Saturday, October 31, 2015

ఎప్పుడూ ఏదో ఒక సమయంలొనో
నిజాయితీగా ఓ సందర్భంలోనో
ఒక్కుదుటున కళ్ళముందు ఛాయా
మాత్రంగా కనబడి  నోరుతెరిచి
ఒక్క పలుకైనా నానుండి వెలువడే లోపు
అదృశ్యమైపోయి అలమటింపజేస్తుంటావ్!!
చల్లగా చలిగాలి వీచినప్పుడల్లా
చెంపలను మృదువుగా తాకి మెల్లగా
నిష్క్రమించి నేను నీరసపడి
 ఆక్రోశపడేలా అనునయంతో అభినయిస్తావు
హేమంత శార్వరివానీవు?


ఆశలన్నీ ఒక్కొక్కొకటిగా రంగును మార్చుకుని
నేలతల్లికి పాదాభివందనం చేయాలని
తహ తహ పడుతున్న సమయంలో
సర్వస్యశరణాగతుడిగా నేను పరిణమించి
దిగాలుగా దిసమొలతోనిలుచున్న తరువులా
ఎండగాని నీడగాని అలా నిలబడిపోయి నేనుంటే
ఒక్క చిరునవ్వును తటిల్లతలా మెరిపించి మురిపించి
 జరూరుగా జాగుసేయకుండా జారుకుంటుంటావు
కొంపదీసి నువ్వు శిశిరానికి
 తోబుట్టువు కాదుగదా ప్రణయినీ !

తొలగిన యవనికవా?
తొణికిన స్వప్నానివా నీవు ?
వాస్తవంగా నువ్వే తగు జవాబివ్వగలవు
ప్రవాసంలో వున్న ప్రణయహితుడను.
ప్రేమకవితలల్లడంలో మాత్రమే   ప్రధితుడను.
==========================

Friday, October 30, 2015

దైనందినం
----------రావెల

ప్రతిరోజూ సూ ర్యోదయంతోపాటే
నేనూ నిద్రనుంచి మేల్కొంటుంటాను.
అనూహ్యమైన మార్పులేమైనా
సంభవించి వుంటాయేమోనని
ఆశగా ఎదురుచూస్తుంటాను.
నామనసు కూడా విభిన్నంగానే
తలపుల్లో తేలిపోతూ వుంటుంది.

కానీ సర్వసాధారణంగా
అన్ని రోజుల్లాగానే ఆరోజూ
మా మూలుగానే దొర్లిపొతూ వుంటుంది.
  సూర్యోదయాస్తమానాల  మ ధ్య
సున్నితమైన నా మనసు
సుడులుతిరుగుతూ భావనా
సంభ్రమాశ్చర్యాల   నడు మన
సప్రశ్రయంగా సర్దుకుపోతూవుంటుంది.

రోజులు నెలలుగా
నెలలు  సంవత్సరాలుగా సాగిపోతూ
ఈ పరిణామాలన్నింటికీ నన్ను
 అప్రతిభుడిగా మిగిల్చివేస్తుంది.

మిగతా అన్నిరోజుల్లాగానే ఆరోజూనేను
నిద్రకుపక్రమించి మళ్ళీ కొత్త కలలకు
ఊపిరులూదుతూ ఉచ్ఛాస్వ   నిశ్వాసాల
జీవనo సాగిస్తూనే వుంటాను.
కలతనిదురలో కలలకు , కలుక్కుమనే
గుండెను నిభాయించుకొమ్మని
ఉచిత  సలహాలిస్తూంటాను.

నాలో విభిన్నమైన మార్పులేమైనా
సంభవించాయేమోననిప్రతి ఉదయాన
మరలా  ఒక్కసారినన్నునేనే గిల్లుకుని
 యదార్ధజీవితంలోయదాతధంగా
 ఊపిరులూదుతూవుంటాను.
------------------------------------------------------

Thursday, October 29, 2015

హృదయగతమైన   రహస్యాన్ని దేనినీ ప్రియా,
నీ గుండె  గుప్పిట్లో దాచుకోవాలని యత్నించకు!!
నాతో ఒక్కనాతోనే ఆ గుట్టును విడమరిచి పంచుకో
ఎంతో మృదువుగా దరహాసచంద్రికలను వెలువరించగల నీవు
ఆ మెత్తదనాన్ని హాయిగాసమకూర్చుకుని
నాదగ్గర గుస గుసలాగా ఆగుట్టును  విప్పు!
నా హృదయమే దాన్ని వింటూంది
నాచెవులుమాత్రం కాదుసుమా!!


రాత్రి పూర్తిగా  గాఢమై విస్తరించిపోయింది.
గృహమంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది.
పక్షుల గూళ్ళన్నీ నిద్రావస్థలో మునిగిపోయి ఉన్నాయి.

డోలాయమానంగా  ఊగిసలాడుతూ వున్న అశ్రుబిందువులతో
తడబడుతూన్న నీ నవ్వులతో మధురాతి మధురమైన బిడియంతో
బాధామయమైన హృదయవేదనతో నీలో దాచుకున్న రహస్యాన్ని
గుట్టుగా నా ఒక్కరితో విపులంగా పంచుకో ప్రియతమా!!



[టాగూరు తోఅమాలిలోని  29  కవితకు నా తెలుగుసేత]
అతన్ని మొదటినుంచీ గమనిస్తునే వున్నాను.
దినం తెల్లవారకముందే పొగలుగక్కే కాఫీ
కప్పును నోటికి తగిలించుకుంటాడు.
సూర్యకాంతి ఎదురుపడకుండానే పనిమంతుడిలా
కార్యాలయానికి పరుగెడుతూ వుంటాడు.

