Friday, May 8, 2015

వేకువ ఝాముననే
వెలుతురును మోసుకొచ్చే
సుప్రభాతంపు సూర్యకిరణంలా ఉంటూనే

మిట్ట మధ్యాహ్నానికి అగ్ని పర్వతంలా
బద్దలయి భయ విహ్వలుడినై పోతున్నప్పుడు.

శీతల హిమ శిఖరం పైనుండి వీచే
మలయమారుతంలాంటి చల్లని పిల్లగాలిలా

చీకటిపడే సమయానికి చిరుమందాహాసాలను
పండించి నిశీధిని నిలువుపాతరవేసే చిరు దివ్వెలా!




మౌనంలోంచి మృత్యుకుహరాల్లోకి జారిపడిన
మనుషుల చరిత్రలను చదివానుగాని
మాటలు మంత్రిస్తూనే మౌనంగా
నిశ్శబ్దంలోకి నిష్క్రమించిన తపస్వినిగా
నిన్నొక్కదానినే నేను గమనింవాచు.


ఎక్కడని నిన్ను వెదకాలి?
మానుతుందని అందరూ వాక్రుచ్చినా మాటవినకుండా
సలపరం పెడుతున్న గుండెకు గునపం చెసిన గాయంలా

ఎంత కాలమని ఇలా ఒంటరిగా
నీకోసం నిరంతరం సాగే నిరీక్షణలో నిమిత్త మాత్రుడిగా
మిగిలిపోవాలి?

===============================

No comments:

Post a Comment