Wednesday, October 21, 2015

రాత్రంతా ఓ నక్షత్రం
రాలిపడినట్టు కలగన్నాను.
అది నా ప్రక్కలోకొచ్చి
వాలిపోయుంటుందని
భ్రమ పడ్దాను.

పగలంతా ఓ  కలకోసం
అనాలోచితంగా ఆశపడ్దాను
మూతపడని కన్నులతో
సమరంజరిపి సోలిపోయాను.

పగలూ రాత్రి కలలు గనడమే
పనిగా పెట్టుకుని కాలం గడిపాను.
కలలోకూడా కనపడకూడదని
నువ్వెందుకో భీష్మించుకు కూర్చున్నావు.

చీకటీ వెలుగూ మనొక్కరికోసమే
సృష్టించబడలేదని
 తీర్మానించుకున్నాను.

వెలుగుకోసమే
 వెంపర్లాడడం మేలని
నిర్ణయించుకున్నాను.

============================

No comments:

Post a Comment