అతన్ని నిరంతరం గమనిస్తూనే వుంటాను
పనినే ప్రత్యక్ష దైవంగా నమ్మే వారిలో
మొదటికోవలోనే ఎంపికవుతూ వుంటాడు.
తన కాలాన్నంతటినీ పనికే పరిమితంచేసి
ఉరుకులు పరుగులతో చెమటలు గక్కుతూ వుంటాడు.


పక్షుల యినా సరైన సమయానికి గూటికి చేరతాయన్న
ఇంగిత జ్ఞానం కూడా ఉన్నట్లు కనిపించదు.
కుటుంబం పట్ల విముఖతనే ప్రదర్శిస్తూ
ఎవ్వరయినాసరే విస్తుపోయేలా ప్రవర్తిస్తూవుంటాడు.


అర్ధరాత్రోపరాత్రోఇంతికి దిగబడి కస్తోకూస్తోనంజి

ప్రక్కమీదకు వాలిపోతాడు. పిల్లలేంచదువుతున్నరోకూడా
తెలుసుకోనిచ్చగించని పెద్దమనిషి తను.

జీవన్మృతుడికీ ఈయనగారికీ వ్యత్యాసం ఏదయినా వుందనుకోను.
జీవన ప్రమాణాల నన్నింటినీ మృత్యు గహ్వరంలొకి తోసేసి
అనవరతం సుఖజీవనం సాగిస్తూ వుంటాడు.

ఒకరోజుచూసాను మర్నాడూ గమనించాను.
మూడోరోజునుంచీ ముముక్షువునై పోయాను.

మౌన ముద్రలో వుంటూ ముభావాన్ని గౌరవిస్తూ
కాలం వెంట పరుగులుపెట్టడం మాని
ఎప్పుడో చదువుకున్న కాలజ్ఞానాన్ని నెమరువేస్తూ జీవిస్తున్నాను.
=============================================
సుప్రభాత సుందరి
సోగకన్నులతో తనువును
స్పృశించకముందే నువ్వెలా
రాగలిగావు ప్రభూ?


ఇప్పుడే గదా! నగర సంకీర్తన
చేసిన భక్తులంతా ఊరంతా కలయ తిరిగి
ఇంటిముఖం పట్టి  వెల్లిన చాయలింకా
కనుమరుగు కూడా కాలేదుగా ప్రభూ!!

పూలన్నీ ఇంతకుముదే గదా,
వొడలు విరుచుకుని కళ్ళను
విప్పార్చుకుని చూస్తూ
పూజాపుష్పాలుగా  మారాలని
ఉబలటపడుతూ మావంతుగా
 సంకీర్తనా స్రవంతిలో
ఓల లాడాలని  ఉబలాట పడుతూ
మేముసిద్ధమయామని చెప్పినట్లు గుర్తు.
ఆ సూర్య కిరణాల కాంతులకు
జాగృతమై సుప్రభాత శ్లోకార్చనకు
సంసిద్ధతను వ్యక్తంచేసి క్షణమైనా
కాలవ్యయం జరిగినట్లుగాలేదుగ ప్రభూ!!

నిమిసమాత్రమైనా  జాగుసేయక  నేను తయారయి
వడి వడిగ అడుగులేసుకుంటూ నీ పద సన్నిధికి
చేరుకుని సాధువాదాల్నర్పించుకుని
 భక్త్యంజలిని  సమర్పించుకునే
అనుమతిని ప్రసాదించ వా  ప్రభూ!!


---------------------------------


తెలుగదేలయన్నదేశంబుతెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు తెలుగులెస్స.

--శ్రీ కృష్ణదేవరాయలు---[1471-1539]

Wednesday, October 28, 2015

ఉచితసలహాలు
------------------రావెల
-------------------
కొండశిఖరం అంచుదాకా చేరి
క్రిందకు దూకుతా దూకుతానని
బెదిరించే యువ హృదయానికి
నీవందించే సలహాయేమిటి?

కత్తిని చేతబట్టుకుని
భార్యగా తాను బ్రతుకు
సమరంలో వోడిపోయానని
బెదరిస్తున్న పడతికి
 నీ వందించే సలహా ఏమిటి?

చేతులో ఓ తాడునుపట్టుకుని
విద్యార్ధి జీవితపు పరీక్షలో
సఫలంకాలేకపోయాననేనెపంతో
ఘూర్ణిల్లుతూ ఉతివేసుకుని
జీవితానికి చరమ గీతం
పాడాలనుకున్న వ్యక్తికి
నీవివ్వగల సలహా ఏమిటి?

చేతిలో పదులకొద్దీ నిద్రమాత్రలుంచుకుని
ప్రణయగమనంలో విఫలమైనామని
దీర్ఘనిద్రకు సిద్ధమౌతున్న
కన్యాకుమారికి నువ్వందించే
సలహా యేమిటోచెప్పగలవా?

నువ్వు యేసలహానందించినా అది వారి
మనసుకు గట్టిగా హత్తుకుని
విపత్కరపరిస్థితులను చక్కదిద్ది
కొత్త జీవితాన్ని కౌగిలించుకోగల
సామర్ధ్యం ఆసలహాకుండాలిసుమా!!

