లవలేశం
-----------రావెల
నేనొక అధ్యాన్నయినా కావాలని తపించాను.
కానీ ఒక్క పుటనుగూడాకాలేక
ఇలా ఒంటరిగా మిగిలిపోయాను.
నువ్వు ప్రణయపురస్సరంగా వ్రాసి విడుదలచేసిన
'ప్రేమాంజలి'లో ఒక్క కవితగా నైనా కనిపించాలని
వేయి దేవుళ్ళకు మనసారా మొక్కుకున్నాను,
కానీ ఒక్క పదంగానయినా కాలేక పరితపించాను.
నీవు చిత్రించి కళాఖండంగా నిలిచిన చిత్తరువులో
ఒక్క వర్ణంగా నైనా ఒదిగిపోవాలని వందకుపైగా కలలుకన్నాను.
కానీ ఒక్కలవలేశంగానయినా వర్ణశకలంగానైనా కాలేకపోయాను.
కానీ ఇప్పుడు నాగుండేలో నీ ప్రతిరూపంగా
ఓ శిల్పాన్ని ప్రతిష్టించు కున్నాను.
కనీసం ఒక్క క్షణంపాటైనా నివ్వెరపాటుకలిగించేలా
ఒక మందస్మిత నయనారవిందాగానయినా చిరుదరహాసం
కావాలనీ, నిన్ను చక్కిలగింతలోనయినా మురిసిపోతుంటే
కళ్ళారా చూడాలని ఎంతగానో ఊహలలో తేలిపోయాను.
కానీ నీకోసం సుదీర్ఘమయిన ప్రయాణాన్నయినా గంటలతరబడి
చేయగల మొండితనాన్ని మాత్రం విశేషంగా సముపార్జించుకోగలిగాను.
నీకళ్ళల్లో మెరిసే తరగగా నయినా ఓ రెప్ప పాటు తళుక్కుమనాలని
అనవరతం అనేకమైన కలలుగంటూ కాలం వెచ్చించాను.
కానీ ఆ తారాగణంలో ఒక్క శకలంగానయినా కాలేక
ఇలా దు:ఖభాజనుడి నయాను.
నీహృదయస్పందనలలో ఒక్క" లబ్ డబ్ "నయినాకావాలని కలలుగన్నాను.
కానీ తృటిపాటయినా ఆశబ్దానికి చేరువగా చేరుకోలేక ఖేదపడ్డాను.
అయినా అనునిత్యం నాలోనే ప్రతిష్ఠితమైననీ రూపంలో
నినదించే నాదంగా మిగిలిపోవాలని నాదానిగా నిన్ను అభ్యర్ధిoచకుండా
ఉండలేక ఈకవితను రాస్తూ ఓ అశ్రు బిందువులోనైనా దర్శనమిస్తావని
ప్రతీక్షచేస్తూ ఆనందాశ్రువులను ధారాపాతంగా వర్షిస్తూ,
పరమానంద భరితుడనై మిగిలిపోతున్నాను.
===============================================
-----------రావెల
-------------------------------
నువ్వు ఆత్మీయంగా వ్రాసుకున్న బృహద్గ్రంధంలోనేనొక అధ్యాన్నయినా కావాలని తపించాను.

No comments:
Post a Comment