ప్రశాంతగా ప్రభాతాన
గవాక్షంలోంచో
ముందు తలుపు సందులోంచో
దూరొచ్చి ప్రేమానురాగంతో
పెదవి విప్పి పలుకరించే
భానుకిరణం నీవు.
సాయంత్రానికల్లా బహువర్ణ సంద్రంలో
అభ్యంగన స్నానమాచరించి పరుగుపరుగునా
కదలివచ్చిన అద్భుతంగా
ఆధునికపు హొయలొలకబోసే
సావకాశపు ఆకాశం కదా నువ్వంటే
చందమామతో పోటీ పడుతూ శ్వేతవర్ణ శోభితమై
అలరారే జ్యోత్స్నాంతర్హితపు జిగీషవుకదానీవు.
మల్లెపూల సుమసౌరభంపు పరీమళంకూడా నీవు
ఇవాళనువ్వు పుట్టినరోజు అమ్మలందరికీ
కమ్మని శుభాకాంక్షలనందుకుంటూ
కమనీయమౌ కన్నులవిందులుచేసుకునే
కాంక్షాతప్తపు అక్షయ పత్రవూ నీవే.
గవాక్షంలోంచో
ముందు తలుపు సందులోంచో
దూరొచ్చి ప్రేమానురాగంతో
పెదవి విప్పి పలుకరించే
భానుకిరణం నీవు.
సాయంత్రానికల్లా బహువర్ణ సంద్రంలో
అభ్యంగన స్నానమాచరించి పరుగుపరుగునా
కదలివచ్చిన అద్భుతంగా
ఆధునికపు హొయలొలకబోసే
సావకాశపు ఆకాశం కదా నువ్వంటే
చందమామతో పోటీ పడుతూ శ్వేతవర్ణ శోభితమై
అలరారే జ్యోత్స్నాంతర్హితపు జిగీషవుకదానీవు.
మల్లెపూల సుమసౌరభంపు పరీమళంకూడా నీవు
ఇవాళనువ్వు పుట్టినరోజు అమ్మలందరికీ
కమ్మని శుభాకాంక్షలనందుకుంటూ
కమనీయమౌ కన్నులవిందులుచేసుకునే
కాంక్షాతప్తపు అక్షయ పత్రవూ నీవే.
No comments:
Post a Comment