వారి క్షతగాత్రాలకూ,వికలమైన మనస్సుకూ
భరోసానివ్వగలిగి కాలగమనంలో
ఆ  గాయాలకు పైపూతమందుగా
పనిచేయగలిగితే మేలుచేసినవాడవవుతావు.
చిద్రమవడానికి సిద్ధమౌతున్న ఆ మనసులకు
మందుగా అదిపనిచేయగలగాలి.
సహనంతో సమన్వయంతో
 సమస్యలను నెదిరించిసమర్ధవంతంగా
నిలబడగలిగిన సత్తా వారికందించగలగాలి.
అప్పుడే కవీ!! సాహితీసుగతుడిగా నీ కృషి
కృతార్ధమై నిలబడిపోయినట్లు.
అప్పుడే కవీ సాహితీసుగతుడిగా నీ కృషి
సార్ధకమై   శ్వాసించినట్లు
అజరామరమై నీకృషి ఆచంద్రతారార్కం
వెలుగువెన్నెలగా నేలపై
చిరంజీవిగా చిరస్థాయిగా
నిలబడిపోయిన దాఖలా.
----------------------------
[ఓ ఆంగ్లకవితను చదివిన నేపధ్యంలో]



ఎందుకిలా మాఇంటి ముందు
నిటారుగా నిలిచివున్న తరువు
రక రకాల రంగుల పూలబట్టలా
దిరుసులను ధరించి నవనవోన్మేషంగా
తయారయి తూర్పు వాకిలిముందు
భానూదయం కాకముందే తయారయికూర్చుంది?
శిశిరానికి స్వాగతం చెప్పగల సౌమనస్యాన్ని
ఎప్పుడలవరచుకుందబ్బా!! ఈ తరువు
తగుదునమ్మా అని తెగసంతోషంతో
ఉబ్బి తబ్బిబ్బై పరవశించి సంతోషసంద్రంలా
పొంగి ప్రవహిస్తున్నది?

==============================

కొద్ది కొద్దిగా చలి
నింగినుంచి నేరుగా
నెత్తిమీదకు జారిపడే
చిన్నపాటి చిరుజల్లులు
చీకటిపడే లోపుగానే
ఈ పూలను కోసి
బుట్టలోకెత్తుకుని
గబగబా ఇంటికి పరుగెత్తాలి.
 ఇవి  శరద్రాత్రులుకద!
ఇంతపాటి ఉత్సాహం గుండెనిండుగా
పొదవి పట్టుకుంటూంటే యేదో తెలియని
గాఢానుభూతి కౌగలించుకున్నట్లు.

చందమామా నాకోసమే వెన్నెల వెలుగును
విస్తారంగా పిండారబోసినట్లుగా
పదిల 'పరచి ' నట్లుగా ఒక పులకరింత
యేమేమో తెలుపనలవిగాని  జలదరింపు.


ఎందుకని నాబుగ్గలింతగా ఎరుపెక్కిపోయాయి
నా ప్రభువు నన్ను స్పృశించిన దాఖాలాకూడా
కనరావడంలేదుకదా! ఎందుకింతగా మనసు
కవ్వింతలకు లోనయి కళవళ పడుతూ
నన్నిలా కలవరింతల పాల్జేసి
కిమ్మిన్నాస్తిగా కూర్చుండిపోతున్నది?
=================================

Tuesday, October 27, 2015

శ్రీరంగం శ్రీనివాసు
రాసి మహాప్రస్థానం
తెచ్చుకునె కవిత్వాన
ప్రధమ గణ్య స్థానం.

ఈ శతాబ్దం నాదంటూ
జబ్బలు చరిచినవాడు,
అధోజగత్సహోదరుల వెంటే
నేనంటూ కలివిడిగా తిరిగినోడు.


మనసునమనసై బ్రతకడమే
గొప్పని చెప్పినవాడు.
అగాధమౌ జలనిధిలో
ఆణిముత్యమున్నదని
 గ్రహించినవాడు..
శోకాలమరుగునదాగిన
సుఖాన్ని వెదికినవాడు.

రేపటి కాలంలో జరిగే నిత్య సత్యాలను
కళ్ళకు కట్టినట్లుగా వివరించిన క్రాంతదర్శి.
అవినీతి బంధుప్రీతి అలముకున్న ఈదేశం
ఎటుదిగజారునోయని బాధపడిన భారతీయు డు. .




Monday, October 26, 2015

నింగీ నేలా
కలిసి నడుస్తున్నవి
భగవంతుడి పాదాలచెంత.
--------------------
వసంతం
హేమంతం
కలిసి పాడుతున్నవి
ఋతునర్తన  సంగీతం.
------------------------
నెత్తినెక్కినమ్మ మొత్తిన ఉలకడు
జుట్టుపట్టిలాగ తిట్టుకొనడు
చెంబెడునీటితొ శంభొయన్నను చాలు
శివములెత్తి వచ్చు శివుడుతాను.

కొన్ని కధలెపుడు
విషాదాంశాలుగా ముగుస్తాయో
అవగతం కావు
కవితలకు కాల్లొచ్చి అప్పుదే
కాపాడాలని తీర్మానించుకుంటాయి.

కొందరు కన్నెపిల్లలు అనూహ్యమైన
అపాయాల్లో చిక్కుకుని సతమౌతారో
ఎవ్వరం ఎన్నటికీ చెప్పనలవిగాదు
అప్పటికప్పుడే కవితలకు ప్రాణాలొచ్చి
తక్షణం ఆదుకోవాలని సమాయత్తమౌతాయి.

కొన్నికలలకు ఎప్పుడు కాళ్ళొచ్చి
కళవళపెడతాయో ముందస్తుగా ఊహించలేం
అప్పుడే కవితలు భానుకిరణాల్లా ఉదయించి
చీకటితెరలను ఒక్కుదుటన చీల్చి చెండాడతాయ్.
==================================


Sunday, October 25, 2015

మనసులో ఒక కవిగా నీ ప్రియుడు
ప్రణయాంజలి అనే ఉద్గ్రంధాన్ని
రచించాలని సంకల్పించాడు.
నా అజాగ్రత్త వల్ల అదికాస్తా
నీ కాలియందెలలకు చిక్కుకుని
తునాతునకల అవన్నీ పాటలుగా
 నీ పాదాలచెంతన జారిపడిపోయి
ఘూర్ణించడం మొదలెట్టాయి.

