సశేషంగా---- రావెల
-------------------------------
అంతరాంతరాళాల్లో
అంతుపట్టలేనన్ని చీకట్లు.
గొంతు దిగము పోపొమ్మంటూ
సందేహాల సముద్రాలు
మనసంతటినీ పట్టికుదిపేసే
మాలిన్యం చుట్టుకున్న
హృదయగత భావాల పరవళ్ళు.
ఆధ్యాత్మికపు మేఘాలను
అవసరార్ధం
అరువు తెచ్చుకుంటున్న
ఆశోహహతులైన అదృష్టహీనుల
ఆక్రందనల ఆశ్వాసాల
మహా భారతాలు.
న్యాయానికినోరుమూసి
నేరాన్ని కప్పిపుచ్చుకోగలుగుతున్న
ధీరోదాత్త మనీషులనమనుకుమే
మృగయావినోదుల మూర్ఖ ప్రతాపాలు.
అన్నీ అఖండ భారతంలో
ఆలోచనకందనివ్వకుండా
లోవెలుగులను
బహిరంగం గా తలెత్తనివ్వని
బాధా సర్ప దంస్ట్రాంకురాలై
క్షతమైనా చ్యుతంకాని
గాత్రాల కులగోత్రాలు
============================
.
-------------------------------
అంతరాంతరాళాల్లో
అంతుపట్టలేనన్ని చీకట్లు.
గొంతు దిగము పోపొమ్మంటూ
సందేహాల సముద్రాలు
మనసంతటినీ పట్టికుదిపేసే
మాలిన్యం చుట్టుకున్న
హృదయగత భావాల పరవళ్ళు.
ఆధ్యాత్మికపు మేఘాలను
అవసరార్ధం
అరువు తెచ్చుకుంటున్న
ఆశోహహతులైన అదృష్టహీనుల
ఆక్రందనల ఆశ్వాసాల
మహా భారతాలు.
న్యాయానికినోరుమూసి
నేరాన్ని కప్పిపుచ్చుకోగలుగుతున్న
ధీరోదాత్త మనీషులనమనుకుమే
మృగయావినోదుల మూర్ఖ ప్రతాపాలు.
అన్నీ అఖండ భారతంలో
ఆలోచనకందనివ్వకుండా
లోవెలుగులను
బహిరంగం గా తలెత్తనివ్వని
బాధా సర్ప దంస్ట్రాంకురాలై
క్షతమైనా చ్యుతంకాని
గాత్రాల కులగోత్రాలు
============================
.