెప్పావా?


నేను నిన్ను యదార్ధమైన పొగడ్తలతో
ముఖస్తుతి చేద్దామని ప్రయత్నిస్తే
వేనవేలుమార్గాలను వెదుక్కుంటూ
తప్పించుకోగలవన్నది నేనెరుగని సత్యమా?

నేనెప్పుడయినా నిన్ను సరదాగా
ఆటపట్టిద్దామనుకుంటేనీవు వెన్వెంటనే
విభిన్నంగా ప్రవర్తించి ఇంకో
 త్రోవగుండా నిష్క్రమిస్తుంటావు.
అందరికన్నా అమూల్యమైన ప్రతిపాదనేదో
నీ మనసుపొరల్లో నిద్రాణమైవుండివుంటుంది
అందుకేనీవెప్పుడూ మౌనాన్నాశ్రయించి
ముభావంతో మూర్తీభవించిన
మౌనిలా దర్శనమిస్తావ్!!

అందుకేనేమో నన్ను నిరంతరం నీవు ఆటపట్టిస్తూ
నేనిచ్చే యే బహుమతినీ స్వీకరించడానికి
ఎప్పుడూ ఇచ్చగించవు--నీ మనో ధర్మం నేనెరుగనిదా?
నీవు గ్రహించగలిగిన దేనినీ సానుకూలంగా
అనుగ్రహించిన స్వీకరించిన పాపానపోవు.
[టాగూరు తోటమాలిలోని 35 వకవితకు నాతెలుగుసేత]
==========================================

No comments:

Post a Comment