నేను గాఢంగా కూడబెట్టుకున్న
సంగ్రామ కధలన్నీ చేతుల్లోంచి
నీ నవ్వుల సునామీలో చెల్లా చెదరై
బొత్తి బొత్తీ   ఒక్కుదుటున
కన్నీళ్ళలోకి జారిపడి
మునిగిపోయాయి
 .

ఆనష్టాన్నంతా నీవే పరిహారంగా
చెల్లించాలి తప్పదు ప్రియా!!

నేనుచెప్పినవంతా అజరామరమైన
కీర్తినినామరణానంతరం
  సముపార్జంచలేవని నీవు
ముందస్తుగా భావించినట్లయితే
నన్ను చిరస్థాయిగా బ్రతికుండగనే చిరంజీవిగా
నిలబెట్టగల ఉపాయాన్ని నువ్వే యోచించు.


అ నాకు అప్పటిదాకా జరిగిన
నష్టాన్ని గూర్చి బాధపడను సరికదా
నిన్నుకూడా ఎప్పటికీ నిందించను.


[టాగూరు తోటమాలిలోని 38 వకవితకు తెలుగుసేత.]

Saturday, October 24, 2015

గర్తపురి-6
=============

ఉదయశ్రీ కావ్యంతో
పండిత, పామరుల
హృదయందోచిన వాడు.
పుష్పవిలాపంతో
జనావళిచే కంటతడి
పెట్టించినవాడు.
పంచదార్లో అద్దిన
పద్యాల నందించిన వాడు
మధురమైన వాకులతో
మనసులను దొంగిలించినవాడు.
కరుణశ్రీ మా గర్తపురికే
వెన్ననద్ది వెన్నెలను
ప్రసాదించినకవివరేణ్యుడు.
ఆయన పసలాలిత్యానికి
మరొకరెవ్వరూ పోటీకి  సాటిగా
 వారిసరసకు రారు,రాలేరు.

==================================


నివేదన
-----------
అతుకు బొతుకులగంత వంటి బ్రదుకునందున
 కంఠ దఘ్నపు ఈ విరహమెందులకు?

సుమలాలిత్యపు హృదయమందున
కరాళ దంష్ట్రాంకురపు క్షతములేలనో?

నవ్వుతు సాగే నయగారపు జీవితాన
కన్నీటి జలపాత ప్రహాహంపు అలజడులేలనో

ఆమనితో పరవశించెడు ఈ జీవికి
శిశిరర్తుపు మధుకీల దాహార్తు లేల?
సౌరభంపు సుమాలు ముడిచిన ఆనల్లని జడలో
శ్వేతవర్ణపు మొగలిపొదల బుసబుసలేలనో

వలపు జడులలో మురిసిన మనసుకు
వగపు వీడని దు@ఖ తలపులేలనో

అన్ని వేదనలు ఆమె కొరకేనని
అక్షరాలా విన్నవించనా?
దివ్యలోకాలకేగిన తనను
దివినుండి భువికి దిగిరమ్మని వేడనా?
------------------------------------------------------

Friday, October 23, 2015

నేను నిన్ను బాగాగుర్తెరిగి
నిమ్మళించేదాకా నాతో
ఆటలాడుదువుగాని తరలిరా!

ఎందుకలా నన్ను ఇలా ఒక అంధుడిగాజేసి
నీ కన్నీళ్ళను మందస్మిత
దరహాసాల వెనుక దాచుకోవాలని
విశ్వప్రయత్నం చేస్తూ వుంటావు?

నీ కళాత్మకమైన
 పనితనం నేరుగుదునుకదా!!
నువ్వుచెప్పదలుచుకున్నదేదీ స్పష్టంగా
పెదవి విప్పి ఎప్పుడయినా వివరంగా చెప్పావా?


నేను నిన్ను యదార్ధమైన పొగడ్తలతో
ముఖస్తుతి చేద్దామని ప్రయత్నిస్తే
వేనవేలుమార్గాలను వెదుక్కుంటూ
తప్పించుకోగలవన్నది నేనెరుగని సత్యమా?

నేనెప్పుడయినా నిన్ను సరదాగా
ఆటపట్టిద్దామనుకుంటేనీవు వెన్వెంటనే
విభిన్నంగా ప్రవర్తించి ఇంకో
 త్రోవగుండా నిష్క్రమిస్తుంటావు.
అందరికన్నా అమూల్యమైన ప్రతిపాదనేదో
నీ మనసుపొరల్లో నిద్రాణమైవుండివుంటుంది
అందుకేనీవెప్పుడూ మౌనాన్నాశ్రయించి
ముభావంతో మూర్తీభవించిన
మౌనిలా దర్శనమిస్తావ్!!

అందుకేనేమో నన్ను నిరంతరం నీవు ఆటపట్టిస్తూ
నేనిచ్చే యే బహుమతినీ స్వీకరించడానికి
ఎప్పుడూ ఇచ్చగించవు--నీ మనో ధర్మం నేనెరుగనిదా?
నీవు గ్రహించగలిగిన దేనినీ సానుకూలంగా
అనుగ్రహించిన స్వీకరించిన పాపానపోవు.
[టాగూరు తోటమాలిలోని 35 వకవితకు నాతెలుగుసేత]
==========================================

Thursday, October 22, 2015


కట్టుబడిన కారుణ్యం
------------------రావెల
^^^^^^^^^^^^^^^^^^^
బానిసలకు భయంకరమైన విసుగొచ్చింది.
నిరంతరం వెన్నంటి వేధిస్తున్న
శృంఖలాలపట్లఏహ్యభావమూ తలెత్తింది.

వారినలా బంధించిన క్రూరునిపట్ల
  అసహ్యాన్నీ అసహనాన్నీ  ప్రకటిస్తూ తలలెత్తి
అతన్ని అతి హీనంగా చూడడం మొదలెట్టారు.

ఇదంతా శ్రద్ధగా గమనించిన యజమాని
వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చిఏకబిగిన  సు దీర్ఘంగా
 ప్రసంగించడం ప్రారంభించాడు.

ఆకాశంలోఓ అద్భుతమై ప్రకాశించే వ్యక్తి
పరమాత్ముడనిమీరెరిగినదే.
అతడే మిమ్మల్నీ నన్నూ ఏకకాలంలో సృజించాడు.
మనందరినీ ఒక పరీక్షించాలనుకునిఒక ఆలోచన కొచ్చాడు.
శ్రద్ధగా పనిచేసే అందరికీ తన స్వ ర్గ ధామంలో
అంత:పురవాసం కల్పిస్తాననీ  హమీ ఇచ్చాడు.

నన్ను ఆతడు అధికారం, ఐశ్వర్యం,ధీయుక్తి   తో
పరీక్షించాడు.నేను ఆపరీక్ష లో
 నెగ్గుతు న్నా  ననేభావిస్తున్నాను.
ఇదంతా ఆయన కనుసన్నలలో
 జరుగుతున్న ప్రక్రియ మాత్రమేనని
మనం గుర్తెరిగి ప్రవర్తించాలి.
కొందరు అతని ప్రసంగానికి
ముగ్ధులైనట్లు తలలూచారు.

మీరంతా శ్రమైక జీవన సౌందర్యాన్ని
సంపూర్ణంగానుభవించాలని నా కోర్కె.

ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పక కరుణిస్తాడు.
నాకుమల్లేనే ఇంద్రభవనాల్లో ఆనందిచే
అదృష్టాన్ని మీకు సమకూరుస్తాడు.
అని చెప్తూ బానిసల పెదాలకు నవ్వులనతికించే
ప్రయత్నం చేసి సఫలమయ్యాననే ఊహించాడు.
ప్రశ్నలను సంధించకుండా మౌనంగా
 పనిచేసుకుపోయే వారినే ఆయన అక్కున
చేర్చుకుని అనురాగాన్నందిస్తాడు.

బానిసలందరూ ఊహాలకందుబాటులోకొచ్చిన
స్వర్గం తమచేరువలోకొచ్చిందని భ్రమ పడ్దారు.
ఒకేఒక్క బానిసమాత్రం ముఖం చిట్లించి
ఏవగింపుగా యజమాని వైపు దృష్టిని సారించాడు.
యజమాని ఓరకంటితో ఈ ఒక్కడితీరునూ గమనించాడు.
ఆఒక్క బానిసీడు తప్ప
  ఆయజమానీ,తక్కిన బానిసలూ , ఆ పరమాత్ముడూ
 ఆరాత్రి హాయిగా , ప్రశాంతంగా , ఒళ్లుమరచి  నిదురించారు.

బానిసత్వం యదావిధిగా కొనసాగుతూనే వున్నది.
విద్యుక్త ధర్మంలా యజమాని తన క్రూరత్వం క్రమం
 తప్పకుండా కొనసాగిస్తూనేవున్నా  డు.
పరమాత్ముడూ ఇవేమీ పట్టించుకోకుండా ప్రక్కదారిన
వడి వడిగా నడుచుకుంటూ వెళుతూనే వున్నాడు.
ఒక్కక్షణంలో అ ఒక బా నీసీడుతప్ప మిగతా అందరూ
తమసంకెళ్లనుదీనంగా చూ సుకుంటూ తమ దైనందిన
క్రీడాభిరామాన్ని ఇతమిద్ధంగా సాగిస్తూ కన్నీటి
   భాష్పాలను ఏకధారగా శృంఖళాలపై
రాలుస్తూనే జీవనం సాగిస్తూన్నారు,ఈ బాధామయజగత్తులో.
ఆ ఒక్క  బానిసా   ఈ ప్రపంచమనే పంజరంలోనుంచి
ఎక్కడికి వెళ్ళాడో యజమానీ చెప్పలేదు, బానిసీండ్రూ  అడిగిన
పాపానపోయిన దాఖాలా కనరాలేదు.
[ఓ ఆంగ్లకవిత చదివిన నేపధ్యంలో]
===========================================

Wednesday, October 21, 2015

రాత్రంతా ఓ నక్షత్రం
రాలిపడినట్టు కలగన్నాను.
అది నా ప్రక్కలోకొచ్చి
వాలిపోయుంటుందని
భ్రమ పడ్దాను.

పగలంతా ఓ  కలకోసం
అనాలోచితంగా ఆశపడ్దాను
మూతపడని కన్నులతో
సమరంజరిపి సోలిపోయాను.

పగలూ రాత్రి కలలు గనడమే
పనిగా పెట్టుకుని కాలం గడిపాను.
కలలోకూడా కనపడకూడదని
నువ్వెందుకో భీష్మించుకు కూర్చున్నావు.

చీకటీ వెలుగూ మనొక్కరికోసమే
సృష్టించబడలేదని
 తీర్మానించుకున్నాను.

వెలుగుకోసమే
 వెంపర్లాడడం మేలని
నిర్ణయించుకున్నాను.

============================

రంగులు మార్చుకోగలిన రాజకీయం
జగజ్జేగీయమానం గా వెలిగిపోతూ
సిగ్గూ శరానికి విలువేమిటని?
బహిరంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది.

ఎన్నికలలకు ముందు ఇచ్చిన
 వాగ్దానాల ప్రమాణ పత్రాలను
మలమూత్రాలను తుడుచుకుని శుభ్ర పరిచే
కాగితాలకన్నా హీనమేనని
అక్షరాలా ఋజువు పరిచే దిశలో
శ్రమకోరుస్తూ స్వేదం వెలారుస్తున్న
అధికారసిమ్హాసనంపై మధిష్టితమై
తమ జబ్బలు తామే చరుచుకుంటూ
 ఆరంభ శూరత్వాన్నే  ఆత్మ వంచనగా యెంచుకుని
ముందుకు సాగుతున్నామని మురిసి ముక్కలవుతున్న
మోసానికీ దగాకూ సోదాహరణంగా నిలిచే
రాజకీయ భేతాలుడి వారసత్వపు సంతతి.

ఎక్కడ అసంతృప్తి తలెత్తినా అక్కడకు క్షణాల్లో
చేరుకుని మతగ్రంధం సాక్షిగా మనసు పొరలను
ఓదార్పు యాత్రలతో ఊరిస్తున్న జగనేక శూరుడు
ఆర్ధికంగా కాకికిగూడా ఎంగిలిచేతిని చూపనుంకించని
జనసేవకుడు.అధినాయకులను ఆకట్టుకుని స్వేచ్చావాయువులను
పీల్చడంలో సంతోషాన్ని వెదుక్కుంటున్న్న పేలవమౌ ప్రజా ప్రతినిధి.

స్వార్జితమైన ఆస్తులు కాపాడుకోవాలని
అవతల నిలిచిన శత్రువుతో కరచాలనం చేసి
తబ పబ్బం గడుపుకుంటూ ప్రజల దృష్టిని
పరిశీలనగా ప్రక్కదారి పట్టించగల
వలపక్షం వైపు వాలుచూపులతో వంచించగల నెపంతో
కాలం గడుపుతున్న ప్తైపఖం
వలపక్షానికే నిర్దేశిస్తూన్న నయవంచనలో
నాలుగాకులు ఎక్కువచదివిన మాటల మాంత్రికుడు.

=============================================
ధర్మ మార్గమందు దాసుండవైపోయి
కర్మజ్ఞానివోలె మర్మ మెరిగి
విబుధవరులు మెచ్చ విజ్ఞాన ఖనివౌచు
నడచుకొనుట మేలు  నాణ్యముగను.
==========================
పగలే వెలుగుతూన్న
పట్టణ మునిసిపల్ దీపంలా
భారతం ఎలాతెలాపోతుంటే
దేశం వెలిగిపోతున్నదని
మాయలాంతరు పట్టుకున్న
అధినాయకత్వం ఆత్మస్తుతి
మొదలెట్టింది.

ఇక పరనిందలపర్వంలో
అటు అధికార పక్షం
ఇటు ఊసుపోని ప్రతిపక్షం
ఒకరైపై ఇంకొకరు వ్యంగ బాణాలు
సంధిచుకోవడం సాధికారంగా ప్రారంభించారు.

స్వచ్చ భారత్ ధర్మమాని
ప్రతినగరం చెత్తకుప్పలా తయారయింది.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
కార్మికలోకం కళ్ళప్పగించి చూస్తున్నది.

సమ్మెలూ ఘెరావులూ సమకాలీన సమాజ
 జీవితపు  సంక్షేమానికి సాక్ష్యమని
నిత్య సంఘర్షణలే నిలువెత్తు నిజరూపాలనీ.
వామ పక్ష పార్టీలు ఊదరగొడుతన్నాయ్.

========================================
జాగేలరా--!!
========
నీ ముఖద్వారంవద్ద
ముభావంతో నిలబడియున్నాను
మందస్మిత హృదయారవిందుడవై
లాలనగా నన్ను కరుణించేందుకు
జాగేల ప్రభూ  వెన్నెల కరిగినీరవకముందే
ప్రభాతాన భక్తులసంఖ్యపెరుగుతూ వచ్చి
నీ ముఖద్వారం రాకపోకలకు క్రిక్కిరిసిపోకముందే
తక్షణమే కరుణాంతరంగుడవై
నీ దయార్ద్ర హృదయసౌహార్దతను
 ప్రకటించే వీలుంది స్వ్మీ వెనువెంటనే
 భీరుడను నన్ను దరిజేర్చుకునేందుకు ధీరుడవుగదా! బిరాన

రా కదలిరా-- నీమ్రోల విన్నపాల సుమమాలను చేతపట్టి
ఆశగా ఎదురుచూస్తున్నాను జాగేలరా ప్రభూ! రా కదలిరా!!
మనిషికీ మనిషికీ మధ్యన
నిర్మితమై నికార్సుగా నిలబడ్డ
వంతెనను ఎవరో కుదిపేసి కూల్చేస్తున్నారు?

కాలంతో పాటుపరుగెడుతూ   కాగితాలు ఖరాబుచేస్తున్న వాడిని
కత్తులతో పొడిచేసి కరాఖండీ గా  హతమారుస్తున్నారు.

వాగ్దానాలన్నింటినీ మూడుసిం హాల సిం హసనాధీశులు
మూడుచెరువుల నీటిని త్రాగించి ముప్పతిప్పలుపెట్టిస్తున్నారు.

న్యాయానికీ ధర్మానికీ మధ్యన మూర్ఖపు శిఖామణులు
తిష్ఠవేసుకు కూర్చొని  నడమంత్రపు సిరులనే ఎండమావుల వెంట
దాహార్తిని తీర్చుకోవాలని నిష్ఫల ప్రయత్నాలు కొన సాగిస్తున్నారు.
=======================================
అతను కుంచెను చేతబట్టినప్పుడల్లా!
ప్రపంచమంతా ముగ్ధ మనోహనరూపం దాల్చి
అతనిముందు వినమ్రంగా మ్రోకరిల్లడంగమనించాను.
ఫల పుస్పాదులతో విస్తరించిన వనసమూహం
అతని కుంచెకు కొత్త సొబగులు దిద్దినట్లనిపిస్తుంది.

అసుర సంధ్యవేళన ఆకాశం అతని ముఖద్వారం వద్ద నిలిచి
నన్ను అన్నింటికన్నా అందంగా రూపుదిద్దుకునేలా చేయమని
శతవిధాలా ప్ర్రాధేయ పడుతుండడమూనాకేమీ కొత్తగాదు.

తనూలతలు చంచలించిపోగా తరుణీలాలామలు అతడి అందమైన
బృందావనంలో గోపికలై భాషించారు.

వాయువు వీచినప్పుడలా ఆకుల కదలికలు తమ అంతరంగాన్ని
ఆవిష్కైంచమని అభ్యర్ధిస్తున్న సందర్భాలెన్నో నాకు తెలుసు.

అతని ఒడిలో ఒదిగి ఎన్నో కధలు తమకు కొత్తగీతలు రాసిన బ్రహ్మ
ఆతడని వినయ విధేయతలను ప్రకటించారు.

అతను గీతా రహస్యమెరిగిన మహర్షి--

============================================
ఉక్కిరిబిక్కిరి-----
--------------------
నగరంలో జడివాన
రహదారులన్నీ జలమయం
లోతట్టుప్రంతాలలో ఇళ్ళన్నీ
 వాననీటిలో మునిగి మునకలేస్తున్నాయి.

పల్లెటూళ్ళన్నీ పరాకుగా చూస్తున్నాయి
మానేలను రాలితే నాలుగు చినుకులు
నలభై బస్తాల ధాన్యాన్ని అదనంగా
పండిస్తాంగదా అని బుంగమూతి పెట్టుకుని
వరుణదేవుడిని అదేపనిగా ప్రశ్నలతో
ఉక్కిరిబిక్కిరిచేసి ఊపిరాడకుండా వేధిస్తున్నాయ్!
===================================
ఒక్క సరళ రేఖనుకూడా సరిగ్గా గీయలేనివాడు
బాపుగానో, రవివర్మగానో పికాసోలాగానో
తయారు కావాలని తపించడంలో తప్పులేదు!
శ్రమించడం అటకెక్కించినప్పుడే
అభాసుపాలవడం ఆరంభమౌతుంది.

ఒక్క పదాన్నికూడా కుదురుగా  సమన్వయంతో
 క్రోడీకరించే నేర్పులేని వాడు
పోతన గారితోనో ప్రసాదరాయకులపతిగారిలానో
భవకవితా జలధి  దేవులపల్లి వారితోనో
సరిసమానంగా సాహితీ వ్యవసాయం చేయగలనని
తలపోయడం భ్రమ కాకుండా ఏమై వుంటుందంటారు?
ప్రతిపదార్ధ విజ్ఞానం పెంపొందించుకోవాలిగదా!!
శబ్దార్ధ చంద్రికను శోధించడం మొదలెట్టాలికదా!!
=========================================
శ్రమించే స్వేదం నీది
పరిభ్రమించే నైజం నాది
ఇరువురిమధ్యా
తచ్చట్లాడే  తత్వం ప్రేమది.
ముచ్చట్లాడే వయసునీది
ముచ్చటపడే మనసు నాది
మురిపెంతో ముద్దాడే మోజు నీది
కాదనగల కన్యాత్వం నాది.
ఇరువురిమధ్యా సణుగుతూ
సాగే జీవితం ఈ కలికాలానిది.
======================

Tuesday, October 20, 2015

 లవలేశం
-----------రావెల
-------------------------------
నువ్వు ఆత్మీయంగా వ్రాసుకున్న బృహద్గ్రంధంలో
నేనొక అధ్యాన్నయినా కావాలని తపించాను.

కానీ ఒక్క పుటనుగూడాకాలేక
ఇలా ఒంటరిగా మిగిలిపోయాను.

నువ్వు ప్రణయపురస్సరంగా వ్రాసి విడుదలచేసిన
'ప్రేమాంజలి'లో ఒక్క కవితగా నైనా కనిపించాలని
వేయి దేవుళ్ళకు మనసారా మొక్కుకున్నాను,
కానీ ఒక్క పదంగానయినా కాలేక పరితపించాను.

నీవు చిత్రించి కళాఖండంగా నిలిచిన  చిత్తరువులో
ఒక్క వర్ణంగా నైనా ఒదిగిపోవాలని వందకుపైగా కలలుకన్నాను.
కానీ ఒక్కలవలేశంగానయినా వర్ణశకలంగానైనా కాలేకపోయాను.
కానీ ఇప్పుడు నాగుండేలో నీ ప్రతిరూపంగా
 ఓ శిల్పాన్ని ప్రతిష్టించు కున్నాను.

కనీసం ఒక్క క్షణంపాటైనా నివ్వెరపాటుకలిగించేలా
ఒక మందస్మిత నయనారవిందాగానయినా చిరుదరహాసం
కావాలనీ, నిన్ను చక్కిలగింతలోనయినా మురిసిపోతుంటే
కళ్ళారా చూడాలని ఎంతగానో ఊహలలో తేలిపోయాను.

కానీ నీకోసం సుదీర్ఘమయిన ప్రయాణాన్నయినా   గంటలతరబడి
చేయగల మొండితనాన్ని మాత్రం విశేషంగా సముపార్జించుకోగలిగాను.
నీకళ్ళల్లో మెరిసే తరగగా నయినా ఓ రెప్ప పాటు తళుక్కుమనాలని
అనవరతం అనేకమైన కలలుగంటూ కాలం వెచ్చించాను.
కానీ ఆ తారాగణంలో ఒక్క శకలంగానయినా కాలేక
ఇలా దు:ఖభాజనుడి   నయాను.

నీహృదయస్పందనలలో ఒక్క" లబ్ డబ్ "నయినాకావాలని కలలుగన్నాను.
కానీ తృటిపాటయినా ఆశబ్దానికి చేరువగా చేరుకోలేక ఖేదపడ్డాను.

అయినా అనునిత్యం నాలోనే ప్రతిష్ఠితమైననీ రూపంలో
నినదించే నాదంగా మిగిలిపోవాలని నాదానిగా నిన్ను అభ్యర్ధిoచకుండా
ఉండలేక ఈకవితను రాస్తూ ఓ అశ్రు   బిందువులోనైనా దర్శనమిస్తావని
ప్రతీక్షచేస్తూ  ఆనందాశ్రువులను ధారాపాతంగా వర్షిస్తూ,
పరమానంద భరితుడనై మిగిలిపోతున్నాను.
===============================================




Sunday, October 18, 2015

పూజాపుష్పం
-----------------రావెల
****************

ఒక్కదానివే అలానువ్వు ఒంటరిగా
కనరానిలోకాలకు కనిపించకుండా
నిష్క్రమించాక దిగులుగా,దిగాలుగా
ఆకాశంవైపు తలెత్తిచూసాను,
అంతటా కారుమబ్బులే బహుధా  విస్తరించి
నీ గుండె గొంతుకలో పెరుగుతున్న చీకటిని చెరిపివేయగల శక్తి
మాదగ్గరగల ఏ కాంతి చ్ఛటకూడా   డతొలగించలేదని
 చెప్పి నడచుకుంటూ గబ గబా వెడలిపోయింది.

ఎదురుగా ప్రవహిస్తున్న సెలయేటిదగ్గరకు వెళ్ళి
ప్రశ్నార్ధకంగా నిరుత్తరుడనై నిలుచున్నాను.
ప్రవాహగతినంతటా నిర్లిప్తతా, నిస్పృహా,
కంఠదఘ్నంగా వరదలై పారుతూండడమే
నాకు కన్నులెదుట నిజరూపంగా సాక్షాత్కరించింది.
 దు: ఖాన్ని  ఉసురుస్సురంటూ ఉరుకులుబెడుతూ కదలిపోయింది.

నువ్వు ప్రేమాస్పదంగా మనిoటిప్రాగణంలో పెంచి
పోషించిన పూలమొక్కల చెంతకు చేరి నిశ్శబ్దంగా
నిలుచుండిపోయాను.
ఆ మొక్కలపై గాలితో సయ్యాటలాడే పూలన్నీ
 ఏకకంఠంతో రకరకాల రంగులను వెలారుస్తూ
ఆనంద నర్తనం   చేయడం నేత్రపర్వంగా గమనించాను.

ఆక్షణంలోనే ఆకాశవాణి నా చెవుల్లో నాకు మాత్రమే
వినిపించేట్లుగా గుసగుసలాడడం వినబడింది.

నువ్వొక పూజాపుష్పంగా ఆ పరమాత్ముని
పాదసన్నిధిలో ప్రశాంతగా నిదురిస్తున్నావని
ఆపూలనవ్వుల కృతజ్ఞతాభావo లోని  అర్ధమదేనని
వివరణాత్మకంగా విశ్లేషించడంతో నాలో ఒక
చిరునవ్వు జనించి ఆనవ్వు మాత్రం 'నేనుండగా
దిగులెందుకు నీ కని ' అదృ శ్య మైపోవడం
 ఆశ్చర్య హేతువై నన్ను అలరించింది.
-----------------------------------









Saturday, October 17, 2015

నిన్నటిదాకా నన్నునేను
సమర్ధించుకోవడంలోనే
సమయమంతటినీ
దుబారాగా వెచ్చించాను.

ఇవ్వాళ్టినుంచీ నాతీరు
 పూర్తిగా మార్చుకుంటున్నాను
నన్ను నేను అర్ధంచేసుకోవడంలోనే
కాలాన్ని ఖర్చు చేసుకోవాలని
గట్టిగా తీర్మానించేసుకున్నాను.
============================

Friday, October 16, 2015

తొమ్మిది చిల్లుల లున్న యిది  తో లుతొజేసిన వింతబొమ్మ     తా
నమ్మినవారినెల్ల నడిసంద్రములోబడవేయునండి,  వా
జమ్మలనైన తా దలువ 'జెమ్ము"[ gem]గ తీర్చును దిద్దునీయిలన్
అమ్మరొ నాదు మాటలకు అర్ధను లేదని  యాగ్రహింతువా? 
-------------------
తిరముగ కష్టనష్టముల, తీరనిబాధల నిచ్చుచుండె  నో
హరహరమేదినిన్ సుఖము హాయిగబొందుట యెప్పుడోగదా
కరములమోడ్చి మొక్కెదను కాదనకుండగ నాదు జీవికన్
గురుతరమైన సేవలలొ గౌరవమొప్పగ జేయుమమ్మరో
-------------------------------